మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

పూర్వజన్మ మరియు పునర్జన్మ


లోకములో మనము ఎన్నో రకా మనుష్యును చూస్తుంటాము. ఒకే తల్లికి జన్మించిన నుగురు కుమారులో ఎంతో భేదము కనిపిస్తుంది. తల్లిదండ్రు వారిని ఒకేరీతిగ పోషించినను వారి బుద్ధి మరియు జ్ఞానములో సమానత కనిపించదు. పాఠశాలో ఒక తరగతిలో నున్న విద్యార్థుందరికి ఒకే ఉపాధ్యాయుడు విద్య నేర్పినను అందరు ఒకే విధముగ విద్య గ్రహించరు.
మంచి కర్ము చేసేవారికి మేు-సుఖము కగాని, దుష్కర్ము చేసేవారికి కీడు-దుఃఖము కగాని ప్రతి మనిషి ఆశిస్తాడు. కాని కొందరు దుష్కర్ము చేయుచున్నను వారికి సుఖము భించుటను శ్రేష్ఠకర్ము చేయుచున్నను దుఃఖితుగుటను చూస్తుంటాము. ఇట్టి స్థితిలో సాధారణ మనుష్యు భ్రమపడి శ్రేష్ఠకర్ము చేయుట వన మేలేమి లేదని నిరాశకు లోనవుతాడు. కాని జాగ్రత్తగ పరిశీలించినచో శ్రేష్ఠకర్ము చేయువారందరు దుఃఖితుగ లేరని, దుష్కర్ము చేయువారందరు సుఖపడుట లేదని తొస్తుంది. ఈ సుఖదుఃఖము వర్తమానకర్మ ఫము కాదని తెలియవలెను. అవి గత జన్మలో చేసిన కర్మ ఫమే. అందుకు సందేహము లేదు. మనుష్యులో కనిపించు అసమానత (బుద్ధిలోను, జ్ఞానములోను, సుఖదుఃఖములోను) పూర్వజన్మను నిరూపిస్తుంది.
పరమేశ్వరుడు న్యాయకారి. మానవుల్పజ్ఞుగుటచే పొరపడి ఎప్పుడైన న్యాయనిర్ణయము సరిగా చేయకపోవచ్చును. కాని సర్వజ్ఞుడగు పరమేశ్వరుడు అకారణముగ, అన్యాయముగ జీవును సుఖదుఃఖముకు గురిచేయడు. అతని న్యాయవ్యవస్థలో దోషము నాపాదించుట మన అవివేకము.
ప్రతి కర్మకు ఫము వెంటనే భించదు. అది ప్రత్యక్షముగా చూస్తున్నాము. పొములో విత్తనము వేసిన పిదప నాుగు నెలకు కాని వరివండదు. చెరుకునకు పదినెలైన కావాలి. సంతానమును కోరువారు గర్భాదాన సమయమునుండి పదిమాసము నిరీక్షించాలి. ఇట్టి పరిస్థితిలో ప్రతి కర్మకు వెంటనే ఫము భంచాని అనుకొనుట అజ్ఞానమే. ఈ సుఖదుఃఖరూపమైన కర్మఫము పరమేశ్వరుని న్యాయవ్యవస్థ ననుసరించి ఎప్పుడు ఏ విధముగ భించాలో అప్పుడే భిస్తుంది. మనము చేయు శ్రేష్ఠకర్మలెప్పుడు నిరర్థకము కావు.
అంతేకాదు మానవజీవితోద్దేశ్యమైన అత్యంతపురుషార్ధమగు మోక్షమును పొందుట ఒక జన్మలో సాధ్యము కాదు. ఈ జన్మలో చేసిన సాధన, ఆర్జించిన జ్ఞానము తరువాత జన్మలో తీవ్రగతిలో అభివృద్ధిచెందుటకు దోహదమగును. ఈ విధముగ ప్రతి జన్మలోను పురుషార్థమొనర్చుచు జన్మమరణబంధనము నుండి ముక్తుడయి పరమాత్మలోని ఆనందము ననుభవించుటకు వీగును.
ఈ జీవుడు నశింపడనియు, ఒక శరీరమునుండి మరియొక శరీరములోనికి వెళ్లునననుటకు శాస్త్రీయ ప్రమాణములెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇట వ్రాయబడినవి.
1.    మృతశ్చాహం పునర్జాతో జాతశ్చాహం పునర్మృతః ।
    నానా యోనిసహస్రాణి మయోషితాని యాని వై ॥ (నిరుక్తము 14-6)
నేను-జీవుడను చనిపోయి మళ్ళీ పుట్టాను. పుట్టి మర చనిపోయాను. ఈ విధముగ నేను ఎన్నో శరీరములో నిశ్చయముగ వాసము చేసినాను. పుట్టుట R జీవునకు శరీరముతో సంబంధమేర్పడుట. చనిపోవుట R జీవుడు శరీరమునుండి వెళ్లిపోవుట. ఈ విధముగ జీవుడు పాపపుణ్యకర్మ ఫము ననుభవించుచు ప్రకృతి పురుషవివేకఖ్యాతి కుగనంతవరకు జన్మలెత్తుచుంటాడు.
2.    న జాయతే మ్రియతే వా విపశ్చి న్నాయం
    కుతశ్చిన్న బభూవ కశ్చిత్‌ । అజో నిత్యః శాశ్వితో-యం పురాణో
    న హన్యతే హన్యమానే శరీరే ॥ (కఠోపనిషత్తు 1-2-18)
అయం విపశ్చిత్‌ R జ్ఞానవంతుడైన జీవుడుÑ న జాయతే మ్రియతే వా R పుట్టడు మరియు నశించడుÑ కుతశ్చిత్‌ న బభూవ R దేనినండియు పుట్టలేదుÑ కశ్చిత్‌ న R ఎవడును పుట్టలేదు. అజః R జన్మములేనివాడుÑ నిత్యః R పరిణామము లేనివాడుÑ శాశ్వతః R వృద్ధిక్షయము లేనివాడుÑ పురాణఃR ఎప్పుడు ఒకేరకముగ నుండువాడుÑ శరీరే హన్యమానే R శరీరము నశించిననుÑ న హన్యతే R ఇతడు చావడు, నశింపడు.
3.    జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ ।
    తస్మాదపరిహార్యే-ర్థే న త్వం శోచితుమర్హతి ॥ (భగవద్గీత 2-27)
పుట్టినవానికి చావు తప్పదు. అట్లే చచ్చినవానికి జన్మతప్పదు. కావున ఓ అర్జున మన ఇష్టానిష్టముతో సంబంధములేకుండ తప్పనిసరిగా జరుగు ఈ విషయమున నీవు దుఃఖించవదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి