రుక్మిణీ కల్యాణం
విదర్భదేశంలో కుండిన పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్నాడు భీష్మకుడు. ఆ మహారాజుకు అయిదుగురు కొడుకు. రాకుమారుకడగొట్టు ముద్దు చెల్లి రుక్మిణి. యువరాజు అయిన రుక్మి తన చెల్లొ రుక్మిణిని శిశుపాునకిచ్చి పెండ్లిచేయడానికి నిర్ణయించాడు. రుక్మిణికి శిశుపాున్ని వరించడం ఇష్టంలేదు. ఆమె తన పురోహితుడైన అగ్నిద్యోతనున్ని పిలిపించుకుని ఆయన చేతికి ఒక లేఖ ఇచ్చింది. ద్వారకకు పోయి ఆ లేఖను కృష్ణుని ఇచ్చి రమ్మని వేడుకుంది. అగ్నిద్యోతనుడు ద్వారకకు వెళ్లి కృష్ణుని చేతికి ఆ లేఖనిచ్చాడు.
ఆ లేఖలో రుక్మిణి కృష్ణుని గురించి తాను ఎన్నో కథు విన్నానని ఆయన లీలు తనను ఎంతగానో ఆకర్షించాయని వ్రాసింది. దయతో తనను చేపట్టి పరిణయమాడుమని తన అన్నగారు శిశుపాునికిచ్చి పెండ్లి చేయానుకుంటున్నాడని ఆ వివాహం తనకు ఇష్టం లేదని లేఖ వ్రాసింది. అంతేకాదు తమ ఆచారం ప్రకారం దుర్గాదేవికి పూజ చేయడానికి ఆయానికి వచ్చినపుడు తనను తీసుకుపొమ్మని నీవు వచ్చి తీసుకోకపోతే తనకు మరణమే శరణమని వ్రాసింది.
శ్రీకృష్ణుడు సంతోషంతో రుక్మిణిని పెండ్లి ఆడటానికి అంగీకరించి అగ్నిద్యోతనున్ని రథమెక్కించుకొని కుండినపురానికి బయుదేరాడు. ఊరిపొలిమేర దగ్గర పురోహితున్ని దించి రుక్మిణికి తాను వచ్చినట్లు కబురు పంపాడు.
నా భాగ్యం ఎలా ఉందో అని చింతిస్తూ రుక్మిణి చెలికత్తెతో కలిసి దుర్గాదేవి ఆయానికి బయుదేరింది. కూడా ముత్తైదుమ మేళతాళాతో బయుదేరారు.
అమ్మా! సనాతనులైన ఉమామహేశ్వరులారా! మిమ్మల్నే నమ్మి ఉన్నాను. శ్రీకృష్ణున్ని నాకు పతిగా చేయండి అంటూ భక్తితో పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థించింది. గుడి బయట రుక్మిణిని చూడటానికి రాజకుమారును వందమంది బాయి దీరి నిుచున్నారు. ఇంతలో ఎక్కడినుండి వచ్చాడో కృష్ణుడు కనురెప్పపాటు కాంలో రుక్మిణిని చేయిపట్టుకుని రథం మీదకు తీసుకున్నాడు. మరుక్షణం గుఱ్ఱాు దౌడు తీసాయి.
రాజకుమాయి కోపంతో చిందులేసారు. కృష్ణుడిపై సమరానికి దిగారు. రథాన్ని వెంబడిరచారు. కృష్ణుడు ఒంటరిగా వెళ్లాడని అప్పటికే బరాముడు సైన్యాన్ని అక్కడకు తీసుకువచ్చి ఉన్నాడు. సంకు సమరం జరిగింది. రాజకుమాయి తోకముడిచారు. యాదవ సైన్యం ధాటికి ఆగలేకపోయారు. కానీ రుక్మిణి పెద్ద అన్నగారు మాత్రం కృష్ణున్ని వదలేదు. నోటికి వచ్చిన దుర్భాషలాడుతూ వెంటపడ్డాడు. బాణాు వేస్తూనే ఉన్నాడు. కృష్ణుడు రథాన్ని ఆపాడు. వెళ్లి రుక్మిణిని పట్టుకుని కత్తి తీసాడు. రుక్మిణి కళ్లతోనే వారించింది. ప్రార్థించింది. కృష్ణుడు కత్తితో రుక్మి త సగం కొరికి మీసం గొరిగి వికృతాకారంగా మార్చి వేసాడు. రుక్మి సిగ్గుపడి మొహం చూపలేక అక్కడే కూబడిపోయాడు.
శుభముహూర్తాన రుక్మిణీ కృష్ణు వివాహం జరిగింది. ఇంద్రుడు శచీదేవి వచ్చి మివైన కానుకు సమర్పించారు. దేవకీ వసుదేవు కొడుకును కోడలినీ చూసి మురిసిపోయారు. పెండ్లికి వచ్చినవారంతా విందు భోజనాు చేసి కట్నకానుకు అందుకొని వెళ్లిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి