మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ఆర్ష గ్రంథములే శాస్త్రములు మనకి


శాసు అనుశిష్టౌ అను ధాతువునకు ‘ష్ట్రన్‌’ ప్రత్యయము చేర్చిన ‘శాస్త్రమ్‌’ అను శబ్దమేర్పడును. శాస్త్రమనగా 
1. శిష్యతే అనేన ఇతి శాస్త్రమ్‌. ఆజ్ఞాపించునది, విధినిషేధమును బోధించు గ్రంథము.
2. శాసనాత్‌ శంసనాత్‌ ఇతి శాస్త్రమ్‌. శాసించునది శాస్త్రము.
3. ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేన వా ।
  పుంసాం యేనోపదిశ్యేత తచ్ఛాస్త్రమభిధీయతే ॥
శ్రేష్ఠమైన కర్మలో ప్రవర్తింపజేయుదానిని, దుష్కర్మ నుండి దూరము చేయుదానిని నిత్య, అనిత్య పదార్థమును (నిత్య పదార్థము R కారణ పదార్థముÑ అనిత్య పదార్థము R కార్య పదార్థము) ఉపదేశించువానిని శాస్త్రమ్‌ అని అంటారు.
4. శాస్త్రప్రయోజనం తత్త్వదర్శనం (చాణక్య సూత్రము)
శాస్త్రము యొక్క ముఖ్యోద్దేశ్యము తత్త్వ పదార్థము (తత్త్వ పదార్థము R కారణ పదార్థము, మూపదార్థము) జ్ఞానము కలిగించుట. ఈ క్షణము వేదాది ఆర్ష గ్రంథములోనే కనిపిస్తాయి. కావున అవియే శాస్త్రపదవాచ్యము.
న వేదశాస్త్రాదన్యత్తు కిఞ్చిచ్ఛాస్త్రం హి విద్యతే ।
నిఃసృతం సర్వశాస్త్రం తు వేదశాస్త్రాత్‌ సనాతనాత్‌ ॥
                (యాజ్ఞవ్క్యస్మృతి 12-1)
వేదశాస్త్రముకు భిన్నమైనదింకొక శాస్త్రము లేదు. సమస్తశాస్త్రము సనాతనవేదము నుండియే ఆవిర్భవించినవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి