మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

సంన్యాసము :


యదహరేవ విరజేత్తదహరేవ ప్రవ్రజేత్‌, వనాద్వా, గృహాద్వా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్‌ ॥
ఏ రోజు వైరాగ్యము కుగునో ఆ రోజే వనమునుండి గాని, గృహమునుండి గాని, బ్రహ్మచర్యమునుండి గాని సంన్యాసము గ్రహింపవలెను.
పూర్ణవిద్వాంసుడు, జితేంద్రియుడు, విషయభోగము కోరికలేనివాడు, పరోపకారము చేయు కోరిక గవాడు బ్రహ్మచర్యమునుండియే సంన్యాసమును గ్రహింపవచ్చును.
దురాచారి, శాంతిరహితుడు, మనస్సునేకాగ్రము చేయలేనివాడు సంన్యాసమునకు యోగ్యుడు కాడు.
ప్రాజాపత్యాం నిరూప్యేష్టిం సర్వవేదసదక్షిణామ్‌ ।
ఆత్మన్యగ్నీన్సమారోప్య బ్రాహ్మణః ప్రవ్రజేద్గృహాత్‌ ॥ (మనుస్మృతి 6-38)
ప్రజాపతి - పరమేశ్వరుని ప్రాప్తికొరకు యజ్ఞముచేసి యజ్ఞోపవీతశిఖాది చిహ్నమును వదలి ఆహవనీయము మున్నగు అగ్నును ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమును పంచప్రాణముం దారోపించి బ్రాహ్మణుడు - బ్రహ్మవిదుడు ఇంటినుండి వెడలి సంన్యాసి కావలెను.
పక్షపాతరహిత న్యాయాచరణము, సత్యగ్రహణము, అసత్యపరిత్యాగము, వేదోక్తమగు ఈశ్వరాజ్ఞా పానము, సత్యభాషణము మొదగునవి అన్ని ఆశ్రమవాసుకు సమానమే. సంన్యాసి వీటి ఆచరణలో ఏమాత్రము పొరపాటు చేయరాదు.
ఉపదేశసమయమందు కాని, సంవాదమందు గాని, ఎవరైన కోపముతో సంభాషించినను తానతనిపై కోపింపక అతని కల్యాణార్థమై సదుపదేశము చేయవలెను.
రాగద్వేషరహితుడు ఇంద్రియమును అధర్మాచరణనుండి నిరోధించి అందరితో మిత్రభావముతో ప్రవర్తించుచు మోక్షము కొరకు యోగాభ్యాసము ద్వారా సామర్థ్యము వృద్ధిపరచుకొనవలెను.
దండము, కమండము, కాషాయవస్త్రము మొదగునవి ధరించుటయే ధర్మము కాదనియు పరిభ్రమణము చేయుచు మనుష్యుందరకు సత్యోపదేశ విద్యాదానముచే ఉన్నతి కలిగించుటయే సంన్యాసి ముఖ్యధర్మమని నిశ్చయముగా తెలియవలెను.
ఇచ్చట వర్ణాశ్రమము గురించి సంక్షిప్తముగా వ్రాయబడినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి