ఏవం గృహాశ్రమే స్థిత్వా విధివత్ స్నాతకో ద్విజః ।
వనే వసేత్తు నియతో యథావద్విజితేంద్రియః ॥ (మనుస్మృతి 6-1)
స్నాతకుడైన ద్విజుడు గృహాశ్రమ కర్తవ్యమును పూర్తిచేసి నిశ్చితాత్ముడై ఇంద్రియమును జయించి వనమునందు నివసించవలెను. వానప్రస్థమునకు సరి అయిన సమయము -
గృహస్థస్తు యదా పశ్యేద్ వలీపలితమాత్మనః ।
అపత్యస్యైవ చాపత్యం తదారణ్యం సమాశ్రయేత్ ॥ (మనుస్మృతి 6-2)
గృహస్థుడు తన తవెంట్రుకు త్లెబడి చర్మము ముడుతు పడి తన కుమారునకు సంతానము కలిగిన పిమ్మట అరణ్యములో నివసించవలెను.
గ్రామసంబంధమగు ఆహారమును, వస్త్రమును, సమస్త ఉత్తమ పదార్థమును వదిలి భార్యను పుత్రునియొద్ద ఉంచి గాని లేదా వెంట తీసికొని గాని వనమునకు వెళ్లవలెను.
అగ్నిహోత్రమును వెంటతీసికొని గ్రామమునుండి వెడలి దృఢచిత్తుడై అరణ్యములో నివసించవలెను.
అన్నము, శాకము, ఫము కందమూము మొదగువానితో దేవయజ్ఞాది అతిథిసేవ చేయుచుండవలెను. ప్రతినిత్యము వేదశాస్త్రమును చదువుచు మనస్సును, ఇంద్రియమును తన అధీనమున నుంచుకొని మిత్రభావముతో వ్యవహరించవలెను. ప్రతిఫమాశింపక ఇతరుకు విద్యాదానము చేయుచు పరమేశ్వరుని ధ్యానము చేయుచు జీవించవలెను.
శారీరిక సుఖముకై ప్రయత్నింపక భార్యతో కలిసియున్నను పూర్ణబ్రహ్మచర్యమును పాటించవలెను. ఆశ్రితుయందును తన పదార్థము యందును మమతనుంచకూడదు. (మనుస్మృతి 6వ అధ్యాయము)
తపఃశ్రద్ధే యే హ్యుపవసంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాం చరన్తః ।
సూర్యద్వారేణ తే నిరజాః ప్రయాన్తి యత్రామృతః పురుషోహ్యవ్యయాత్మా ॥
(ముండకోపనిషత్తు 1-2-11)
శాంతులైనవారు సాంసారిక సుఖదుఃఖము నభిషింపక విద్వాంసుయి భిక్షాటన చేయుచు అరణ్యములో శీతోష్ణాది ద్వంద్వమును సహించుచు వైదిక కర్తవ్యకర్ము చేయుదురో వారు పాపరహితులై ప్రాణనాడి మూమున నాశరహితుడు పూర్ణుడు అగు పరమాత్మను పొంది ఆనందము ననుభవింతురు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి