మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

మాధవుడు

మాధవుడు
ప. అందరుగూడి భజను చేసితె - ఎందుకురాడా మాధవుడు
తాళం శబ్దం చెవిలో పడితే - సరుగున వచ్చును మాధవుడు
అందరు
1) వరప్రహ్లాదుడు హరియని వేడగ - స్తంభము నందే వెలిసెనుగా
అటువంటి భక్తి మనలో ఉంటే - ఎందుకురాడా మాధవుడు
అందరు
2. అహ్యదేవి రామా అనగా - రాతిని నాతిగజేసెనుగా
అటువంటి భక్తి మనలో ఉంటే - ఎందుకు రాడా మాధవుడు
అందరు
3. ద్రౌపదిదేవి కృష్ణా యనగా - మవలొసంగెను మాధవుడూ
అటువంటి భక్తి మనలో ఉంటే - ఎందుకు రాడా మాధవుడు
అందరు
4. కలియుగమందున మానవజన్మము - మనకొక వరమని తెలియండీ
పావన నామస్మరణ తోడనే - పరుగున వచ్చును పరమాత్మ
అందరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి