మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ఋషులెవరు?


ఋషీ గతౌ అను ధాతువునకు ‘ఇగుపధాత్‌ కిత్‌’ (4-121) అను ఉణాది సూత్రముచే ‘ఇన్‌’ ప్రత్యయము చేర్చినచో ఋషి శబ్దమేర్పడును.
ఈ శబ్దార్థము -
1.     ఋషతి గచ్ఛతి ప్రాప్నోతి జానాతి వా స ఋషిః మన్త్రార్థద్రష్టా వా ॥
                (ఉణాదికోషము 4-121 వ్యాఖ్య)
క్రియాశీుడు, జ్ఞానవంతుడు, ఉన్నతాశయమును సాధించువాడు మరియు వేదమంత్రము అర్థమును దర్శించువాడు ఋషి.
2.     ఋషిర్దర్శనాత్‌ స్తోమాన్‌ దదర్శ ఇత్యౌపమన్యవః ॥ (నిరుక్తము 2-11)
ఋషి అనగా సమాధిస్థితి యందు వేదమంత్రమును సాక్షాత్కారము చేసికొనువాడు.
3. ఋషయో మన్త్రద్రష్టారః న తు మన్త్రకర్తారః ।
ఋషు వేదమంత్రమును దర్శించువారే కాని ఆ మంత్రముకు కర్తు కారు.
4.     సాక్షాత్కృతధర్మాణ ఋషయో బభూవుః । (నిరుక్తము 1-20)
ధర్మమును సాక్షాత్కారము చేసికొన్నవారు ఋషు.
5.     మహర్షయస్తే దదృశుర్యథావత్‌ జ్ఞానచక్షుషా ।
      సామాన్యం చ విశేషం చ గుణాన్‌ ద్రవ్యాణి కర్మ చ ॥ (చరకము)
మహర్షు జ్ఞానచక్షువు ద్వార ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయమును (వైశేషిక దర్శనమందు చెప్పబడిన) పదార్థమును సాక్షాత్కారము చేసిరి.
6.    రజస్తమోభ్యాం నిర్ముక్తాస్తపోజ్ఞానబలేన యే ।
      యేషాం త్రికామమం జ్ఞానమవ్యాహతం సదా ॥
    ఆప్తాః శిష్టాః విబుద్ధాస్తే తేషాం వాక్యమసంశయమ్‌ ।
    సత్యం వక్ష్యన్తి తే కస్మాదసత్యం నీరజస్తమాః ॥
    (చరకసంహితా, సూత్రస్థానము అ.11-18, 19)
ఎవరు రజస్తమోగుణమునుండి విముక్తులో (అనగా కేవము సాత్త్విక గుణము కవారు) తపోజ్ఞానబముచే ఎవరి జ్ఞానము త్రికాములో (భూత, వర్తమాన, భవిష్యత్‌ కాము) మరహితమై ఎ్లప్పుడు ఖండిరపబడనిదిగా ఉండునో వారు ఆప్తు, శిష్టు, విశిష్టమైన బుద్ధిగవారు. వారి వాక్యము సంశయరహితము. వారు సత్యమునే చెప్పుదురు. రజస్తమోగుణరహితు అసత్యమును చెప్పరు.
7.     ఆప్తః ఖు సాక్షాత్కృతధర్మా. యథా దృష్టస్యార్థస్య
    చిఖ్యాపయిషయా ప్రయుక్త ఉపదేష్టా । సాక్షాత్కరణమర్థస్య
    ఆప్తిః । తయా ప్రవర్తత ఇత్యాప్తః ॥ (న్యాయదర్శనము 1-1-7 వాత్సాయన భాష్యము)
ధర్మమును సాక్షాత్కారము చేసికొన్నవారు, ప్రమాణము ద్వారా అర్థమును - విషయమును నిశ్చయము చేసి వారు దానినేవిధముగ తెలిసికొన్నారో అదేవిధముగ దానిని ప్రసిద్ధము చేయు కోరికతో ప్రేరితులై ఇతరుకు ఉపదేశము చేయువారు ఆప్తు. అర్థము - విషయము యొక్క సాక్షాత్కరణము ఆప్తి. దానివన ప్రవృత్తుడగుట వన ఆప్తుడు.
8.    శిష్టాః ఖు విగతమత్సరా నిరహంకారాః కుమ్భీధాన్యా ।
    అలోుపా దమ్భదర్పలోభమోహక్రోధవివర్జితాః ॥
శిష్టులైనవారు నిశ్చయముగ మాత్సర్యములేనివారు, అహంకారరహితు, అపరిగ్రహు - ఆ రోజుకు సరిపడు పదార్థమును నిువ ఉంచుకొనువారు, ఇచ్ఛారహితు, దంభము, దర్పము, లోభము, మోహము, క్రోధము లేనివారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి