మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

మానవుని ఉత్కృష్టత


ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్‌ పశుభిర్నరాణామ్‌ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశము, ప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుట, నిద్రా, భయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాుగు గుణము పశువులోను, మనుష్యులోను సమానముగ కనిపించు సామాన్యగుణము. మనుష్యులో ధర్మమనునది విశేషగుణము. ధర్మాచరణలేని మనుష్యు పశువుతో సమానము.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవసి యున్నది. విద్యవననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనును. అప్పుడు వాటితో ఉచితరీతిలో వ్యవహరించి తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును పొందుటకు ప్రయత్నించగడు. మోక్షమును పొందగ యోగ్యత కేవము మనుష్యునకే కదు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నృా నయే అను ధాతువుతో నర శబ్దమేర్పడును. నయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ ॥ (కఠోపనిషత్తు 3-9)
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమును, వ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమి, దేవపురి, బ్రహ్మపురి అని చెప్పబడిరది.  ఐదు జ్ఞానేంద్రియము, మనస్సు, బుద్ధి ఈ ఏడిరటిని ఋషుని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి