మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

దైవాసుర సంపద్విభాగ యోగః

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ షోడశో2ధ్యాయః
దైవాసుర సంపద్విభాగ యోగః
శ్రీ భగవాన్‌ ఉవాచ
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ ఆర్జవమ్‌ 1
శ్రీ భగవానుడు పలికెను - నిర్భయత్వము, అంతఃకరణశుద్ధి, తత్త్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగము నందు నిరంతర దృఢస్థితి, సాత్వికదానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతను, గురుజనును పూజించుట, అట్లే అగ్నిహోత్రాది - ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రము పఠన, పాఠనము మరియు భగవంతుని నామగుణ కీర్తనము, స్వధర్మాచరణము నందలి కష్టముకు ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతః కరణము సరళత్వము (ఆర్జవము) (1)
అహింసా సత్యమక్రోధఃత్యాగః శాంతిరపైశునమ్‌
దయాభూతేష్వలోుప్త్వం మార్దవంహ్రీరచాపమ్‌ 2
అహింస (మనోవాక్కాయము ద్వారా ఎవ్వరికిని ఏ విధముగను కష్టమును కల్గింపకుండుట), సత్యము (యధార్థమైన, ప్రియమైన భాషణము), అక్రోధము (తనకు అపకారము చేయువారిపైన కూడ కోపము లేకుండుట), త్యాగము (కర్మాచరణము నందు కర్త ృత్వాభిమానమును త్యజించుట), శాంతి (చిత్తచాంచ్యము లేకుండుట) ఆపైశునము (ఎవరినీ నిందింపకుండుట), దయ (అన్ని ప్రాణు యెడ నిర్హేతుక కృప), అలోుప్త్యము (ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట), మార్దవము (కోమత్వము), శాస్త్రవిరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట (సిగ్గుపడుట), అచాపము (వ్యర్థ చేష్టు చేయకుండుట). (2)
తేజఃక్షమా ధృతిఃశౌచమ్‌ అద్రోహోనాతిమానితా
భవంతి సంపదం దైవీమ్‌ అభిజాతస్యభారత 3
ఓ అర్జునా! తేజస్సు క్షమ, ధైర్యము, శౌచము (బాహ్యశుద్ధి) అద్రోహము (ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట) అమానిత్వము (తాను పూజ్యడనను అభిమానము లేకుండుట) మొదగునవి యన్నియును దైవీసంపద గవాని క్షణము. (3)
దంభోదర్పో2భిమానశ్చక్రోధఃపారుష్యమేవ చ
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‌ 4.
ఓ పార్థా! దంభము (కపటము), దర్పము (మొండితనము), అభిమానము, క్రోధము, పారుప్యము (మాట యందును, చేష్ట యందును కఠినత్వము), అజ్ఞానము మొదగునవి ఆసురీ స్వభావము గవాని క్షణము. (4)
దైవీసంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా
మా శుచః సంపదం దైవీమ్‌ అభిజాతో2సి పాండవ 5
ఓ అర్జునా! దైవీ సంపద ముక్తి దాయకము, ఆసురీ సంపద బంధ హేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక శోకింపకుము. (5)
దౌభూతసర్గౌె లోకే2 స్మిన్‌ దైవ ఆసుర ఏవ చ
దైవో విస్తరశఃప్రోక్తః ఆసురంపార్థమే శృణు 6
ఓ అర్జునా! ఈ లోకమున నున్న మానవు రెండు విధముగా ఉందురు. దైవ క్షణము గవారు కొందరు. ఆసుర క్షణము గవారు మరికొందరు. దైవ క్షణము విస్త ృతముగా త్పెబడినవి. ఇప్పుడు ఆసుర క్షణము గవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. (6)
ప్రవృత్తిం చ నివృత్తించ జనా న విదురాసురాః
నశౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే 7
ఆసుర స్వభావము గవారు ప్రవృత్తినివృత్తును (కర్తవ్యాకర్తవ్యమును) ఎరుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్ఠమైన గాని, ప్రవర్తన గాని, సత్యభాషణము గాని ఉండనే ఉండవు. (7)
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్‌
అపరస్పరసంభూతం కిమన్యత్‌ కామహైతుకమ్‌ 8
ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషు సంయోగ కారణముగ జీవు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున స ృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర క్షణము గవారు భావింతురు.
ఏతాం దృష్టిమవష్టభ్యనష్టాత్మానో2్పబుద్ధయః
ప్రభవంత్యుగ్రకర్మాణఃక్షయాయ జగతో2హితాః 9
అసంబద్ధమైన ఇట్టి మిధ్యావాదము చేయు భౌతిక వాదు ఆత్మను గూర్చి తంపరు. (ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు) వారు మందబుద్ధు. వారు అందరికిని అపకారము చేయు క్రూయి. వారి శక్తి సామర్థ్యము ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. (9)
కామమాశ్రిత్యదుష్పూరం దంభమానమదాన్వితాః
మోహాద్గృహీత్వా2 సద్గ్రాహాన్‌ ప్రవర్తంతే2 శుచివ్రతాః 10
దంభము, దురభిమానము, మదముతో గూడిన ఈ ఆసుర క్షణము గవారు యుకాయుక్తమును మరచి, తమ వాంఛను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యా సిద్ధాంతమును ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. (10)
చింతామపరిమేయాంచప్రయాంతాముపాశ్రితాః
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః 11
మరణించువరకును వారు అంతులేని చింతలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవము యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. (11)
ఆశాపాశశతైర్భద్దాఃకామక్రోధపరాయణాః
ఈ హంతేకామభోగార్థమ్‌ అన్యాయేనార్థ సంచయాన్‌ 12
వారు ఆశాపాశపరంపరచే ఎ్లప్పడును బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగము నిమిత్తమై, అన్యాయ మార్గము ద్వారా ధనార్థనకు ప్పాడుచుందురు. (12)
ఇదమద్యమయా బ్దమ్‌ ఇమం ప్రాప్స్యేమనోరథమ్‌
ఇదమస్తీదమపిమే భవిష్యతి పునర్ధనమ్‌ 13
‘‘నేను మిక్కిలి పురుషార్ధిని గనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని. ఇంకను నా మనోరథమున్నింటిని సాధించుకొనగను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది. మన్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగను’’ అని వారు తంచు చుందురు. (13)
అసౌమయా హతః శత్రుఃహనిష్యే చాపరానపి
ఈశ్వరో2హమహంభోగీసిద్ధోహంబవాన్‌ సుఖీ 14
నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువును కూడ వధింపగను. నేనే సర్వాధిపతిని, సమస్తసుఖభోగమును అనుభవింపగవాడను నేనే. సిద్దున్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బవంతుడను. (14)
ఆఢ్యో2భిజనవానస్మికో2న్యో2స్తి సదృశో మయా
యక్ష్యేదాస్యామి మోదిష్యఇత్యజ్ఞానవిమోహితాః 15
అనేక చిత్తవిభ్రాంతాః మోహజాసమావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే2శుచౌ 16
‘‘నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞమును చేయగను. దానము ఇయ్యగను. యథేచ్చముగా వినోదింపగను. - అనుచు అనేక విధముగా అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణమునకు లోనై మోహజాము నందు చిక్కుకొని, ఆసుర క్షణము గవారు విషయ భోగము యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకము యందు పడిపోవు చుందురు. (15-16)
ఆత్మసంభావితాః స్తబ్ధాధనమానమదాన్వితాః
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్‌ 17
వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై, ధన దురహంకారముతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై శాస్త్రవిరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞము నాచరించుదురు. (17)
అహంకారం బం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః
మామాత్మపరదేహేషు ప్రద్విషంతో2భ్యసూయకాః 18
అహంకారము, బము, దర్పము, కామము, క్రోధముకు వశులై, ఇతరును నిందించుచు తమ శరీరము యందును ఇతరు శరీరము యందును, అంతర్యామిగా నున్న నన్ను ద్వేషించు చుందురు. (18)
తానహం ద్విషతః క్రూరాన్‌ సంసారేషునరాధమాన్‌
క్ష్షిపామ్యజస్రమశుభాన్‌ ఆసురీష్వేవ యోనిషు 19
అట్ల్లు ఇతరును ద్వేషించు పాపాత్మును, క్రూరులైన నరాధమును మాటిమాటికిని ఈ సంసారము నందు ఆసురీయోనులోనే నేను పడవేయు చుందును. (19)
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌంతేయతతో యాంత్యధమాంగతిమ్‌ 20
ఓ అర్జునా! ఈ ఆసురీ ప్రకృతి గ మూఢు, నన్ను పొందకయే, ప్రతి జన్మ యందును ఆసురీయోనునే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకము యందు పడెదరు. (20)
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామఃక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్‌ 21
కామక్రోధ లోభము అను ఈ మూడును నరక ద్వారము. అవి ఆత్మ నాశమునకు కారణము. అనగా మనుజుని అధోగతి పాు చేయునవి. కనుక ఈ మూడిరటిని త్యజింపవలెను. (21)
ఏతైర్విముక్తఃకౌంతేయతమోద్వారైత్రిభిర్నరః
ఆచరత్యాత్మనఃశ్రేయఃతతో యాతి పరాం గతిమ్‌ 22
ఓ అర్జునా! ఈ మూడు నరకద్వారము నుండి బయటపడినవాడు శుభకర్మనే ఆచరించును. అందువన పరమగతిని పొందును. అనగా నన్నే పొందును. (22)
యఃశాస్త్రవిధిమత్సృజ్యవర్తతేకామకారతః
న స సిద్దిమవాప్నోతిన సుఖం న పరాం గతిమ్‌ 23
శాస్త్రవిధిని త్యజించి, యధేచ్చగా (విశృంఖముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాడు. వానికి ఇహ పరలోక సుఖము భింపవు. పరమగతియు ప్రాప్తింపదు. (23)
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వాశాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి 24
కర్తవ్యాకర్తవ్యమును నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్తోక్త కర్మను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మను ఆచరింపుము. (24)
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశో2ధ్యాయః 16

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి