మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

సత్యభామ - నరకాసుర వధ

నరకాసుర వధ
    ఒకసారి ఇంద్రుడు ద్వారకకు వచ్చి కృష్ణుడిని సందర్శించాడు. మాటల్లో మాటగా నరకాసురుని ప్రస్తావన తెచ్చాడు. కృష్ణా! అదితి దేవతకు అమ్మ కదా! ఆమెదు:ఖాన్ని చూడలేకపోతున్నాము అన్నాడు. ఏమిటి విషయమని కృష్ణుడు ప్రశ్నించాడు.
    అదితి కర్ణకుండలాు నరకాసురుడు ఎత్తుకుపోయాడని అది దేవలోకానికేఅశుభమనీ, వరుణుని ఛత్రం, అమరాద్రి వీటిని అన్నిటినీ తరలించుకుపోయాడనీ చెప్పాడు ఇంద్రుడు. నా వజ్రాయుధం కూడా వాడిని ఏమీ చేయలేకపోయింది. బగర్వంతో దేవతల్ని అవమానించి బాధు పెడుతున్నాడు. నీవే దిక్కని మొఱ పెట్టుకున్నాడు ఇంద్రుడు.
    కృష్ణుడు ఇంద్రునికి అభయ ఇచ్చి నరకునిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇంతలోనే సత్యభామ నేనూ వస్తాను మీతో.. నా కోరికను కాదనకుమని ప్రార్థించింది. కృష్ణుడు మొదట సత్యభామను వద్దని వారించాడు కానీ చివరకు వ్లిందించి తనతో యుద్ధభూమికి గైకొనిపోయాడు.
    నరకుడి పట్టణం ప్రాగ్జ్యోతిపురం. అక్కడకు చేరి గరుడు వాహనందిగగానే మురాసురునితో యుద్ధం జరిగింది. వాడికి అయిదు తలు. మహా క్రూరుడైన రాక్షసుడు. వాడు కృష్ణుడి చేతిలో మరణించగానే తామ్రుడు అంతరిక్షుడు శ్రవణుడు విభావసుడు మొదలైన ఏడుగురు యోధు కృష్ణుడితో యుద్ధం చేసారు. కృష్ణుడు బాణవర్షం కురిపించి వారినందర్నీ సంహరించాడు.
    ఈ సంగతి తొసుకొన్న నరకాసురుడు కోపంతో ఊగిపోయాడు. రథం మీద యుద్ధరంగానికి ఉరికి వచ్చాడు. శ్రీకృష్ణుడు చిరనగవుతో చేతిమ్లి సత్యభామకు అందించాడు. ఆమె వింటినారి మ్రోగించింది. దిగ్గజము చెవు గళ్లుపడ్డాయి.     నరకుడు కోపంతో ఊగిపోయాడు.
    ఒక్క అడది తనను యుద్ధానికి ఆహ్వానించడమా! అని అహంకారంతో ఆమెపై బాణప్రయోగం చేసాడు. సత్యభామ హేగా విలాసంగా బాణాు ప్రయోగించింది. బొమ్మ పెండ్లిళ్లకే పోలేని సుకుమారి యుద్ధరంగానికి ఎలా వచ్చింది? నెమళ్లకు నాట్యం నేర్పడానికే అసిపోయే సుందరాంగి గరుడునిపై కూర్చుని పరభయం కారణంగా శత్రుసంహారం ఎలా చేస్తోంది? ఎవరికీ అర్థం కాలేదు.
    నరకుడు ఆమె బాణాకు మూర్ఛపోయి మర తెలివొంది కృష్ణా మగవాడివైతే నువ్వునాతో యుద్ధం చేయి. ఆడవారి పక్కనుండి యుద్ధం చేయడం పురుషు క్షణమా? అన్నాడు.
    కృష్ణుడు సత్యభామతో సత్యా! వీరపత్నివనిపించుకున్నావు... ఇంక చాు! నీ శౌర్యంచూసి నేను గర్విస్తున్నాను. అంటూ ఆమె చేతిలోని మ్లినందుకున్నాడు. నరకుడు ప్రయోగించిన శూలాన్ని చక్రాయుధంతో విరిచేసాడు. వెంటనే చక్రం నరకుని శిరస్సును ఖండిరచింది. సైన్యమంతా చెల్లాచెదురయింది.
    నరకుని మంత్రుకి కబురు పెట్టాడు కృష్ణుడు. వాళ్లు నరకుని కుమారుడైన భగదత్తున్ని వెంటబెట్టుకొచ్చి ప్రణామాు చేసారు. రాజ్యానికి భగదత్తున్ని రాజుగా చేసి ప్రజకు బాధు లేకుండా పరిపాలించండి అని అజ్ఞ ఇచ్చాడు. వాళ్లు కృష్ణునికి మొక్కి వెళ్లిపోయారు. నరకుని చెరలో ఉన్న రాజుకు, రాజకన్యకు విముక్తి కలిగించాడు. సత్యభామతో కలిసి గరుడుడిపై స్వర్గలోకానికి వెళ్ల్ల్లి దేవమాత అదితి కర్ణకుండలాు సమర్పించాడు శ్రీకృష్ణుడు. ఇంద్రుడు సచీదేవి సత్యాకృష్ణును ఘనంగా సన్మానించాడు. గరుడవాహనంపై సత్యాకృష్ణులిద్దరూ భూలోకానికి బయుదేరారు. నందనవనం మీదుగా ప్రయాణం సాగుతోంది. వికసించిన పారిజాత పుష్పా వాసన మైమరపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి