విద్య అవిద్యను జ్ఞానము, అజ్ఞానము అని కూడా అంటారు. విద్య అనగా జ్ఞానము, అవిద్య అనగా అజ్ఞానము అని అర్థము.
వేత్తి యథావత్ తత్వపదార్థస్వరూపం యయా సా విద్యా ।
మనుష్యుడు ఏ సాధనము ద్వారా తత్త్వపదార్థము స్వరూపమును యథార్థముగా - ఉన్నది ఉన్నట్లుగా తెలిసికుంటాడో దానిని విద్య లేక జ్ఞానము అని అంటారు. దానికి విపరీతమైన దానిని - వ్యతిరేకమైనదానిని అవిద్య లేక అజ్ఞానము అని అంటారు.
అవిద్య క్షణమును యోగదర్శనము నందు పతంజలిమహర్షి ఇట్లు సూత్రీకరించినాడు.
అనిత్యాశుచిదుఃఖానాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా. (యోగదర్శనము 2-5)
ఈ సూత్రమునందు జ్ఞాతవ్య - తెలిసికొనదగిన పదార్థమును నాుగు రకాుగ విభజించినాడు. 1. అనిత్యము, నిత్యము 2. అశుచి, శుచి 3. దుఃఖము, సుఖము 4. అనాత్మ - జడము, ఆత్మ - చేతనము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి