1. ఋ గతౌ అను ధాతువునకు ‘ణ్యత్’ ప్రత్యయము చేర్చినచో ఆర్య శబ్దమేర్పడును. ఈ ధాతువునకు జ్ఞానము, గమనము, ప్రాప్తి అని అర్థము. ఆర్య శబ్దమునకు ఈ క్రింది అర్థము కవు.
ఆర్యుడు R జ్ఞానవంతుడు.
గతిశీుడు, కర్మశీుడు.
ధర్మార్థకామమును త్రివిధపురుషార్థముచే
ఉత్కృష్టమైన మోక్షమును పొందువాడు.
2. శాంతిస్థితిక్షుర్దాన్తశ్చ సత్యవాదీ జితేన్ద్రియః ।
దాతా దయాుర్నమ్రశ్చ ఆర్యః స్యాదష్టభిర్గుణైః ॥ (మహాభారతము)
1. శాంతగుణము, 2. సహనశీత, 3. మనోనిగ్రహము, 4. సత్యభాషణము, 5. ఇంద్రియ- జయత్వము, 6. దానశీత, 7. దయాగుణము, 8. నమ్రత - వినయము అను ఈ ఎనిమిది గుణము గ వ్యక్తిని ఆర్యుడని అంటారు.
3. ఆర్య ఈశ్వరపుత్రః । (నిరుక్తము 6-26)
ఆర్య శబ్దము ఈశ్వరవాచకము. ఆర్యస్య అపత్యం ఆర్యః. ఆర్య శబ్దమునకు అపత్య (సంతానము) అర్థములో ‘అణ్’ ప్రత్యయము చేరి ఆర్యశబ్దము ఏర్పడును. అనగా ఈశ్వరుని కుమారుడు ఆర్యుడు అని అర్థము. ఈశ్వరుని గుణకర్మస్వభావముకు అతని ఆజ్ఞకు అనుకూముగ వ్యవహరించువాడు ఆర్యుడు.
4. ఆర్యః R మాన్యః, ఉదారచరితః, శాన్తచిత్తః న్యాయపథావంబీ, ప్రకృతాచారశీః (శాస్త్రానుకూమైన ఆచారశీుడు) సతతకర్తవ్యకర్మానుష్ఠాతా. (ప్రాచీనకోశము)
5. మహాకుకులీన (శ్రేష్ఠుడు) ఆర్యసభ్యసజ్జనసాధవః (అమరకోశము)
ఇవి అన్ని సమానార్థక శబ్దము.
6. అర్తుం ప్రకృతమాచరితుం యోగ్య ఆర్యః.
శాస్త్రానుకూ ఆచారమునకు యోగ్యుడు ఆర్యుడు.
7. ఆర్యాః శ్రేష్ఠగుణకర్మస్వభావయుక్తా మనుష్యాః (దయానంద సరస్వతి)
శ్రేష్ఠమైన గుణకర్మస్వభావము కవారు ఆర్యు.
ఈ విధముగ మన ప్రాచీన భారతీయసాహిత్యమున ఆర్య శబ్దము గుణవాచకముగనే భించును. అందుచే ఈ భూగోళముపైననే కాదు ఈ విశ్వములో పైన చెప్పిన గుణము గ వ్యక్తి ఎచ్చటనున్నను ఆర్యశబ్ద వాచ్యుడే. అంతే కాని ఆధునికచరిత్ర ప్రకారము జాతివాచకము కాదు. కావున ఈశ్వరుడు వేదము ద్వారా కృణ్వన్తో విశ్వమార్యమ్ అని బోధించినాడు. అనగా విశ్వములోని మానవునందరిని ఆర్యుగా - శ్రేష్ఠుగా చేయుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి