మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

స్తుతి ప్రార్థన ఉపాసన స్వరూపము


స్తుతి : స్తుతి యననేమో ఇంతకుముందే తొపబడినది. ఈశ్వరుని గుణము గానమే స్తుతి. అతని గుణకర్మస్వభావము వన తన గుణకర్మస్వభావమును సరిదిద్దుకొనుట స్తుతి ప్రయోజనము. ఎట్లనగా ఈశ్వరుడు పక్షపాతరహిత న్యాయకారి. ఇది భగవంతుని గుణము. స్తుతివన మనము కూడ పక్షపాతరహితుమై న్యాయపూర్వకముగ వ్యవహరించవలెనను భావన కుగవలెను. లేనిచో స్తుతి వ్యర్థము. ఈశ్వరునిలో ఉన్న గుణమును చెప్పుట సగుణస్తుతి యనియు, జీవప్రకృతులోని గుణము ఈశ్వరునిలో లేనందున వాటి లేమిని చెప్పుట నిర్గుణస్తుతి యనియు అందురు. ఈ విషయము ఓ3మ్‌ స పర్యగాత్‌ ... అను మంత్రమున పూర్వము విశదముగ వ్రాయబడినది.
ప్రార్థన : ప్రార్థన అనగా యాచించుట, దీనివన నిరభిమానత, ఉత్సాహము, సహాయము కుగును. ప్రార్థన పురుషార్థపూర్వకముగ యుండవలెను. ప్రయత్నశీురైన వ్యక్తికి ఇతయి సహకరించుట మనము లోకున చూచుచున్నాము. అట్లే ధార్మికుడై పురుషార్థమొనర్చు వ్యక్తికి ఈశ్వరుడు తప్పక సహకరించును. పరోపకారమొనర్చు ప్రార్థన యందు ఈశ్వరుడు సహకరించును. ఇతరుకు హాని కలిగించు ఉద్దేశ్యముతో ప్రార్థించిన ఈశ్వరుడు సహకరింపడు. అంతేకాదు ఏ పదార్థమును మనము సంపాదించుకొనగమో (ఆహారము, ధనము మున్నగునవి) అట్టివానిని ఈశ్వరుని ఇమ్మని అడుగుటలోను ఔచిత్యము లేదు. ఈశ్వరుని ప్రార్థించు పద్ధతి -
    ఓం విశ్వాని దేవ సవితద్దురితాని పరా సువ ।
    యద్భద్రం తన్న-ఆ సువ ॥ (యజుర్వేదము 30-3)
దివ్యగుణము గ ఓ దేవ! సృష్టికర్తా! నా యందుగ సమస్త దురితమును - దుర్గుణమును దూరము చేయుము. ఏది భద్రకరమో, కల్యాణకరమో దానిని మా కొసగుము.
    ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే ।
    తయా మామద్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహా ॥ (యజుర్వేదము 32-14)
ఓ అగ్నీ! ప్రకాశస్వరూపుడవగు ఓ దేవ! నీ కృపవన విద్వాంసు, జ్ఞాను ఏ మేధా - బుద్ధికై ఉపాసించుచున్నారో మమ్ము ఇప్పుడే అట్టి మేధాయుక్తుగ, విద్వాంసుుుగ చేయుము.
    ఓం తేజో-సి తేజో మయి ధేహి వీర్యమసి వీర్యం మయి ధేహి
    బమసి బం మయి ధేహి । ఓజో-స్యోజో మయి ధేహి మన్యురసి
    మన్యుం మయి ధేహి సహో-సి సహో మయి ధేహి ॥
                    (యజుర్వేదము 19-9)
ఓ పరమేశ్వర! నీవు ప్రకాశస్వరూపుడవు. దయచేసి నా యందు ప్రకాశమును నింపుము. నీవు అనంత పరాక్రమయుక్తుడవు, నీవు కృపచే నాయందు పరాక్రమము నుంచుము. నీవు అనంతబయుక్తుడవు, నా యందు బమును చేర్చుము. నీవు అనంతసామర్థ్యముగవాడవు, నాకు సామర్థ్యమునిమ్ము. నీవు దుష్టకార్యముందును దుష్టుయందును క్రోధకారివి, నన్ను కూడ అట్లే చేయుము. నీవు సహనము గవాడవు. నీ కృపచే నేను కూడ సుఖదుఃఖమును, హానిలాభము మొదగు ద్వంద్వమును సహించువాడనగుదును గాక.
    అసతో మా సద్గమయ । తమసో మా జ్యోతిర్గమయ ।
    మృత్యోర్మా-మృతం గమయ ॥ (శతపథబ్రాహ్మణము 14-3-1-30)
ఓ పరమాత్మ! మమ్ము అసత్యమునుండి సత్యమువైపు నడిపింపుము. అవిద్య - అజ్ఞాన - అంధకారము నుండి తొగించి విద్య-జ్ఞాన-ప్రకాశయుక్తుగ చేయుము. జననమరణబంధనమగు మృత్యువునుండి తప్పించి మోక్షానందమును పొందజేయుము.
ఉపాసన : ఉప G ఆసన R ఉపాసన. ఉప అనగా సమీపత. ఆసనమనగా ఉండుట. మనము దేనిని ఉపాసించెదమో దానికి మనకు గ దూరమును తొగించుకొనుట లేదా దానికి దగ్గర అగుటను ఉపాసన అంటారు. దూరము మూడు విధము. 1. స్థదూరము. 2. కాదూరము. 3. జ్ఞానదూరము.
స్థదూరము : హైదరాబాదులో నున్న మనము ఢల్లీిలోనున్న ఒక వ్యక్తిని కువవలెనన్నచో వెంటనే మీపడదు. కారణమేమన మనకు ఢల్లీికి మధ్య కొన్ని వందమైళ్లదూరమున్నది. మనము ఆ దూరమును తొగించుకొనినచో అతనికి దగ్గర కాగము. మనము ఈశ్వరుని ఉపాసింపదచినచో అట్టి దూరము తొగించుకొననవసరము లేదు. ఎందుకనగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. కనుక అతనికి మనకు మధ్య స్థదూరము లేదు.
కాదూరము : ఇప్పటివారమైన మనము జాతిపిత గాంధీగారితో మాట్లాడవలెనన్న మీపడదు. అతనికి మనకు మధ్య కొన్ని (సుమారు 36 సం॥) వ్యవధానమున్నది. అలాగే మహర్షి దయానందుని ఉపదేశము వినవలెనన్న మీపడదు. వారు, ఒక 100 సంవత్సరముకు పూర్వముండెడివారు. మనము భగవంతుని ఉపాసించుటకు ఇట్టి దూరము లేదు. ఎందుకనగా అతడు ఎ్లప్పుడు ఉండును. కాముచే ఛేదింపబడడు.
జ్ఞానదూరము : మన చేతియందు ఒక రష్యాభాషలో ముద్రించిన పుస్తకము ఉన్నదనుకొనుడు. మనకా భాష రానిచో ఆ పుస్తకము మనకెంత సమీపముననున్నను అందలి విషయము మనకు తెలియదు. కారణమేమన మనకు దానికి సంబంధించిన జ్ఞానము లేకపోవుటయే ఇదియే జ్ఞానదూరము. ఈశ్వరునకు మనకు మధ్యనున్నది జ్ఞానదూరమే కాని స్థదూరము, కాదూరము కాదు. భగవంతుని ఉపాసన అనగా భగవంతుని యథార్థస్వరూపమును తెలిసికొనుట. అందుకు కావసినది వివేకజ్ఞానము. అది శాబ్దికము కాకుండ వ్యావహారికము కావలెను. అందుచేతనే ఋతే జ్ఞానాన్న ముక్తిః. భగవంతునియొక్క సమ్యగ్‌ జ్ఞానము లేనిది ముక్తి భింపదు. ఉపాసన పర్యవసానము మోక్షప్రాప్తి.
ఉపాసనను సాధారణముగ పూజ అని వ్యవహరిస్తారు. కాని అది సరిjైున ప్రయోగము కాదు. ఉపాసన వన కుగవసినది ఆంతరంగిక-మానసిక-బౌద్ధివికాసము. బాహ్యము కాదు. పూజ యనగా పూజానామ సత్కారః యథోచితవ్యవహారో వా. సత్కారమన ఉచితరీతిలో వ్యవహరించుటÑ మనకంటే పెద్దవారిని, విద్వాంసును నమస్కారాది శబ్దముతో, నమ్రతతో గౌరవించుట పూజయే. తల్లి, తండ్రి, గురువు, సంన్యాసి మొదగువారిని పాదాభివందనము చేసి గౌరవించుటయు పూజయే. పిన్నవారిని ప్రేమానురాగాతో ఆశీర్వదించుటయు పూజయే. సమానవయస్కుతో స్నేహభావముతో వ్యవహరించుటయు పూజయే. మనము ఉపయోగించు యాంత్రిక పరికరము, మోటారు వాహనము మొదగునవి చెడిపోకుండ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూచుకొనుట (ఎaఱఅ్‌వఅaఅషవ) యు పూజయే. కాని భగవంతుని ఉపాసన వీటికంటె భిన్నము. కారణమేమన ఆ వస్తుతత్వము వేరు దాని ప్రయోజనము వేరు. పవిత్రములైన ఈశ్వరుని గుణకర్మస్వభావమువలె తన గుణకర్మస్వభావమును మార్చుకొనుచు, ఈశ్వరుడు సర్వవ్యాపకుడుగా, తాను వ్యాప్యునిగా నెరిగి ఈశ్వరుని సమీపమున తాను, తన సమీపమున ఈశ్వరుడు ఉన్నట్లు నిశ్చయించి సంధ్యోపాసన, యోగాభ్యాసము ద్వారా ఈశ్వరుని సాక్షాత్కారము చేసికొనుట. అప్పుడు ఉపాసకుడు పొందు ఆనందము అనిర్వచనీయము. అతనికి సర్వసంశయము నశించును.
1.    భిద్యతే హృదయగ్రంథిశ్చిద్యన్తే సర్వసంశయాః ।
    క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే ॥
                (ముండకోపనిషత్తు 2-2-8)
ఆ పరావరుడైన పరమేశ్వరుడు సాక్షాత్కారమైనపుడు ఆ బ్రహ్మజ్ఞాని యొక్క హృదయమునందలి అజ్ఞానవాసన విడిపోవును. సర్వసంశయము ఛేదింపబడును. శుభాశుభకర్ము నశించును.
2.    సమాధినిర్ధూతమస్య చేతసో నివేశితస్యాత్మని
    యత్సుఖం భవేత్‌ । న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం
    తదన్తఃకరణేన గృహ్యతే ॥ (మైత్రాయణ్యుపనిషత్తు)
సమాధియోగము వన అవిద్యాదిమము నష్టమయినపుడు, ఆత్మస్థుడయి పరమాత్మునియందు చిత్తమును చేర్చినపుడు, పరమాత్మయోగము వన ఏ సుఖము కుగుతుందో అది మాటతో వర్ణించమీలేనిది. ఆ సుఖమును జీవాత్మ తన అంతఃకరణముచే గ్రహించును.
3.    ఓం వేదాహమేతం పురుషం మహాన్తమ్‌ ఆదిత్యవర్ణం
    తమసః పరస్తాత్‌ । తమేవ విదిత్వాతి మృత్యుమేతి
    నాన్యః పన్థా విద్యతే-యనాయ ॥ (యజుర్వేదము 31-18)
ఏతం R ఈ అనంతశక్తి సామర్థ్యము గవానినిÑ మహాన్తమ్‌ R అందరికన్న గొప్పవానినిÑ తమసః పరస్తాత్‌ R అంధకారము, అజ్ఞానము లేనివానినిÑ ఆదిత్యవర్ణమ్‌ R సూర్యునివంటి ప్రకాశము గవానినిÑ పురుషమ్‌ R సంపూర్ణ విశ్వమునందు వ్యాపించియున్నవానినిÑ అహం వేద R నేను ఎరుగుదును (ఎవ్వరైనను)Ñ తమ్‌ ఏవ R అతనినేÑ విదిత్వా R తెలిసికొనిÑ మృత్యుమ్‌ R మరణ దుఃఖమునుÑ అతి ఏతి R దాటిపోవుదురుÑ అయనాయ R మోక్షమును పొందుటకు ఇది తప్పÑ అన్యఃపన్థా R వేరే మార్గముÑ న విద్యతే R లేదు.
4.    తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విముంచథ
    అమృతస్యైషః సేతుః ॥ (ముండకోపనిషత్తు 2-2-5)
ఏషః R ఈ పరమేశ్వరుడేÑ అమృతస్య సేతుః R మోక్షమునకు వంతెనవంటివాడుÑ తమ్‌ ఏవ ఏకమ్‌ R ఆ అద్వితీయుడైన - ఒక్కడేjైునÑ ఆత్మానమ్‌ జానథ R పరమాత్మను తెలిసికొనుడుÑ అన్యాః వాచః విమంచథ R ఇతరాలాపమును, వ్యర్థపు పనును విడిచివేయుడు.
5.    ఓం భూర్భువః స్వః । తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ।
    ధియో యో నః ప్రచోదయాత్‌ ॥ (యజుర్వేదము 36-3)
ఓమ్‌ R సర్వజగద్రక్షకుడుÑ భూః R ప్రాణాధారుడుÑ భువః R దుఃఖనాశకుడుÑ స్వః R సుఖస్వరూపుడుÑ సవితుః R సృష్టికర్తÑ దేవస్య R దివ్యగుణము గవాడగు ఆ పరమేశ్వరుడుÑ భర్గః R శుద్ధస్వరూపుడుÑ వరేణ్యమ్‌ R వరింపదగినవాడు అగు అతనినిÑ ధీమహి R ధరించెదము - ధ్యానము చేయుదుముÑ యః R అట్టి గుణము గ ఆ పరమేశ్వరుడుÑ నః ధియః R మా యొక్క బుద్ధినిÑ ప్రచోదయాత్‌ R శుభకర్మవైపు, సన్మార్గమువైపు ప్రేరేపించుగాక!
6.    తజ్జపస్తదర్థభావనమ్‌ ॥  (యోగదర్శనము 1-28)
ఈశ్వరుని నామమైన ప్రణవము - ఓమ్‌ను జపించుచు, తదర్థ భావనమ్‌ R ప్రణవశబ్దమున కర్థమయిన ఈశ్వరుని గుణకర్మస్వభావమును మనస్సునందు భావించుట వన చిత్తము - మనస్సు ఏకాగ్రమగును.
    స్వాధ్యాయాద్యోగమాసీత యోగాత్‌
    స్వాధ్యాయమామనేత్‌ । స్వాధ్యాయయోగసంపత్యా
    పరమాత్మా ప్రకాశతే ॥ (యోగదర్శనము వ్యాసభాష్యము 1-28)
    స్వాధ్యాయః ప్రణవాదిపవిత్రాణాం
    జపో మోక్షశాస్త్రాధ్యయనం వా ॥
        (యోగదర్శనము వ్యాసభాష్యము 2-1)
స్వాధ్యాయమున ప్రణవజపము. యోగమన ఈశ్వరభావన. ఈ రెండిరటి వన మనస్సేకాగ్రమై ప్రకృతిపురుషవివేకజ్ఞానము కుగును. అటుపై ఈశ్వరసాక్షాత్కారము కుగును.
7.    ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ త్లక్ష్యముచ్యతే ।
    అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్‌ ॥ (ముండకోపనిషత్తు 2-2-4)
ప్రణవః ధనుః R ఓమ్‌ అను పదము ధనుస్సుÑ శరః హి ఆత్మా R జీవాత్మ బాణముÑ బ్రహ్మ త్లక్ష్యముచ్యతే R పరమాత్మ ఆ బాణమునకు క్ష్యము - గురి అని చెప్పబడినదిÑ అప్రమత్తేన R ప్రమాదరహితునిచేÑ వేద్దవ్యమ్‌ R భేదింపదగినదిÑ అట్లు భేదించి, శరవత్‌ R బాణము క్ష్యమునందు గ్నమగునట్లుÑ తన్మయోభవేత్‌ R బ్రహ్మమయుడు కావలెను.
ఇచట అంకారికభాష ఉపయోగించబడినది. ధనుస్సు ద్వారా బాణమును దాని క్ష్యమునందు స్థాపించువిధముగ ముముక్షువు ప్రణవజపము వన తనను తాను బ్రహ్మమున చేర్చుకొనవలెను. అర్థభావముతో ప్రణవజపము నభ్యాసము చేసినచో చిత్తమేకాగ్రమగును. ఆస్యాదిప్రమాదమును దరిచేయనీయకూడదు. ఈ విధముగ ప్రతి నిత్యము అభ్యాసము చేసి బ్రహ్మను తెలిసికొనవలెను.
8.    యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణమ్‌ కర్తారమీశం
    బ్రహ్మయోనిమ్‌ । తదా విద్వాన్‌ పుణ్యపాపే
    విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి ॥ (ముండకోపనిషత్తు 3-1-3)
యదా R ఎప్పుడైతేÑ బ్రహ్మయోనిమ్‌ R ఋగాదివేదముకు కారణముÑ కర్తారమ్‌ R జగత్కర్తÑ రుక్మవర్ణమ్‌ R ప్రకాశస్వరూపుడుÑ పురుషమ్‌ R పూర్ణుడుÑ అగు, ఈశమ్‌ R పరమేశ్వరునిÑ పశ్యః R జ్ఞానిjైున సాధకుడుÑ పశ్యతే R తెలిసికొనునోÑ తదా R అప్పుడుÑ విద్వాన్‌ R ఆ సాధకుడుÑ నిరంజనః R మోహాదు లేనివాడైÑ పుణ్యపాపే R పుణ్యపాపమునుభవించిÑ విధూయ R వాటిని నశింపచేసిÑ పరమం సామ్యముపైతి R అత్యంత సామ్యమును పొందును.
యోగాభ్యాసాదు వన చిత్తమాలిన్యమును తొగించుకొని సమాధియందు సమస్త జగత్తుకు కర్తయు, వేదముకు మూమైన పరమేశ్వరుని గుర్తించిన విద్వాంసుడు సర్వదుఃఖమునుండి ముక్తుడయి పరమేశ్వరుని వలె అవిద్యాదు తొగినందున నిర్ముడగును.
9. లోకమున ఎవరేని ఒక వస్తువును పొందగోరుచో, ముందుగా ఆ వస్తువు యొక్క గుణమును యథార్థముగా (దానిలో ఉన్న గుణమును ఉన్నవానిగ, లేని గుణము లేనివానిగ) తెలిసికొనవలెను. దానిని సమ్యగ్‌ జ్ఞానము - వ్యవహారజ్ఞానము అందురు. అట్టి యథార్థ - వ్యావహారజ్ఞానముతో ప్రయత్నించినచో ఆ వస్తువు అతనికి భ్యమగును. కాని అందుకు విరుద్ధమగు గుణముతో ప్రయత్నించినచో అతనికి ఆ వస్తువు ఎన్నడును భ్యము కాదు. ఇది లోకవిదితము. అట్లే భగవంతుని పొందగోరు సాధకుడు భగవంతుని యథార్థ జ్ఞానమును వేదము మరియు వైదిక సాహిత్యము ద్వారా తెలిసికొనవలెను. అట్లుగాక విరుద్ధ గుణజ్ఞానముతో ప్రయత్నించువానికి ఆ భగవంతుడు ఎన్ని జన్మయందైనను భింపడు.
10.    నాయామాత్మా ప్రవచనేన భ్యో న మేధయా
    న బహూనా శ్రుతేన । యమేవైష వృణుతే తేన భ్య
    స్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్‌ ॥ (కఠోపనిషత్తు 2-23)
అయం ఆత్మా ప్రవచనేన న భ్యః R ఆ పరమేశ్వరుడు వ్యాఖ్యానాదుచే భింపడుÑ మేధయా న R స్మరణశక్తిగ బుద్ధికి భింపడుÑ బహునా శ్రుతేన న R శాస్త్రవిషయమును వినుటచే చదువుటచే కాని భింపడుÑ ఏషః యమ్‌ ఏవ వృణుతే R ఏ మనుష్యుడు ఆ పరమాత్మను మాత్రమే వరించునో, ఉపాసించునోÑ తేన భ్యః R అతనికే భించునుÑ తస్య ఏషః ఆత్మా స్వాం తనూం వివృణుతే R అతనికే ఈ పరమాత్మ తన స్వరూపమును ప్రకటించును.
లోకమున ఎందరో పరమాత్మను గూర్చి శాస్త్రములో చెప్పబడినట్లు ఉపన్యసింతురు. ఎందరో శాస్త్రమును పుమారు వినువారు గరు. కాని వీరికి పరమాత్మ భింపడు. మరి ఎవరికి భించు .....న న- ఇతరవిషయమును మనస్సున చేరనీయక అనన్య భక్తితో అతని నెవరు వరింతురో, స్తుతిప్రార్థనోపాసనను చేయుదురో అట్టి భక్తు హృదయమునందే తన స్వరూపమును ప్రకాశింపజేసి వారిని ధన్యును చేయుము (శాస్త్రజ్ఞానము స్తుతిప్రార్థనోపాసనకు సహాయకారి).
11.    ఏకో వశీ సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధా
    యః కరోతి । తమాత్మస్థం యే-నుపశ్యన్తి ధీరాః
    తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్‌ ॥ (కఠోపనిషత్తు 5-12)
సర్వభూతాంతరాత్మా R సర్వభూతముకు అంతరాత్మయుÑ ఏకః R ఒక్కడుÑ వశీ R సమస్త విశ్వమును తన వశములోనుంచుకొనువాడు నగుÑ యః R ఏ పరమేశ్వరుడుÑ ఏకం రూపం R ప్రళయకామున సూక్ష్మరూపములో ఒక్కటిగా నున్న ప్రకృతినిÑ బహుధా కరోతి R సృష్టికామున అనేక రూపముగ చేయుచున్నాడోÑ తమ్‌ ఆత్మస్థమ్‌ R జీవునియందు వ్యాప్తుడై ఉన్న పరమేశ్వరునిÑ యే ధీరాః అనుపశ్యన్తి R ధ్యానశీురైన ఏ విద్వాంసు సాక్షాత్కారము చేసికొందురోÑ తేషాం సుఖం శాశ్వతమ్‌ R వారికి సుఖము బహు దీర్ఘకాము ఉండునుÑ న ఇతరేషామ్‌ R ఇతరుకు భింపదు.
పరమేశ్వరుడొక్కడు. అతడు సమస్త చరాచరవస్తువును సృష్టించి వాని యందు నిరంతరము వ్యాపకుడైయుండి బ్రహ్మాండమునంతటిని తన వశమునందుంచుకొనును. ఈ ప్రపంచము ప్రళయమునందు సూక్ష్మమై ప్రకృతిరూపమున నుండును. సృష్టియందు ఇప్పుడు కనిపించు వివిధ రూపము ఉండవు. ఒకే రూపమున ఉండును. అట్టి సూక్ష్మరూపమున నుండు ప్రకృతిని వివిధరూపములో పరిణమింపజేయువాడు పరమేశ్వరుడే. వివిధ స్థూపదార్థమును సృష్టించి వాటియందును, జీవుయందును అంతరాత్మjైు ఆ పరమేశ్వరుడు వ్యాపించియుండును. ఆ పరమేశ్వరుని యమనియమాది యోగాంగము ననుష్ఠించు ధీరులే సాక్షాత్కారము చేసికొనగరు. ఆ ధీయి ముందు తమ్ము తాము తెలిసికొని అనంతరము పరమాత్మను సాక్షాత్కారము చేసికొందురు జీవాత్మను తెలిసికొననంతవరకు అందులోనుండు పరమాత్మ తెలియడు. అందుకే ‘అనుపశ్యన్తి’ అని మహర్షి చెప్పుచున్నాడు. అట్టివారికే శాశ్వత సుఖము - మోక్షానందము భించును. ఇతరు కది భింపదు.
12.    నిత్యో-నిత్యానాం చేతనశ్చేతనానామేకో బహూనాం
    యో విధధాతి కామాన్‌ । తమాస్థం యేనుపశ్యంతి ధీరాః
    తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్‌ ॥ (కఠోపనిషత్తు 5-13)
అనిత్యానామ్‌ R నాశవంతమగు ప్రాకృతిక పదార్థములోÑ నిత్యః R పరమాత్మ నాశరహితమై యుండునుÑ చేతనానామ్‌ R చేతనులైన జీవులోÑ అతడు, చేతనః R సదా చేతనుడుÑ బహునామ్‌ కామాన్‌ R అనేకులైన జీవుయొక్క కోరికనుÑ యః ఏకః విధధాతి R ఏ ఒక్కడైన పరమేశ్వరుడు తీర్చునోÑ తమాత్మస్థమ్‌ R జీవాత్మయందుండు అతనినిÑ యే ధీరాః అనుపశ్యన్తి R ఏ ధ్యానశీురు సాక్షాత్కారము చేసికొందురోÑ తేషాం శాంతిః శాశ్వతీ R వారికి శాశ్వతశాంతి భించునుÑ న ఇతరేషామ్‌ R ఇతరుకు భింపదు.
ప్రపంచములోని పదార్థమున్నియు అనిత్యము-నాశవంతము. వానిలో నిత్యుడైన పరమాత్మ వ్యాపించియుండును. చేతనులైన జీవులో నిత్యచేతనుడైయుండి వారికి కర్మఫము నిచ్చుచుండెడివాడు అతడొక్కడే. అట్టి పరమేశ్వరుని ధ్యానశీురు సాక్షాత్కారము చేసికొని శాశ్వతశాంతిని పొందుదురు. ఇతరు కది భింపదు.
13.    ఓమ్‌ అన్థన్తమః ప్ర విశన్తి యే-సంభూతిముపాసతే ।
    తతో భూయ-ఇవ తే తమో
    య ఉ సంభూత్యా రతాః ॥ (యజుర్వేదము 40-9)
యే R ఎవరు పరమేశ్వరుని విడిచిÑ అసంభూతిమ్‌ R అనాదిjైున జడప్రకృతినిÑ ఉపాసతే R ఉపాసించెదరో వారుÑ అన్ధన్తమః R అంధకారమును, అజ్ఞానమునుÑ ప్రవిశన్తి R పొందుదురుÑ యే సంభూత్యామ్‌ R ఎవరు కార్యరూప జగత్తునందుÑ రతాః R రమింతురోÑ తే R వారుÑ తతః R అంతకంటెÑ భూయః ఇవ R ఎక్కువగా నుండునట్టిÑ తమః R అవిద్యారూపమగు అంధకారమును పొందుదురు.
పరమేశ్వరుని  వదలి సృష్టికి ఉపాదానకారణమైన జడప్రకృతిని ఉపాసించువారును మరియు ప్రకృతియొక్క కార్యజగత్తును ఉపాసించువారును అజ్ఞానాంధకారమున నుందురు. వారికి వివేకజ్ఞానము కుగదు. వారికి భగవంతుడు భింపడు.
14.    అవిద్యాయామన్తరే వర్తమానాః స్వయం ధీరాః
    పండితమ్మన్యమానాః । జంఘన్యమానా పరియంతి
    మూఢాః అన్థేనైవ నీయమానా యథా-న్ధాః ॥ (ముండకోపనిషత్తు 1-2-8)
అవిద్యాయామన్తరే R అజ్ఞానము-విపరీతజ్ఞానమునందుÑ వర్తమానాః R వర్తించుచుÑ స్వయం ధీరాః R తమకుతామే ధ్యానశీురుగ భావించుచుÑ పండితమ్మన్యమానాః R పండితుమని యనుకొనుచుÑ జంఘన్య మానాః R దుఃఖముచే పీడిరపబడుచుÑ మూఢాః R మూర్ఖుÑ అంధేన R గ్రుడ్డ్డివానిచేÑ నీయమానాః అంధాః ఇవ R నడుపబడు గ్రుడ్డివారి వలెÑ పరియన్తి R ఐహికసుఖము కొరకు పరిపరివిధము వర్తింతురు.
15.    అవిద్యాయాం బహుధా వర్తమానాః వయం
    కృతార్థా ఇత్యభిమన్యన్తి బాలాః యత్‌ కర్మణో న
    ప్రవేదయన్తి రాగాత్తేనాతురాః క్షీణలోకాశ్చ్యవన్తే ॥
                (ముండకోపనిషత్తు 1-2-9)
అవిద్యాయాం R అజ్ఞానమునందుÑ బహుధా పర్తమానాః R అనేకవిధము వర్తించువారైÑ వయం కృతార్థాః ఇతి R మేము కృతార్థుమైతిమనిÑ  బాలాఃR అవివేకుÑ అభిమన్యన్తి R అభిమానించుచున్నారుÑ రాగాత్‌ R ఫలాపేక్ష వనÑ యత్‌ కర్మణఃR అగ్నిహోత్రాది కర్మ నొనర్చువారుÑ తేన ఆతురాః R కర్మఫమును కోరుటవన ఆతురులైÑ క్షీణలోకాః R సుఖము నశింపగాÑ చ్యవన్తే R పతితుగుదురుÑ న ప్రవేదయన్తి R పరమార్థతత్త్వమును ఎరుగజారు.
రాగద్వేషము ప్రవృత్తికి కారణము. రాగప్రేరితులై శుభకర్మ నాచరించి సుఖము ననుభవింతురు అందువన రాగము బంధనహేతువు. ఆ రాగము అవిద్య - అజ్ఞానము వన కుగును. అందుచే వారు పరమార్థసుఖము - మోక్షసుఖమును పొందలేరు. నానావిధముగు జన్మమరణముకు గురియగుదురు.
చిత్తము నేకాగ్రమొనర్చి సమాధిస్థుడై పరమాత్మను గురించి విచారించుటయే ఉపాసన. ఉపాసనఫలితము ఈశ్వరసాక్షాత్కారము. అటు పిమ్మట మోక్ష ప్రాప్తి. యోగము యొక్క అష్టాంగములే దీనికి సోపానము. అవి యమనియమాదు. ఇవి ఇంతకు క్రితమే చెప్పబడినవి.
అహింసాసత్యాస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహా యమాః । (యోగదర్శనము 2-30)
1. అహింస, 2. సత్యభాషణము, సత్యాచారము 3. అస్తేయము - దొంగతనము చేయకుండుట 4. బ్రహ్మచర్యముÑ 5. అపరిగ్రహము - అవసరమునకు మించి వస్తువును సేకరించకుండుట. ఈ ఐదు యమము.
శౌచసంతోష తపఃస్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః ॥
                    (యోగదర్శనము 2-32)
1. శుచి-శుభ్రతÑ 2. సంతోషముÑ 3. తపస్సు - ద్వంద్వము సహనముÑ 4. స్వాధ్యాయముÑ 5. ఈశ్వరప్రణిధానము - శుభకర్మ ఫమును భగవంతునికే అర్పించుట. ఈ ఐదు నియమము.
సాధకుడు ప్రతినిత్యము యమనియమమును పాటించుట ఆవశ్యకము. ఉపాసనా సమయమున కేవము ఈశ్వరునిగూర్చియే విచారించవలెను. ఇతర విచారముకు తావీయరాదు.
ప్రాణాయామము ఇంద్రియమును, మనస్సును తన వశమునందుంచుకొనుటకు చాలా ఉపకరించును.
    దహ్యన్తే ధ్మాయమానానాం ధాతూనాం హి యథా మలాః ।
    తథేంద్రియాణాం దహ్యన్తే దోషాః ప్రాణస్య నిగ్రహాత్‌ ॥ (మనుస్మృతి 6-71)
ధాతువును - ఇనుమును అగ్నిలో బాగుగ వేడిచేసినపుడు, దాని మము ఏవిధముగ కాలి నశించునో, అదేవిధముగ ప్రాణాయామము వన ఇంద్రియము దోషము నశించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి