మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

నిత్యకర్మలు



    పఞ్చ ర్ణప్తా మహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినామ్‌ ॥ (మనుస్మృతి 3-69)
ఐదు మహాయజ్ఞము గృహస్థుడు ప్రతినిత్యము చేయదగినవి. అవి 1. బ్రహ్మయజ్ఞము 2. దేవయజ్ఞము 3. పితృయజ్ఞము 4. అతిథియజ్ఞము 5. బలివైశ్వదేవయజ్ఞము.
1. బ్రహ్మయజ్ఞము : ప్రతినిత్యము ప్రాతఃకామున లేచి స్నానాదికములైన ఆవశ్యకమును పూర్తిచేసి జీవాత్మ పరమాత్మను విచారించుట. దీనిని సంధ్యోపాసన అనియు నందురు. మరియు వేదశాస్త్రము స్వాధ్యాయము.
    బ్రాహ్మే ముహూర్థే బుద్ధ్యేత ధర్మార్థౌచానుచింతయేత్‌ ।
    కాయక్లేశాంశ్చ తన్మూలాన్‌ వేదతత్త్వార్థమేవ చ ॥ (మనుస్మృతి 4-92)
ప్రతినిత్యము బ్రహ్మముహూర్తమున ఉదయము గం. 4-00 కు లేవవలెను. ధర్మార్థమును, శారీరిక క్లేశమును - దుఃఖమును, వాటి కారణమును మరియు సృష్టియొక్క మూతత్త్వమును విచారించవలెను - ఆలోచించవలెను. భగవంతుని ధ్యానము చేయవలెను.
2. దేవయజ్ఞము : అగ్నిహోత్రము మొదుకొని అశ్వమేధపర్యంతము గ యజ్ఞము చేయుట. శుద్ధ హవనకుండములో పవిత్ర ప్రజ్వలితాగ్నిలో ఆహుతిగా వేసిన హుతద్రవ్యము మూడు రూపముగా మారుతుంది. 1. అగ్నిలో కాలి కుండములో మిగిలిన బూడిద. 2. ఆ హుతద్రవ్యములో గ గుణము. అది అగ్నివన అతి సూక్ష్మముగా మారి సర్వత్ర వ్యాపించును. వాతావరణమును శుద్ధముగా చేయును.
అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ।
ఆదిత్యాజ్జాయతే వృష్టిర్‌ వృష్టేరన్నం తతః ప్రజాః ॥ (మనుస్మృతి 3-76)
అగ్నిలో వేసిన ఆహుతి సూక్ష్మముగా మారి సూర్యమండము వరకు చేరును. అచ్చట సూర్యునిలో పరితప్తమై అతి సూక్ష్మముగా మారి ఎన్నోరెట్ల శక్తితో తిరిగి భూమిపైకి వచ్చును. దీనివన అగ్ని, జము, వాయువు, ఆకాశము, పృథివి, ఓషధు, వనస్పతు, చంద్రుడు, నక్షత్రము, సూర్యుడు మొదగు భౌతిక దేవతు శక్తివంతమగును. ఇవి తిరిగి మనకు ఎన్నో రెట్ల శక్తిని ప్రసాదించును. చక్కటి వర్షము కురియును. ఆ వర్షము వన శక్తివంతమైన పంటు పండును. ఆ పంట ఆహారము వన మానవు బమైన శరీరము కలిగియుందురు. ఇది అతి సూక్ష్మమైనది. యజమాని సూక్ష్మశరీరములో సంస్కారముగ చేరును. జీవాత్మ స్థూశరీరమును వదలి వెళ్ళినపుడు సూక్ష్మశరీరము జీవునితోనే ఉంటుంది. ఈ సూక్ష్మశరీరమున చేరిన ఆహుతు శ్రద్ధావిశ్వాసముగ మారి జీవుని సుందరమైన, సుఖప్రదమైన లోకములో - శరీరములో చేర్చును. చనిపోయిన పిమ్మట జీవుని వెంట వచ్చునవి కేవము ధార్మిక కర్మ సంస్కారము మాత్రమే.
3. పితృయజ్ఞము : గృహములోనున్న తల్లి, తండ్రి మరియు ఇతర వృద్ధు సేవచేయుట వారికి కావసిన ఆహారము, వస్త్రము మొదగు పదార్థమును సమకూర్చి వారికి దుఃఖము కుగకుండ చూచుట. అట్లే గురువు, సాధువు, మహాత్ము మొదగువారి సేవచేయుట. దీనివన వారి ఆశీర్వాదము దానివన ఉన్నతి కుగును.
    అభివాదనశీస్య నిత్యం వృద్ధోపసేవినః ।
    చత్వారి తస్య వర్ధన్త ఆయుర్విద్యాయశో బమ్‌ ॥ (మనుస్మృతి 2-121)
పెద్దను నమస్కారాదుచే గౌరవించు స్వభావము గవానికి నిత్యము వృద్ధును సేవించువానికి ఆయుష్షు, విద్యా, కీర్తి, బము పెరుగును.
4. అతిథియజ్ఞము : సూచన లేకుండ, ఆహ్వానము లేకుండ అపరిచిత విద్వాంసుడు, పరివ్రాట్‌ - సంన్యాసి మన ఇంటికి వచ్చినపుడు అతనికి స్వాగతమొసంగి సత్కరించి అన్నపానాదు నొసంగుట. ఇది భారతీయ సంస్కృతిలో ఉజ్జ్వమైన విధానము.
5. బలివైశ్వదేవయజ్ఞము : సమస్తప్రాణు మేుకొరకై ప్రయత్నము చేయుట. అందరిసుఖమునకై భగవంతుని ప్రార్థించుట. వంట పూర్తి అయిన పిదప మనము భుజింపకముందు ఉప్పు, కారము కవని పదార్థమును (తీపిగవి, అన్నము మొదగునవి) పొయ్యిలోని నిప్పులో ఆహుతుగా వేయుట. మనము పోషించు జంతువు ఆవు మొదగువానికి ఆహారము నొసంగుట.
2. నైమిత్తిక కర్ము:
ఇవి పర్వము - పండుగు మొదగు సందర్భములో చేయునవి. నూతన సంవత్సరము (ఉగాది), సంక్రాంతి, శ్రావణి, విజయదశమి, దీపావళి, హోళి మొదగు పర్వదినముందు పెద్ద పెద్ద యజ్ఞమును చేయుదురు.
3. కామ్యకర్ము :
విశేషకోరికతో చేయునవి. పుత్రేష్టి, వర్షేష్టి, ఇష్టాపూర్తము (వాపీకూపతటాకారామాదు). ఇవి సమాజము యొక్క శ్రేయస్సును కోరి చేయునవి.
కర్ము ఇంకొక పద్ధతిలో సంచితకర్ము, ప్రారబ్ధకర్ము, క్రియమాణ కర్ము అని మూడు విధము.
1. సంచిత కర్ము : పూర్వజన్మలో చేసిన కర్ము. వీటివన శరీరము, పరిచారము, బుద్ధి దేశము మొదగునవి భించును.
2. ప్రారబ్ధకర్ము : ఇవి సంచిత కర్మలోనివి ఈ జన్మలో మన భాగ్యము లేదా అదృష్టముగ మారునవి. లోకములో కొందరు మంచి కర్ము చేస్తున్నను దుఃఖమును పొందుటను చెడు కర్ము చేయుచు సుఖమును పొందుటను చూస్తుంటాము. ఈ సుఖదుఃఖము ప్రారబ్ధకర్మ ఫమే గాని వర్తమాన కర్మ ఫము కావు.
3. క్రియమాణకర్ము : ఈ జీవితములో చేయునవి ఈ కర్ము చేయుటలో జీవు స్వతంత్రు. ఫము ననుభవించుటలో పరతంత్రు. ఈ కర్మపైన ప్రారబ్ధకర్మ ప్రభావము ఉండును. మనము చేయు ప్రతి కర్మకు ఫము ననుభవింపక తప్పదు.
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి