మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

సత్యభామ - పారిజాతం

దేవపారిజాతం
    కృష్ణా! అవి ఏమి పుష్పాు? ఎంత తీయటి వాసన? అంది సత్యభామ. అవి పారిజాత పుష్పాు. దేవలోకానికే పరిమితమైనవి సత్యా! అన్నాడు కృష్ణుడు.
    సత్యభామ ఆ పారిజాత వృక్షాన్ని తమతో తీసుకుపోదామంది. కృష్ణుడు కొంచెం సేపు తటపటాయించాడు. ఇప్పుడేగా నా యుద్ధ ప్రావీణ్యాన్ని మెచ్చి ఏమి కోరినా తీర్చుతానని మాట ఇచ్చారు. మరచిపోయారా? అంది సత్యభామ గోముగా.  ఇక లాభం లేదనుకొని గరుత్మంతునికి నందనవనంలో దించమని ఆదేశించాడు. సత్యాకృష్ణు కాసేపు నందనవనంలో హఆయిగా విహరించారు. కృష్ణుడు ఒంటిచేత్తో ఆ మహా వృక్షాన్ని పెకిలించి గరుత్మంతునిపై పెట్టి సత్యతో బయుదేరాడు. ఇంతలో... తోట కావలి వారివ్ల జరుగుతున్న సంగతి తొసుకొని వజ్రాయుధాన్ని చేతబూని సైన్యంతో వచ్చాడు ఇంద్రుడు. గరుడుడి రెక్క గాలికే ఆ సైన్యమంతా కొట్టుకుపోయింది. వజ్రాయుధం ప్రయోగించాడు ఇంద్రుడు. అది కృష్ణుని కంఠంలో పూమాగా మారిపోయింది.
    పారిజాత వృక్షాన్ని సత్యభామ ఇంటి పెరటిమొక్కగా నాటి ఆమెను ఆనందింపజేసాడు కృష్ణుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి