దీనిని పురుషార్థము అని కూడ అంటారు. అనగా ప్రతి మనుష్యుడు ప్రయత్నపూర్వకముగ క్రియాశీుడై సాధించవసినది - పొందదగినది. అది ధర్మము, అర్థము, కామము, మోక్షము - పరమాత్మ సాక్షాత్కారము అని నాుగు విధము. నాుగవదైన మోక్షమును అత్యంతపురుషార్థమని కూడా అంటారు.
ధర్మము: ప్రపంచములోని మానవుందరు ఆచరించదగినది. పక్షపాతములేని న్యాయము, అందరికి హితముచేయుట, భగవంతుని ఆజ్ఞను పాలించుట, అసత్యమును త్యజించుట, సత్యమును గ్రహించి ఆచరించుట.
అర్థము: మనము జీవించుటకు ఉపయోగపడే వస్తువు. ఆహార పదార్థము, వస్త్రము, గృహము, ధనము, గృహములో వాడుకొనే విభిన్న వస్తువు.
కామము: అనగా కోరిక. ధనసంపాదన, గృహనిర్మాణము, భూమును సంపాదించుట, కీర్తిప్రతిష్ఠను సంపాదించుట, ఉన్నత ఉద్యోగము కావానుకొనుట. ఈ కోరికు హద్దు దాటకూడదు.
మోక్షము: అన్నిరకము దుఃఖమునుండి విడిపోయి భగవంతునిలోని ఆనందమును - సుఖమును అనుభవించుట. అది భగవంతుని సాక్షాత్కారము వన కుగును. ఆ సుఖము ఎంత అనుభవించినను తనివితీరదు. లోకములోని ఇతర సమస్తసుఖము తాత్కాలికము. అవి సుఖముతో పాటు దుఃఖమును కలిగించును. వివేకవంతుని దృష్టిలో జగత్తులోని అన్ని పదార్థము దుఃఖమును కలిగించునవే. మోక్షమును పొందినవానికి శరీరము ఉండదు. సుదీర్ఘకాము వరకు ఆనందమునే అనుభవిస్తాడు. అతనికి ఏ విధమైన దుఃఖము ఉండవు. శరీరములో ఉన్నప్పుడే దుఃఖము ఉంటాయి. ధర్మము, అర్థము, కామము అను మూడు పురుషార్థము మోక్షమును పొందుటకు సాధనములే. మోక్షమే జీవితము యొక్క ముఖ్య ఆశయము - ఉద్దేశ్యము. అది మానవజన్మలోనే సాధ్యము. అదే మానవుని గమ్యము, పరమావధి.
ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదవేదీన్మహతీ వినష్టిః ।
భూతేషు భూతేషు విచిన్త్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవన్తి ॥
(కేనోపనిషత్తు 2-5)
ఈ మానవ శరీరమందున్న జీవుడు పరమాత్మను తెలిసికొని అతనిని సాక్షాత్కారము చేసికొన్నప్పుడు ఈ జన్మ సఫము. దానికై ప్రయత్నించక ఇంద్రియలోుడై విషయముందు చిక్కుకొన్నవానికి కుగు నష్టమును ఇంత అని చెప్పలేము. అది ఊహించడానికి మీలేనిది. అందుకే విద్వాంసు ధ్యానశీురై ఈ చరాచర జగత్తునందలి జడచేతనపదార్థములో అతి సూక్ష్మమై వ్యాపించియున్న పరమాత్మను నిశ్చయపూర్వకముగ తెలిసికొని జన్మ మరణరూపమైన బంధనమునుండి - దుఃఖమునుండి విడిపోయి బ్రహ్మానందమును అనుభవిస్తారు. పామయి విషయలోురై దుఃఖమును అనుభవిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి