మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ఋణం


    మౌనబాబా విచ్చేసాడన్న వార్త ఆ ప్రాంతమంతా చైతన్యం కలిగించింది. బాబాకి దేశవ్యాప్తంగా గొప్ప పేరుంది. ఆ ప్రాంతా జనం తమ వ్యాపకాకు, వ్యవహారాకు విశ్రాంతి నిచ్చేసి బాబా దర్శనానికి ఎగబడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర ఉన్న ఏనుగువానింకలో గోదావరి ఒడ్డున మజిలీ  చేసాడు బాబా.
    కాషాయ వస్త్రాు ధరించే మౌనబాబా సన్నగా, పొడవుగా ఉంటాడు. గడ్డం, మీసాు అతని ముఖ కవళికను కప్పేస్తుంటాయి. అనిర్వచనీయమైన తేజస్సు చూపులో తీక్షతాను. అతని వయసును అంచనా వేయడం కష్టం. కాని, బాబా వయసు వందేళ్ళపైనేనని చెప్పుకుంటారంతా! కాయసిద్ధి, తపోదీక్ష ఫంగా వయసు కనిపించదన్నది వారి నమ్మకం. మౌనమే అతని భాష్యం. అతను మూగవాడో, లేక మౌనదీక్షని వహించిన యోగిపుంగవుడో ఎవరికి తెలియదు. ఎవరేమి అడిగినా చూపులే అతని  సమూధానమౌతాయి. వాటికి అతని శిష్యులే తత్పర్యం చెబుతారు.
    గత పదిహేనేళ్ళుగా సరస్వతీనియమైన బాసరలో గోదావరీ తీరాన స్థిరాశ్రమం కల్పించుకుని
ఉంటూను మౌనబాబాకి స్వదేశంలోనేకాక విదేశీ భక్తుూ ఎక్కువే. ఎన్నడూ ఆశ్రమం వదలి ఎరుగని బాబా తొలిసారిగా ఆశ్రమం నుండి కదడం విశేషం. హఠాత్తుగా శిష్యగణంతో పాదయాత్రకు పూనుకున్నాడతను.
    మధ్య మధ్య మజిలీతో సాగిన మౌనబాబా పాదయాత్ర కడకు ఏనుగువానింకను చేరుకుంది. గ్రామస్తు పూర్ణకుంభంతో బాబాకి స్వాగతం పలికారు. కొద్ది రోజుపాటు బాబా అక్కడే గడపబోతున్నట్లు తొసుకున్న వారి ఆనందానికి మేర లేకపోయింది. ఊరి చివర గోదావరి ఒడ్డున టెంట్‌ హౌస్‌ నిర్మించి బస ఏర్పాటుచేసారు.
    నిత్యమూ పరిసర ప్రాంతానుండి జనం తండోపతండాుగా వచ్చి బాబాను దర్శించుకోసాగారు. తమ తమ శక్తి కొద్దీ ధన, కనక, వస్తు రూపాలో భక్తితో కాన్కు సమర్పించుకోసాగారు. తమ కష్టసుఖాను వెళ్ళబోసుకుని ఆశీస్సును పొందసాగారు. మౌనబాబా కేవం తన ద ృక్కుతో భక్తు ఇక్కట్లను బాపి శుభాు కుగజేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. దాంతో ఎక్కడెక్కడినుండో వచ్చే దర్శకు సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోయింది. ఫలితంగా ఆశ్రమంలో ‘హుండీు’ వెసాయి.
    రోజుకు మూడుసార్లు ఓ గంటసేపు బాబా దర్శనం భిస్తుంది. మిగతా వేళల్లో బాబా లోప ధ్యానముద్రలో ఉంటాడు! ఆ సమయంలో భజను జరుగుతాయి. రాత్రు పురాణశ్రవణం జరుగుతుంది.
    సుమారు పదిహేనేళ్ళ క్రితపు మాట.
    మొగ్తూరు జమీందారు బంధువైన రుద్రమరాజు ఏనుగువానింకలో ఉంటాడు. మిక్కిలి ఆస్టిపరుడు. చుట్టుపక్క గ్రామాన్నిటికీ మకుటంలేని మహారాజు. రాజకీయాను సైతం శాసించగ దిట్ట. ముప్పై ఐదేళ్ళ రుద్రమరాజు ఆజానుబాహుడు. దృఢమైన శరీరంతో రాజసం ఉట్టిపడుతూంటాడు. ఐశ్వర్యం, అధికారం, రాజకీయ పుకుబడి తెచ్చిన ఠీవి, దర్పం, గాంభీర్యం, అహంకారం అతని సొత్తు.         రుద్రమరాజు భార్య శకుంత అతనికంటి ఐదేళ్ళు చిన్నది. త్లెగా, సన్నగా, పొడవుగా, అందంగా ఉంటుంది. రాజు పిల్లే ఐనా దిగువ మధ్య తరగతికి చెందినది. భీమవరానికి చెందిన శకుంతను ఓసారి మావుళ్ళమ్మ జాతరలో రుద్రమరాజు చూడడం జరిగింది. ఆమె అందం ఆకట్టుకోవడంతో, పెద్ద అంగీకారంతో ఆమెను పెళ్ళిచేసుకున్నాడు.
    శకుంత అప్పటికి డిగ్రీ ఫైనలియర్లో ఉంది. చదువు పూర్తయేంతవరకు పెళ్ళిచేసుకోనంది. కాని, గొప్పింటి సంబంధం. అయాచితంగా వచ్చింది. ఉబ్బితబ్బిబ్బైన ఆమె తల్లిదండ్రు ఆమెను ఒప్పించి పెళ్ళి జరిపించేసారు.
    రుద్రమరాజు భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఆమె కూడా అనుకూవతి ఐన భార్య, సామాన్య కుటుంబం నుండి వచ్చిన శకుంత పుష్కమైన పాడిపంటు, పువురు నౌకర్లు చాకర్లతో కళకళలాడే ఆ ఇంట్లో అడుగుపెడుతున్నప్పుడు భయపడిరది. సిగ్గు, బిడియము, బెరుకుతనము పెనవేసుకున్నాయి. ఇంతే క్రమంగా ఆ జమీందారీ పద్దతుకు, ఆచారవ్యవహారాకు అవాటుపడిపోయింది. అత్తింట అందరినీ మెప్పించగలిగింది.
    అష్టైశ్వర్యాు ఇచ్చిన భగవంతుడు రుద్రమరాజ దంపతుకు ఓ తీరని లోటు చేసాడు. అదే, సంతాన లేమి! పెళ్ళయి పదేళ్లయినా వారికి ప్లిు పుట్టలేదు. దంపతు గుళ్ళూ గోపురాూ తిరిగారు. పూజూ పునస్కారాూ చేసారు. వ్రతాూ, హోమాూ చేసారు. ఫలితం లేకపోయింది.
    తమ వంశం కొడుకుతోనే అంతమైపోతుందేమోనన్న భయం పుట్టుకుంది రుద్రమరాజు తల్లి క్మీదేవమ్మను. దంపతుకు వైద్య పరీకు చేయిస్తే బాగుంటుందని సహా ఇచ్చారెవరో దాన్ని త్రోసిపుచ్చిందామె. తన కొడుకు మగసిరి గ మన్మధుడు. అతనిలో ఎట్టి లోపమూ ఉండదుగాక ఉండదు. కనుక కోడలే గొడ్రాన్న నిర్ణయానికి వచ్చేసింది. వంశాభివ ృద్ధి కోసం కొడుక్కి రెండో పెళ్ళి చేయాన్న ఆలోచనలో పడిరది.
    శకుంతకు ప్లింటి మక్కువ, పెళ్ళి అయి అన్నేళ్లయినా ప్లిు పుట్టకపోవడంతో లోపం ఎక్కడ ఉన్నదో తెలియక బెంగపడిరది, తన తల్లికి ముగ్గురు సంతానం, అమ్మమ్మకూ అంతే. అటువంటిది, తాను గొడ్రాు అవుతుందంటే నమ్మలేక పోతోంది, ఓసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు రహస్యంగా డాక్టర్‌ చేత పరీక్షు వేయించుకుంది ఆమె. తనలో ఏ లోపమూ లేనట్టు తేలింది. కనుక లోపమంటూ ఉంటే భర్తలోనే ఉండానిపించింది.
    భర్త ఆరోగ్యవంతుడే! సంసారసుఖాన్ని అందించడంలో సమర్ధుడే. ఐనా సంతానం కగకపోవడానికి గ కారణమేమిటో ఆమెకు బోధపడలేదు.ఆమె భర్త కూడా వైద్య పరీక్షు చేయించుకుంటే, స్వ్ప లోపం ఏదైనా ఉంటి వైద్యంతో సరిచేసుకోవచ్చునంది డాక్టర్‌, కాని, శకుంత లేడిప్లి లాంటిది. సింహాన్ని శాసించే ధైౖర్యము, సాహసమూ ఆమెకు లేవు. సంతాన వైఫ్యం నిమిత్తం డాక్టర్ని సంప్రదించడమన్నది ఘోర అవమానంగా భావించే రాజు కుటుంబమది.
    అత్తగారు తనకు విడాకు ఇప్పించి కొడుక్కి రెండో పెళ్ళి చేసే ప్రయత్నంలో ఉందన్న వార్త లోపాయకారిగా శకుంత చెవిని సోకింది. ఆ కుటుంబంలో అత్తగారు ఎంత చెబితే అంత ఆమె మాటను తోసిపుచ్చగ దైర్యం రుద్రమరాజుకు కూడా లేదు. ఆమె తచుకున్నది నెరవేరి తీరుతుంది.కాళ్ళ క్రింద భూమి క ృంగిపోతున్నట్టనిపించింది శకుంతకు, ఆందోళనతో నిద్రాహారాు కరవయ్యాయి.
    క్ష్మీదేవమ్మ చెల్లెలి కొడుకు నరసరాజు చించినాడలో ఉంటున్నాడు. అతను చానాళ్ళుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. ఓసారి రుద్రమరాజు ఊళ్ళ లేని సమయంలో నరసరాజుకు సిరియస్‌ గా
ఉందని కబురు వచ్చింది. క్ష్మీదేవమ్మ వెంటనే కోడల్ని తీసుకుని కారులో చించినాడకు వెళ్ళింది.
    నరసరాజు పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆ స్థితిలో వదిలి ఇంటికి వెళ్ళిపోవడానికి క్ష్మీదేవమ్మకు మనస్కరించలేదు. ఐతే మూడు రోజుగా కొనసాగుతూన్న తుఫాను వాతావరణం ముదిరి పెద్ద గాలివానకు దారితీసింది. కుంభవ ృష్టితో వరదనీరు గ్రామాను ముంచెత్తే ప్రమాదం ఏర్పడిరది. ఇంటివద్ద పరిస్థితి ఎలా ఉన్నదో తెలియదు. పాలేళ్ళు పనివాళ్ళు గొడ్డు గోదాని జాగ్రత్తగా చూసుకుంటున్నారో లేదో తెలియదు. అందువ్ల వాతావరణం భీభత్సరూపాన్ని దాల్చే సూచను కానవస్తున్నా, జాగ్రత్తగా తీసుకువెళ్ళమని డ్రైవర్‌కి చెప్పి, కోడల్ని ఇంటికి బైుదేరదీసింది క్ష్మీదేవమ్మ. తాను చెల్లెలికి తోడుగా ఉండిపోయింది.
    కొంత దూరం వెళ్ళేసరికి తుఫాను తాకిడి ఉధ ృతమైంది. వ ృక్షాు గాలికి నేకూలాయి. కారు ముందుకు కదలేని పరిస్థితి. దారి కడ్డంగా పడ్డ్ద చెట్లను తొగించడానికి ప్రయత్నించి విఘడయ్యాడు డైవర్‌ రాముడు. పాతికేళ్ళుంటాయి వాడికి ఇంకా పెళ్ళి కాలేదు.
    ఉరుము, మెరుపు తోడవడంతో ప్రక ృతి భీభత్సంగా ఉంది. గాలి తాకిడికి కారు ఏటిలోని నావలా అల్లాడిపోతోంది. లోప కూర్చున్న శకుంతకు, రాముడికీ ఏ క్షణంలో ఏ చెట్టు కారుపైన కూుతుందోనని ప్రయంగా ఉంది. మెరుపుకాంతిలో సమీపంలో ఓ డాబా కనిపించింది. కారు దిగి వర్షంలో తడుస్తూనే అటువైపు నడిచారు ఇద్దరూ, అది ఓ ప్రభుత్వ పాఠశా, మూసియుంది. వరండాలో న్చిుని తడిసి ముద్దెన దుస్తుల్ని పిండుకోసాగింది శకుంత.
    అదే సమయంలో పెద్ద శబ్దం చేస్తూ చేరువలో ఎక్కడో పిడుగు పడిరది. అదరిపడ్డ శకుంత భయంతో పక్కనే ఉన్న రాముణ్ణి గట్టిగా కావలించుకుని వాడి వక్షానికి బల్లిలా అతుక్కుపోయింది.

    ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రా సరిహద్దులో గోదావరి ఒడ్డున ఉన్న గ్రామమది. నదీతీరాన తకు తీవ్రగాయాతో, ముఖుమంతా గాట్లతో ఆపస్మారక స్థితిలో కొన ఊపిరితో పడున్న ఓ వ్యక్తిని చూసిన గ్రామస్తు వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజు తరువాత కాని తెలివిలోకి రాలేదు అతను, ఆ యువకుడు ఏ ప్రాంతపువాడో తెలియలేదు. తన ప్రాణాు కాపాడినందుకు కనుతోనే క ృతజ్ఞతు తొపుకున్నాడే తప్ప పెదవి విప్పలేదు అతను. తకు తగిలిన గాయం కారణంగా నోటిమాట ఏడిపోయిందేమో ననుకున్నారు. లేదన్నారు డాక్టర్లు. ట్రామా కారణం కావచ్చునన్నారు.
    నెల్లాళ్ళ తరువాత కోుకున్నాడతను. ఆరోగ్యం పూర్తిగా నయమైపోయింది కాని, నోరు మాత్రం మెదపడడంలేదు. తన వివరాు చెప్పడం లేదు. విసుగెత్తిన గ్రామస్తు అతన్ని గ్రామం నుండి పంపేయానుకున్నారు.
    ఐతే సూరపురెడ్డి అసు సిసలైన రాజకీయవేత్త. స్వప్రయోజనం, స్వలాభం చేకూర్చే వ్యాపార దక్షత అతని సొంతం. ఆగంతకుణ్ణి చూస్తూంటే సూరపురెడ్డి బుర్రలో ఐడియా సెల్‌ ఆగకుండా మ్రోగింది. అతగాడిలో కోట్ల ఆదాయం కన్నుకు కట్టింది. గ్రామపెద్దతో సంప్రదింపు జరిపాడు.
    ఫలితంగా - అక్కడికి సుమారు వంద మైళ్ళ దూరంలో ఉన్న బాసరలో సరస్వతీదేవి ఆయానికి ఆమడ దూరంలో ఓ శుభదినాన మౌనబాబా వెసాడు.!
    బాబా హిమాయా నుండి విచ్చేసాడనీ.అతని వయసు నూటయాభైకి పైచిుకేననీ. మౌనమే అతని భాష్యమనీ. అతని చూపు పడ్డవారి జన్మ ధన్యమౌతుందనీ, భక్తు ఇక్కట్లు పిక్కబం చూపవసిందేననీ. విశేషంగా ప్రచారం జరిగింది.
    ఏ పుట్టలో ఏ పాముందో!’ అనుకునే గొర్రె మనస్తత్వం కలిగిన జనాు, ఏ సాములోరి దగ్గర ఏ  మహాత్మ్యముందో’’ అనుకుంటూ, మౌనబాబా దర్శనానికి తండోపతండాుగా వచ్చారు. శిష్య భక్త గణాు
ఏర్పడిపోయాయి. బాబా కట్నకానుకను స్వీకరించడు. కనుక వాటికోసం ఆశ్రమమంతా హుండీు
వెసాయి. భక్తు బాబాకి తమ కష్టాను నివేదించుకుని, నైవేద్యం ఆ హుండీలో వేసేవారు.
    అనతికాంలోనే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన రెండు వంద ఎకరా స్థంలో పక్కా ఆశ్రమం ఏర్పడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది. బ్లెం ఉన్న చోటి చీమూ చేరడం సహజం, ఆశ్రమ నిర్వహణ నిమిత్తం ఓ ట్రస్ట్‌ ఏర్పడిరది. దానికి సూరపురెడ్డి అధ్యకుడైతే, ఆ గ్రామానికి చెందిన మోతుబరుంతా సభ్యు.
    మౌనబాబా మహాత్మ్యం, అతీత శక్తును గూర్చి దేశవిదేశాలో అశేష ప్రచారం బరగడంతో విదేశీ భక్తు సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఫారిన్‌ ఫండ్స్‌ కూడా ధారాళంగా వచ్చిపడ్డాయి.కాక్రమాన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యా సంస్థు, ఆసుపత్రు వెసాయి. ట్రస్ట్‌ ఆదాయంతోపాటు సూరపురెడ్డి బృందం యొక్క ఆస్తిపాస్తుూ దినదినాభివృద్ధి చెందడం విశేషం.
    శకుంత నీళ్ళసుకోవడంతో అందరి అనుమానాు, సందేహాూ పటాపంచలైపోయాయి. అందరికంటె మిక్కిలి సంతోషించింది క్ష్మీదేవమ్మ. ఎట్టకేకు వారసుడొకడు ఉద్భవించబోతున్నాడని, కొడుక్కి రెండో పెళ్ళి చేసే ఆలోచనను విరమించుకుంది. నెలు నిండాక పండంటి కొడుకును కన్నది శకుంత, తల్లి అందం, రంగూ పుణికిపుచ్చుకుని ముద్దులొుకుతూన్న కొడుకును చూసుకుని మురిసిపోతూ మీసం మొలేసాడు రుద్రమరాజు. అతని తల్లి కూడా చంటాట్టి కణం వదడంలేదు.
    ఓ రోజున కొడుకుతో ఆడుకుంటూన్న రుద్రమరాజు చూపు పసివాడి ఎడమ అరచేతిలో ఉన్న
శంఖం గుర్తుపైన పడ్డాయి. చంటాడు ఎప్పుడూ గుప్పిళ్ళు మూసుకుని ఉండడంవ్ల అంతవరకూ అది రుద్రమరాజు కంట పడలేదు. ఇప్పుడు దాన్ని చూడగానే విభ్రాంతికి గురయ్యాడు. ఏదో అనుమానపు వీచిక అతని మదిని బంగా తాకింది. అందుక్కారణం-డైవర్‌ రాముడి ఎడమ అరచేతిలో సరిగా అదే చోట శంఖుపు గుర్తు ఉండడమే!
    తల్లి నిజం, తండ్రి నమ్మకమూ నంటారు. రుద్రమరాజు భార్యను అనుమానించలేకపోతున్నాడు. అలాగని, రాముడికి ఉన్న చోటే, అదే గుర్తు తన కొడుక్కి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తన అనుమానాను బైటపెట్టలేదు అతను. భార్యను, రాముణ్ణి రహస్యంగా కనిపెట్ట నారంభించాడు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించలేదు. అలాగని, ఎంత ప్రయత్నించినా మనసుకు సరిపెట్టుకోలేకపోతున్నాడు.ఎక్కడో, ఏదో జరిగిందనిపిస్తోంది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో మాత్రం బోధపడడంలేదు.
    బారసా రోజున పిల్లాడికి క ృష్ణంరాజని నామకరణం చేయబడిరది, అదే రోజు రాత్రి డైవర్‌ రాముడు అదృశ్యం కావడం విశేషం!
    ఏనుగువానింకలో గోదావరి ఒడ్డున కొువైయున్న ‘‘మౌనబాబా దర్శనం కోసం జనం విశేషంగా ఎగబడడంతో అక్కడ నిత్య తిరునాళ్ళే ఐంది. అజ్ఞాత స్త్రీ ఒకామె బాబా దర్శనానికి అప్పుడప్పుడు వస్తూండేది. ముఖానికి చీరచింగు కప్పుకుని, దూరం నుండే బాబా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూండేది. పళ్ళు ఫహారాూ తీసుకొచ్చేది.
    డ్రైవర్‌ రాముడు అదృశ్యమయ్యాక అతని తల్లి, చెల్లొ అనాధయ్యారు. ఎలాగో గంతకు తగ్గ బొంతను చూసి కూతురికి పెళ్ళి చేసేసిన రాముడి తల్లి సుబ్బాయమ్మ, ఒంటరిదై పేదరికంలో మ్రగ్గుతోంది. దానికి తోడు కొంతకాంగా క్షయవ్యాధి పట్టి పీడిస్తోంది ఆమెను. కుటుంబానికి ఆదరువైన ఒక్కగానొక్క కొడుకు ఏమైపోయాడో తెలియక కుమిలిపోయినా, ఏనాటికైనా తిరిగి రాకపోతాడా అన్న ఆశ ఆమెను జీవింపచేస్తోంది.
    ఊళ్ళకి బాబా ఎవరో వచ్చాడంటూ అతని మహిమను గూర్చి అంతా గొప్పగా చెప్పుకుంటూంటే, సుబ్బాయమ్మ కూడా వెళ్ళింది. బాబాకి తన గోడు వెళ్ళబుచ్చుకుని, తాను కన్ను మూసేలోపున కొడుకును ఓసారి కళ్ళారా చూసుకోవానుందనీ, తన ఆ చివరి కోర్కెను తీర్చమనీ కన్నీళ్ళు పెట్టుకుంది.
    ఆ వృద్ధురాలి కళ్ళలోకి నిశితంగా చూసాడు బాబా, బాబా కరుణారస దృక్కు ఆమె పైన నర్తించాయనీ, ఇక ఆమెకు మంచిరోజు వచ్చినట్టేననీ అన్నారంతా..
    ఐతే, సుబ్బాయమ్మ కొడుకు తిరిగిరాలేదు కాని, మూడో రోజు రాత్రి అద ృశ్య శక్తి ఏదో సుబ్బాయమ్మ గుడిసెలో డబ్బు సంచి ఒకటి పడేసిపోయింది. లెక్కిస్తే, అక్షరాలా కోటి రూపాయు ఉన్నాయి అందులో!. అదంతా బాబా మహిమేనంటూ కీర్తించారంతా, కొడుకు తిరిగి రాకపోతేనేం, సుబ్బాయమ్మ కష్టాు తీరిపోయాయన్నారు.
    రుద్రమరాజు కొన్నాళ్ళుగా పాకిక పక్షవాతంతో బాధపడుతున్నాడు. శరీరంలోని కుడిభాగం దాదాపు చచ్చుపడిపోయింది. ఖ్యాతిగాంచిన వైద్యు ఆధ్వర్యంలో ఖరీదైన వైద్యం జరుగుతున్నా పెద్దగా ఫలితం కనిపించలేదు. సుబ్బాయమ్మ ఉదంతం ఆకించడంతో, ఏ స్వాములోరిలో ఏ మహాత్మ్యం ఉందో’’ అన్న తంపు రుద్రమరాజ మదిని తట్టింది. తెలియని ఆశ ఏదో చిగురించింది.
    రుద్రమరాజు ఆ ఊరి జమీందారు కావడంతో మౌనబాబాతో ఏకాంత సమావేశం ఏర్పాటుచేయబడిరది. తన అనారోగ్యం గురించి విపుంగా చెప్పాడు రుద్రమరాజు, నయం చేయవసిందిగా అర్ధించాడు. నిశ్శబ్దంగా ఆకిస్తూన్న బాబా చురుకైన చూపు రుద్రమరాజు వదనం పైన స్థిరంగా నిలిచిపోయాయి. చివరగా బాబాకి శిరస్సుతో నమస్కరించి లేచాడు రుద్రమరాజు, బాబా రెండు చేతుూ ఎత్తి ఆశీర్వదించాడు.
    బాబా ఎడమ అరచేతిని చూసిన రుద్రమరాజు పెద్దగా ఉలికిపడ్డాడు. మస్తిష్కంలో ఏదో మెరుపు
మెరవడంతో అయోమయానికి గురయ్యాడు. అనుమానంగా ఎడమచేతి చూపుడు మ్రే బాబా వంక చూపుతూ ఏదో అనబోయాడు. కాని, నోరు పెకల్లేదు. షాక్‌ తో మాట పడిపోవడమే అందుక్కారణం! అంతలోనే మైకం క్రమ్మినట్టయి స్పృహతప్పి పడిపోయాడు.
    డాక్టర్‌ ఇచ్చిన ఇంజెక్షన్‌తో తెలివిలోకి వచ్చినా, నోటి మాట మాత్రం రాలేదు రుద్రమరాజుకు.
పక్షవాతం ముదిరిందన్నాడు డాక్టర్‌.
    శరీరం చచ్చుపడిపోయినా, మాట పడిపోయినా - రుద్రమరాజు మస్తిష్కం మాత్రం చురుగ్గానే పనిచేస్తోంది. ఆ రాత్రంతా మౌనబాబా గురించిన ఆలోచనలే కవరపెడుతూ నిద్రపట్టలేదు అతనికి ఎన్నో సందేహాు, ప్రశ్ను, అనుమానాూను. వేటికి సమాధానాు లేవు. ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి త్లెవారాక తన సందేహాను తీర్చుకునే ప్రయత్నం చేయానుకున్నాడు.
    ఐతే త్లెవారకముందే రుద్రమరాజుకు గుండెపోటు వచ్చింది. అది మైల్డ్‌ స్టోకేననీ, భయపడవసిన అవసరంలేదనీ చెప్పాడు డాక్టర్‌. ఫస్ట్‌ ఎయిడ్‌ అనంతరం రుద్రమరాజును ఏూరులోని ఓ సూపర్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌కి తరలించడం జరిగింది.
    రుద్రమరాజు హాస్పిటల్‌ పాలైన పక్షం రోజు తరువాత మౌనబాబాకి పూఠాత్తుగా జబ్బుచేసింది. రక్తం కక్కుకున్నాడు. అది తెలిసి భక్తగణం త్లడిల్లిపోయింది.
    వైద్యబ ృందం పరీక్షించి బాబా క్యాన్సర్‌ తో బాధపడుతున్నాడనీ, వ్యాధి చివరి దశలో ఉందనీ తేల్చింది. ఖుంగుతిన్నారంతా, మౌనమే మంత్రంగా, కంటిచూపే తంత్రంగా ప్రజ రోగాను నయంచేసే బాబా అంతటి భయంకర రోగంతో బాధపడుతున్నాడంటే నమ్మలేకపోయా రెవరూను. ఆ వార్త అందరినీ కచివేసింది. భగవంతుడైనా మానవజన్మ ఎత్తాక కర్మఫం అనుభవింపక తప్పదన్నారు బాబావారి శిష్యు. బాబా కొన్నాళ్ళుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా, భక్తు ఆందోళన చెందుతారని ఆ సంగతి గోప్యంగా ఉంచబడిరది.
    బాబా కోుకోవాని దేవాయాలో ప్రత్యేక పూజు జరిపించారంతా. వారి ప్రార్ధనలో బం లేదో, లేక అవి భగవంతుణ్ణి చేరలేదో కాని పది రోజు తరువాత మౌనబాబా నిద్దట్లోనే ప్రశాంతంగా
కన్నుమూసాడు.
    ఎదురుచూడని ఆ దుర్ఘటనకు శోకసముద్రంలో మునిగిపోయారంతా, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో చివరికి అక్కడ జీవితం చాలించాని రాసిపెట్టి ఉందనుకున్నారు.
    బాబా భౌతిక కాయాన్ని భక్తు దర్శనార్ధం మూడు రోజుపాటు అట్టిపెట్టారు. సామాన్యులేకాక
ప్రముఖ రాజకీయవేత్తు, ఉన్నత పదవులో ఉన్నవారు - పువురు దేశం నుమూల నుండీ అధిక
సంఖ్యలో తరలి వచ్చి బాబాకి శ్రద్ధాంజలి ఘటించారు. అజ్ఞాత భక్తురాు కూడా ఎప్పటిలా దూరం నుండే ఆ దివంగతుడికి అశ్రుతర్పణం చేసింది.
    తెలిసి మౌనబాబాకి రక్తసంబంధీకుంటూ ఎవరూ లేరు, తకొరివి ఎవరు పెట్టాన్న ప్రశ్న తలెత్తింది. ట్రస్ట్‌ ప్రముఖు, గ్రామపెద్దు ఆ విషయమై తర్జనభర్జను జరుపుతూంటే, రుద్రమరాజు భార్య శకుంతలాదేవి నుండి కబురు వచ్చింది.
    ఐహిక సుఖాను త్యజించి, ఆధ్యాత్మక చింతనతో, ప్రజాశ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్ముకు తకొరివి పెట్టడం పరమ పుణ్యకార్యం, ఆ అదృష్టం అందరికీ పట్టదు. అందుకే తన కొడుకుచేత మౌనబాబాకి తకొరివి పెట్టించడానికి తాను సుముఖంగా ఉన్నట్లు తెలియపరచిందామె. ఆ సుకార్యం వ్ల తన భర్త త్వరగా కోుకోగడన్న ఆశాభావం వ్యక్తం చేసింది. జమీందారిణి ప్రతిపాదన ఆశ్చర్యం గొలిపినా, దాన్ని కాదనడానికి కారణాలేవీ కనిపించలేదు ఎవరికీను.
    తల్లి ఆనతి ప్రకారం - తరలివచ్చిన జనసందోహం సాక్షిగా మౌనబాబా చితికి నిప్పంటించాడు పదిహేనేళ్ళ కృష్ణంరాజు. దూరం నుండే మండే చితికి చేతులెత్తి నమస్కరించింది శకుంతలాదేవి, చెమ్మగిల్లిన కన్నుతో.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి