మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

పెద్ద హాస్పిటల్‌

చిగురించిన మానవత్వం
    ఆ వూళ్ళో అదొక్కటే పెద్ద హాస్పిటల్‌. దాని పేరు ప్రాణదానం.  24 గంటు అత్యవసర సేమండుననే పెద్ద బోర్డు ఉంటుంది. జైు గోడ లాంటి గోడుంటాయి. లాఠీ సిద్ధంగా గూర్ఖా కం వాచ్‌మేన్‌ ఉంటాడు. లోపలికి వెళ్లాల్సిన గేటు ఎప్పుడు తాళం వేసి ఉంటుంది. తాళా గుత్తి వాచ్‌మేన్‌ చేతిలో ఉంటుంది. గేటు తీయాలా వద్దా అనే ఆర్డరు హెడ్‌నర్స్‌ నోటిలో ఉంది. రాత్రే కాదు పట్టపగు కూడా గేటు మూసి తాళం వేసి ఉంటుంది. ఎవరైనా పేషెంట్‌కు సంబంధించిన వాళ్లు వచ్చి కాళ్లా వేళ్లా పడితే, బ్రతిమిలాడితే గూర్ఖా కం వాచ్‌మేన్‌  దయవుంటే గేటు తీయడం లేదా కసిరి కొట్టడం జరుగుతుంటుంది.
    హాస్పిటల్‌ వాళ్లు దయతచి గంటో అరగంటో సందర్శకుకోసం, రోగు బంధువు, సహాయకుకోసం సమయం కేటాయిస్తారు. అది తప్పితే చచ్చినా గేటు తీయరు. ఎవరికీ లోనికి అనుమతించరు.
    భారత రాజ్యాంగం కంటే  అక్కడి శాసనం గొప్పది. నిజానికది పల్లెటూరు కాదు. మహానగరం కాదు. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న పట్టణం. అన్ని రకా వ్యాపారాకు కూడలి. రాజకీయాకు చక్కని వేదిక. ఆ పట్టణంలో లేనిది సరైన వైద్య సహాయం.
    డబ్బున్న వాళ్లు ఏ చిన్న జబ్బు వచ్చిన వాళ్లు నగరానికి పరుగెడతారు. బీదవారు మాత్రం  ప్రభుత్వాసుపత్రిపై ఆధారపడతారు. ఎటొచ్చీ మధ్య తరగతి వాళ్లే నానా ఇబ్బందు పడుతుంటారు మింగ లేక కక్కలేక.
    ఇక ప్రాణదానం. ఆస్పత్రికి వెళ్లాంటే అక్కడి సేవ బ్లిు  తుచుకుంటే ఎండాకాంలోనూ వణికే చలి పుడుతుంది రోగం ఇంకా పెద్దదవుతుంది.
    అయినా అప్పుడప్పుడు ప్రాణాపాయ సమయంలో అందరూ ఆ హాస్పిటళ్‌ను ఆశ్రయించడం ఆర్థికంగా చితికిపోవడం జరుగుతూనే ఉంది. అక్కడ దొరికే వైద్య సేమ మరెక్కడా ఆ పట్టణంలో దొరకవు మరి. వాళ్ళకు ఆధునిక వైద్య పరికరాు విదేశానుండి దిగుమతి అవుతాయి. పరికరాన్నీ ఉంటాయి. పనివాళ్లు, నర్సు ఉంటారు.  డాక్టర్లు మాత్రం ఫోను చేస్తే అత్యవసరమైతే వస్తారు. లేకుంటే పేషెంటు ప్రాణం పోయినట్లే. ఇదీ టూకీగా పల్లెనుండి పట్టణంలో ప్రతిరోజూ విస్తరిస్తున్న ఆ పట్టణం చరిత్ర. అలా ఉండగా ఒక రోజు.....

    యమ స్పీడుగా వచ్చి ఆసుపత్రి ముందాగింది ఆటో. అందులోంచి నుగురు దిగారు. వెంటనే మరో ఆటో వచ్చి ఆగింది. అందులోంచి పూర్ణగర్భిణి, బాగా అవస్థ పడుతున్న ఆమెకు సహాయంగా  ఒక నడివయసు స్త్రీ, పన్నెండేండ్ల బాుడు దిగారు.
    ముందు ఆటోలో వచ్చినవాళ్లు ఆదరాబాదరాగా అయ్యా! గూర్ఖా బాబూ! త్వరగా తుపు తెరువు...ఈమె చాలా సీరియస్‌గా ఉంది. త్వరగా లోనికి తీసుకెళ్లండి.. అని బ్రతిమిలాడారు.
    గూర్ఖా కం వాచ్‌మేన్‌ నింపాదిగా వచ్చి ఆటోలో వచ్చిన గర్భిణిని చూసి పరిస్థితిని తొసుకున్నాడు. ఆమె నిబడలేక అక్కడే కూబడిరది ఆయాసపడుతూ.. తుపు తెరవకుండానే లోపకు వెళ్లిలోపలికి వెళ్లి ఒక నర్సు వెంటబెట్టుకుని వచ్చాడు.
    ఆమె గర్భిణిని చూసింది. ఇప్పుడా తీసుకు వచ్చేది... సీరియస్‌గా ఉంది. మేము చేర్చుకోము. హైదరాబాదుకు  వ్లెండి అని గద్దించింది.
    అమ్మా! ప్రతినెలా వేరే ఆడ డాక్టరమ్మ వద్ద చూపించుకుంటున్నాం. ఇప్పుడామె చెప్పకుండా తీర్థయాత్రకని  వెళ్ళింది. పెద్ద ప్రాణం చిన్న ప్రాణం సీరియస్‌గా ఉందని, మీదగ్గరయితే  బ్రతుకుతారని సర్కారు దవఖాన వారు చెప్పారు. త్వరగా వైద్యం చేయండని అంతా ఆమె కాళ్లపై పడ్డారు.
    మా అమ్మను కాపాడండి అంటూ ఏడుస్తూ ఆ ప్లివాడు కూడా ఆమె కాళ్లపై పడ్డాడు.
    ఆ నర్సుకు తను మనిషన్న విషయం గుర్తుకు వచ్చినట్లయింది. లేక ఏ దేవుడో ఆవహించినట్టయింది.
    సరే సరే అని స్ట్రెచర్‌ తెచ్చి లోపకు తీసుకెళ్ళారు. అమ్మ ఇక బ్రతికి నట్లే నని అందరు నిట్టూర్చి లోపలికి నడిచారు.
    వెంటనే 20 మే కట్టండి. అడ్వాన్సు కడితేనే ట్రీట్‌మెంట్‌  స్టార్ట్‌ అవుతుంది. హెడ్‌నర్సు వచ్చి  తాకీదు జారీచేసింది. అక్కడ  ఆమె మాటకు తిరుగులేదు.
    మా వద్ద ఇప్పుడు పదిమేంది. తీసుకుని వైద్యం ప్రారంభించండి. త్వరగా డెలివరీ ఆపరేషను చేయండి. పేషెంటును కాపాడండి. మిగతా పైకం ఊర్లోకి వెళ్లి తెచ్చి కడతాం...అన్నారు పేషెంటు తాూడు బంధువుంతా ముక్త కంఠంతో.
    అదేం కుదరదు మొత్తం డబ్బు కడితేనే వైద్యం... ఖచ్చితంగా చెప్పింది హెడ్‌ నర్సు.
    ఇంతలో డాక్టరు వచ్చాడు. విషయం తొసుకున్నాడు. డబ్బులేదంటే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాని ఉచిత సహా ఇచ్చాడు.
    ఆ పూర్ణ గర్భిణి మెడలోంచి పుస్తెతాడు, బంగారు గొుసు తీసి హెడ్‌ నర్సు చేతిలో పెట్టి కాళ్లపై పడ్డాడు ఆమె తండ్రి, భర్త, కొడుకు.
    ఆమె దయ తచింది. డాక్టర్‌ డెలివరీ చేసాడు. కాన్పు కష్టమైనా తల్లీ బిడ్డ ఇద్దరూ బ్రతికారు. ఆ ఇంట్లో మహాక్ష్మి పుట్టిందని సంబర పడ్డారు. అమాయకు, అ్ప సంతోషు వాళ్లు.
    త తాకట్టు పెట్టి ఉన్న వమ్ముకొని హాస్పిటల్‌ వాళ్లు వేసిన మోయరానంత బ్లిు కట్టి  ఆ జైులోంచి బైట పడ్డారు ఆ కుటింబీకు.
    అదీ ఆ పట్టణంలోని ప్రాణదానం హాస్పిటల్‌వారి దయార్ద్ర దృష్టి. డాక్టరు గాని కరుణామయ వృష్టి. ఆ పట్టణంలో అప్పుడో ఇప్పుడో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు  ఆ హాస్పిటల్‌ బారిన పడ్డవాళ్లే.  ప్రాణదానం రుచి తెలిసినవాళ్లే!
    అలా ఆ పట్టణం హాస్పటల్‌, డాక్టర్‌గారు సిబ్బంది వర్థ్లిుతుండగా ఈ దేశ నాయకు, మంత్రు, బీద ప్రజను a రకంగా  ఉండగా మంత్రు ఈ రకంగా రక్షిస్తుండగా ఓ రోజు రాత్రి...
    ఏమండీ మన బాబు వధు ఇంకా ఇంటికి రాలేదు భయంభయంగా చెప్పింది జీవదానం హాస్పటల్‌ పెద్ద డాక్టర్‌తో అతని భార్య వరక్ష్మి.
    హాస్పటల్‌లో అసిపోయి వచ్చిన డాక్టర్‌  విసుక్కున్నాడు. ఏం రాచకార్యం చేయబోయాడు వాడు?... ఇంత రాత్రి దాకా?.. ఫోను చేయకపోయావా అన్నాడు కోపంగా.
    చేసానండీ... సెల్‌ స్విచ్చాఫ్‌ అని వస్తుంది. భయపడుతూ చెప్పింది వరక్ష్మి.
    అసు ఈ స్లొ కనిపెట్టినవాన్ని మెచ్చుకోవడం కాదు... స్విచ్ఛాఫ్‌ సౌకర్యం కల్పించనందుకు తిట్టుకోవాలి అనుకున్నాడు మనసులో డాక్టర్‌.
    అవును కారు కూడా కనిపించడంలేదు. కారు తీసుకుని వెళ్లాడా ఏమిటి? వాడికి డ్రైవింగ్‌ సరిగ్గా రాదు..అసు కారు తాళమెందుకిచ్చావ్‌? కోపంగా అన్నాడు డాక్టర్‌ వేణు.
    పగు మీరు హాస్పిటల్‌ వెళ్లాక, మరో కారు తాళాలిమ్మని స్నేహితుతో కలిసి వెళ్లి వస్తానని బ్రతిమలాడాడు.  కాదనక ఇచ్చాను వాడి అవస్తను చూడలేక. బ్రతిమిలాడడం భరించలేక... రాత్రి ఏడుగంటనుండే ఫోను చేస్తున్నాను. అయినా లిఫ్టు చేయడం లేదు.         రాత్రి పదకొండు అవుతోంది. ఇప్పుడు ఎక్కడని వెదకడం?..పోనీ పోలీసుకు రిపోర్టు ఇచ్చావా? ఇప్పుడైనా సరే రిపోర్టిద్దాం.... సాలోచనగా  అన్నాడు డాక్టర్‌ వేణు.
     పోలీసు రిపోర్టు ఎందుకండి ఇవ్వడం... ఇప్పుడేమైందని!  వాడికి లైసెన్స్‌ కూడా లేదని మీరే చెప్పారు. మీరే స్వయంగా వెళ్లి వెతకండి! సహా ఇచ్చింది వరక్ష్మి డాక్టర్‌ గారి భార్య.
    ఇద్దరూ ఇలా తర్జనభర్జన పడుతుండగా బయటేదో అ్లరి వినబడిరది. దంపతులిద్దరూ అటుగా వెళ్లారు.  నుగురు  పల్ల్లెటూరు  మనుషు ఎవరినో మోసుకొని వచ్చారు. వంటినిండా  దెబ్బు. రక్తం గడ్డ కట్టింది. స్పృహలో లేడు. అతన్ని పరిశీలించి చూశారు. సందేహం లేదు. అతడు... అతడు....వాళ్ళ కొడుకే! ఇంకా ఎందుకు రాలేదని ఎదురుచూస్తున్న తమ కొడుకు ఆ స్థితిలో వుండేసరికి ఆ దంపతులిద్దరూ చలించిపోయారు. ఆత్రంగా వెళ్లి పరీక్షించి చూశాడు. ప్రాణం ఉంది. హాస్పిటల్‌ డాక్టర్‌ ఇు్ల కలిసి ఉండటంతో వెంటనే ట్రీట్మెంట్‌ స్టార్ట్‌ చేశాడు మధుకు డాక్టర్‌ వేణు. తన రక్తం, మమకారం ఎక్కువ. వరక్ష్మి వచ్చినవారిని వివరాు అడిగింది.
    మేము రాత్రి మామూు ఉంటే భిక్నూర్‌లో పొం పను పూర్తిచేసుకొని వస్తుంటే, మా ముందు నుండే ఓ కారు వేగంగా వెళ్ళింది. అలా వెళ్లి ఆగి ఉన్న లారీకి గుద్దింది. ఆ కారులో ఈ బాబు ఒక్కడే ఉన్నాడు. బాగా దెబ్బు తగిలి, రక్తం కారుతుంటే బాబు స్పృహ కోల్పోయాడు. దగ్గరికి వెళ్లి జేబులో చూస్తే  మీ అడ్రస్‌ ఉంది. ఇతడు మీ బాబు అని గుర్తు పట్టి ఆటోలో తీసుకువచ్చాం. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. అయినా ఈ బాబు బ్రతకడం మీ అదృష్టం నుగురూ ఒకేసారి కోరస్‌గా చెప్పారు.
    డాక్టర్‌ వేణు తన కొడుకుకు శ్రద్ధగా చికిత్స చేసి గాయాకు కట్టుకట్టి ప్రాణాపాయం తప్పినందుకు తేలికగా నిట్టూర్చి బయటకు వచ్చాడు బాబును తీసుకు వచ్చిన వారితో మాట్లాడేందుకు.
    ఆ నుగురిని చూసి గుర్తుపట్టాడు. వాళ్లు.. వాళ్లు... కొద్ది రోజు క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న పూర్ణ గర్భిణి చికిత్సకు తన హాస్పిటల్‌ లోకి తీసుకు వచ్చిన వారే. డబ్బు కట్టందే వైద్యం చేయనంటే భారతీయు పవిత్రంగా భావించే బంగారు గొుసు తాకట్టు పెట్టిన వార!
    ఆ రోజు మిమ్మల్ని  కష్టపెట్టాను. ఒక మనిషిలా కాకుండా డబ్బు పిశాచిలా ప్రవర్తించాను. అయినా మీరు అదేమీ మనసులో పెట్టుకోకుండా మా ఒక్కగానొక్క కుమారుని కాపాడి ప్రాణాు రక్షించారు. మనసున్న మనుషు మీరు. చేతు జోడిరచాడు డాక్టర్‌ వేణు.
    నేను ఎంత చెప్పినా వినకుండా డబ్బే ద్యేయంగా పేషంట్లను బాధ పెడుతూ ఫీజు ముక్కుపిండి వసూు చేశారు. అయినా నోము, పూజు, వ్రతాలే ఈ దేవుడు నా గారా బాబును  కాపాడారు ఏడుస్తూ అంది వరక్ష్మి.
    మమ్మల్ని అంతగా మెచ్చుకుని ఆకాశానికి ఎత్తాల్సిన  అవసరమేముంది? మేం ఏం గొప్ప పని చేసినాం? మనుషుగా సాటి మనిషిని రక్షించాం. అంతే అన్నారు ఆ నుగురు ఏక కంఠంతో గర్వానికి తావీయక.
    అదే మీకు నాకు తేడా! సేవా భావంతో మానవత్వంతో మెగాల్సిన వ ృత్తిలో ఉంటూ డబ్బు ఆశతో నా కర్తవ్యాన్ని మరిచాను. ఇతడు మా బాబని తెలిసినా గతంలో చేదు అనుభవాన్ని  పట్టించుకోకుండా బాబును రక్షించారు. ప్రాణదానం చేశారు మీ ఋణం ఎలా తీర్చుకోలేను బాధగా అన్నాడు డాక్టర్‌ వేణు తన ప్రవర్తనకు తానే సిగ్గు పడుతూ.
    ఈరోజుల్లో ఎవరు నెవరు పట్టించుకుంటారు? అందులోనూ ఆక్సిడెంట్‌ కేసు! పోలీసుని, కోర్టుని భయపడకుండా ఇంత రాత్రయినా బాబును తీసుకువచ్చి జాగ్రత్తగా అప్పగించారు. ఇక్కడే ఉండండి ఉదయమే వెళ్లవచ్చు కృతజ్ఞతగా అంది వరక్ష్మి. ఆమె మాతృ హృదయం అలా పలికించింది.
    అవును అలాగే చేయండి అంటూ వాళ్ల చేతుల్లో పదిమే ఉంచబోయారు డాక్టర్‌ వేణు. వాళ్లు మర్యాదగా తిరస్కరించారు ఆ డబ్బును. ఇకపై నా కర్తవ్యం సక్రమంగా నిర్వహిస్తాను. ధృడంగా అన్నాడు డాక్టర్‌ వేణు ఇప్పుడు ఆ హాస్పిటల్‌ నిజంగా జీవదాన హాస్పిటలే....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి