మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

బలిచక్రవర్తి - మహావిష్ణుభక్తుడు

అందరివంటివాడు కాడు
బలిచక్రవర్తి అందరు రాక్షసువంటివాడు కాదు. మహావిష్ణుభక్తుడు. అయితే ఇతని విష్ణుభక్తి వక్రమార్గం పట్టింది. విష్ణువుకు తప్ప యజ్ఞాల్లో దేవతకెవ్వరికీ హవిస్సు (అన్నం) ముట్టకుండా శాసనం చేసాడు. దేవతకు నైవేద్యాు లేవు. పూజు లేవు. వారంతా నకనకలాడిపోయారు.
    అలా చేస్తే విష్ణువు సంతోషిస్తాడా? తన ప్లిల్ని చావగొట్టి తనకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఏ తల్లైనా సంతోషిస్తుందా? దేవతు అంటే ఎవరు? విష్ణు భక్తులే కదా!
    నన్ను పూజించడం మానుకొని అయినా సరే నా భక్తుల్ని ఎవరు పూజిస్తారో వారే నాకు ఇష్టమైనవారు అని కదా శ్రీహరి చెప్పాడు. ఏ ప్రాణిని హింసించినా శ్రీహరికి కోపం వస్తుంది. ఎందుకంటే అతడు సర్వాంతర్యామి కదా!
    ఈ రహస్యం తెలిసినా బలిచక్రవర్తి తన వక్రబుదిణధని సరిచేసుకునే యత్నంచేయలేదు. దేవత నోటికి ఒక్క ముద్దకూడా కట్టడి చేసాడు. చేసిన 99 యజ్ఞాలోనూ ఒక్క విష్ణువుకే ఆరాధన.
    దేవత దు:ఖం చూడలేక వారి తల్లి అదితి వ్రతం చేసింది. విష్ణువు ఆమెకు ప్రత్యక్షమైయ్యాడు. ఆ తల్లి తన బిడ్డలైన దేవత పాట్లు ఏకరువు పెట్టింది. నేను నీ బిడ్డగా పుట్టి ఈ కష్టం తొగిస్తానని శ్రీహరి ఆమెకు అభయం ఇచ్చాడు.
అదితి గర్భం దాల్చింది. దివ్య తేజస్సుతో శ్రీహరి ఆమె కడుపున వామనుడుగా జన్మించాడు. కశ్యపప్రజాపతి ఒక శుభముహూర్తాన వామనునికి ఉపనయనం చేసాడు. దేవతందరూ కశ్యపుని ఆశ్రమానికి వచ్చి వటువును దీవించారు. పార్వతీ పరమేశ్వయి కూడా విచ్చేసారు. పార్వతి వామనునికి భిక్షాపాత్రను బహూకరించింది.
    వామనుడు తండ్రివద్ద విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. తల్లిదండ్రు సంతోషానికి మేరలేదు. వామనుని చదువు చాలా ఆశ్చర్యం. తండ్రినోట పలికిన పాఠాన్నీ వామనునికి కంఠస్థమైపోయేవి. మొత్తం శాస్త్రాన్నీ పదిహేను దినాల్లో పూర్తి అయ్యాయి. వామనున్ని చూసి అదితి ఎంతో మురిసిపోయింది. నా నోము పంట! నా వరా తండ్రి! అన్నను (దేవతను) ఉద్ధరిస్తాడు అంటూ ముద్దులాడేది.
    బలిచక్రవర్తి గొప్ప యజ్ఞం గావిస్తున్నాడు. మమంతా అక్కడికే వెళుతున్నాం. మా క్కూడా వస్తావా? గొప్ప దక్షిణు భిస్తాయి. అన్నారొకనాడు కొందరు బ్రాహ్మణు. వామనుడు తల్లిదండ్రు అనుజ్ఞను గైకొని వారితో బయుదేరాడు. చాలా రోజు ప్రయాణం చేసి బలి యజ్ఞశాకు చేరాడు వామనుడు. వామనుని దివ్య తేజస్సును చూసిన అక్కడి వారికి మతు పోయాయి. ఆ సమయానికి బలిచక్రవర్తి యజ్ఞానంతరం దానధర్మాు చేస్తున్నాడు. అంతలో వామనుని వంతు కూడా వచ్చింది.
    దానవ చక్రవర్తీ! నీకు స్వస్తి! అని చేయెత్తి దీవించాడు వామనుడు.
ఎంతో పొంగిపోయాడు బలిచక్రవర్తి.
    బ్రహ్మచారీ! నీకేం కావాలో కోరుకో...
    మూడడుగు నే కావాలి! అంతే! ఇంకేమీ వద్దు....
    నా అంతటి దాతకు ఈ దానం సిగ్గు చేటుకదా? నుగురూ నవ్విపోరా? గొప్ప సంపదు ఏమైనా అడగవయ్యా?...
    రాక్షసరాజా! నాకు మూడడుగు నే యిస్తే ముల్లోకాు ఇచ్చినట్లే... చిరునవ్వు చిందించాడు వామనుడు.
    అందుకు సరే నన్నాడు బలిచక్రవర్తి. భార్య వింధ్యావళి బంగారు గిన్నెలో నీళ్లు పోయబోయింది.
    శుక్రాచార్యు జరుగుతున్న మోసాన్ని గ్రహించినాడు.
    రాజా ఈ వామనుడు సామాన్యుడు కాడు. నీ రాజ్యం తీసుకుని ఇంద్రునికి ఇవ్వడానికి అవతరించిన విష్ణువు. మోసపోకు. దానం ఇవ్వద్దు... అన్నాడు బలిచక్రవర్తితో.
    బలి చక్రవర్తి అందుకు చిన్నగా నవ్వి...ఆచార్యా! విష్ణువు అంతటివాడు యాచకునిగా వస్తే లేదంటానా?  నాచేయి పైనుండడం కింద శ్రీహరి చేయి ఉండడం నా వంశానికే గొప్ప కదా!....మానధను మాట తిరుగలేరుకదా.. అడ్డురాకండి ఈ దానం ఇస్తున్నాను. అంటూ భార్య పోసిన నీటితో వామనుని పాదాు కడిగి తపై పోసుకొని మూడడుగు నేదానం చేసాడు.
త్రివిక్రముడు
    ఆ మరుక్షణం ఇంతింతై ఇంతై అంతై అన్నట్లు అన్ని లోకాని దాటుకొంటూ పెరిగిపోసాగాడు. ఒక పాదంతో భూమండలాన్ని, ఇంకో పాదంతో స్వర్గలోకాన్నీ ఆక్రమించాడు. రాక్షస చక్రవర్తీ... ఇక మూడో పాదానిక స్థమేదీ? ఎక్కడ పెట్టమంటావు? అని అడిగాడు.
    బలికి తొసుగా ఈ వామనుడే విష్ణువు అని... చేతు జోడిరచి మొక్కి మహాత్మా మూడవ పాదాన్ని నా తపై ఉంచి నన్ను ధన్యున్ని చేయి అన్నాడు.
    వామనుడు బలి తపై ఉంచి తొక్కి పాతాళలోకాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. పాతాళలోకాన్ని నీవు పాలిస్తున్నంతకాం నేనే నీకు రక్షకుడిగా ఉంటాను అన్నాడు శ్రీహరి.
    బ్రహ్మాది దేవతు వచ్చి వామనున్ని స్తుతించారు. నీ దయవ్ల ఈనాటినుండి మేం సంతోషంగా ఉంటాం అన్నారు. ఇంద్రుడు మళ్లీ అమరావతికి రాజైనాడు.
పరుశురామావతారం
జమదగ్ని ఆశ్రమం
    వేటవాడి అసిపోయిన కార్య వీర్యార్జునుడు తన సైన్యంతో జగమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన రాజును స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించాడు జమదగ్ని.
    రాజా నీవూ నీ సైన్యం అసిపోయారు. మా విందును స్వీకరించి విశ్రాంతి తీసుకుని వెళ్లండి.
    అయ్యా ఆశ్రమ నివాసులైన మీకు మా ఇంతమందికి విందు అంటే తకు మించిన భారం కదా! మీ దర్శనం కలిగింది. హోమధేనువును తీసుకువచ్చి తండ్రికి అప్పగించాడు.
క్షత్రియ సంహారం
    కార్తవీర్యుని కొడుకుకు ఇకా పగ చల్లారలేదు. ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వారంతా ఒక్కుమ్మడిగా వచ్చి జమదగ్ని త నరికిపోయారు. వృద్ధురాలైన రేణుక ఏం చేస్తుంది? రామా రామా అని 21 సార్లు అరుస్తూ గుండొ బాదుకుంటూ ఏడ్చింది.
    పరశురాముడు తల్లి పిుపుల్ని లెక్కపెట్టుకుంటూ అడవిలో నుండి పరుగెత్తుకుని వచ్చాడు ఆశ్రమానికి.
    అప్పటికే జగరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తండ్రి జమదగ్ని త నరకబడి శవమై పడి ఉన్నాడు. తల్లి రేణుక ఏడుస్తూ జరిగిన విషయం పరశురాముడికి చెప్పింది.
    పరశురాముడు కారుద్రుడైనాడు. ఈ భూమ్మీద రాజన్నవాడు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. గండ్రగొడ్డలి చేతబూని దేశం మీద పడ్డాడు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు. ఇరవై ఒక్క సార్లు.
    అప్పటికి రాముడు శాంతించాడు. ఆ రాజు రక్తంతో శమంతపంచకం అను పేరున అయిదు మడుగు ఏర్పరచి పితృదేవతకు రత్త తర్పణం చేసాడు.
    ఆ తర్వాత సరస్వతీ నదిలో స్నానం చేసి పవిత్రుడై సమస్త భూమండలాన్ని కశ్యపునికి దానం చేసి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.
    అహంకారంతో గర్వంతో విర్రవీగుతున్న రాజుల్ని సంహరించి భూభారం తగ్గించడానికే శ్రీహరి పరశురామునిగ అవతరించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి