మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

గృహాశ్రమము :


    వేదానధీత్య వేదౌ వా వేదం వా-పి యథాక్రమమ్‌ ।
    అవిప్ణుత బ్రహ్మచర్యో గృహస్థాశ్రమమావిశేత్‌ ॥ (మనుస్మృతి 3-2)
విధిపూర్వకముగ బ్రహ్మచర్యమునందు ఆచార్యునకనుకూముగ వర్తించి నాుగు వేదము గాని, మూడు కాని, రెండు కాని లేదా ఒక్క వేదము సాంగోపాంగముగ జదివి బ్రహ్మచర్యము ఖండితము గాని స్త్రీపురుషు గృహాశ్రమమున ప్రవేశించవలెను.
    గురుణానుమతః స్నాత్వా సమావృత్తో యథావిధిః ।
    ఉద్వహేత ద్విజో భార్యాం సవర్ణాం క్షణాన్వితామ్‌ ॥ (మనుస్మృతి 3-4)
గురువుయొక్క అనుమతితో స్నానము చేసి విధిపూర్వకముగ సమావర్తన సంస్కారము చేసికొని గురుకుమునండి వచ్చిన ద్విజుడు (బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు) తన వర్ణమునకు సమానమయిన క్షణవతిjైున కన్యను వివాహము చేసికొనవలెను.
    బ్రహ్మచర్యేణ కన్యా3 యువానం విన్దతే పతిమ్‌ ।
                (అథర్వవేదము. 11-5-18)
విధిపూర్వకముగ బ్రహ్మచర్యమును పాలించిన కన్య యువకుడైన భర్తను పొందును.
ఈ విధముగ స్వయంవర పద్ధతిన వివాహము చేసికొని ఒకరితో నొకరు ప్రసన్నుగా నుండి ధర్మార్థకామమోక్షమును పొందుటకై ఇరువురు కలిసి ప్రయత్నము చేయవలెను. ఋతుగాములై ఉత్తమ సంతానమును కనవలెను. వారిని వేదాది శాస్త్రమును చదివించి సమాజమునకు రాష్ట్రమునకు ఉపయోగపడు వారిగ తీర్చిదిద్దవలెను. వివాహ సమయమున స్త్రీపురుషు వయస్సు ఈ క్రింది విధముగా నుండవలెను.
పురుషుడు    25    30    36    40    44    48 సం॥
స్త్రీ        16    17    18    20    22    24 సం॥
గృహాశ్రమము స్వీకరించు స్త్రీపురుషు క్రమముగా 24 సం॥, 48 సం॥ కన్న ఎక్కువ సంవత్సరము బ్రహ్మచర్యము పాలింపరాదు. గృహాశ్రమమున పంచమహాయజ్ఞమును ప్రతినిత్యము చేయవలెను. గృహాశ్రమముతక్కిన ఆశ్రమముకు ఆధారము. ఈ ఆశ్రమములేకున్నచో తక్కిన ఆశ్రమము వ్యవహారము సిద్ధింపదు. సర్వప్రాణు వాయువు నాశ్రయించియుండునట్లు తక్కిన ఆశ్రమము గృహాశ్రమము నంటిపెట్టుకొని యున్నవి. అన్ని ఆశ్రమము వారికి ఆవశ్యకములైన అన్నాది సమస్త పదార్థమును గృహస్థు సమకూర్చవలెను. కావున దీనిని జ్యేష్ఠాశ్రమమని యందురు.
స్త్రీపురుషులిరువురు ప్రసన్ను, విద్వాంసు, పురుషార్థు, అన్ని విధము వ్యవహారము తెలిసినవారు అయినప్పుడు గృహాశ్రమములో సుఖము కుగును. గృహాశ్రమ సుఖమునకు ముఖ్యకారణము బ్రహ్మచర్యము స్వయంవరవివాహము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి