మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

పురుషోత్తమ ప్రాప్తి యోగః

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ పంచదశో2ధ్యాయః
పురుషోత్తమ ప్రాప్తి యోగః
శ్రీ భగవాన్‌ ఉవాచ
ఊర్ధ్వమూమధశ్శాఖమ్‌ అశ్వత్థం ప్రాహురవ్యయమ్‌
ఛందాంసి యస్యపర్ణాని యస్తం వేదస వేదవిత్‌ 1
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూముగా ముఖ్య శాఖగా (కాండముగా)  వేదములే పర్ణము (ఆకు)గా గ ఈ సంసార రూప అశ్వత్త వృక్షము నాశరహితమైనది (శాశ్వతమైనది). ఈ సంసార వృక్ష తత్త్వమును మూ సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్ధమును ఎరిగినవాడు. (1)
అధశ్చోర్ద్వం ప్రసృతాస్తస్యశాఖా గుణప్రవృద్దా విషయ ప్రవాలాః
అధశ్చమూలాన్యనుసంతతానికర్మానుబంధీని మనుష్యలోకే 2
ఈ సంసార వృక్షమును త్రిగుణమునెడి జము తడుపుచుండును. ఈ జముచే వృద్దిపొందు శాఖలే దేవమనుష్య తిర్యగ్యోనులో జన్మించు ప్రాణు, చిగుళ్లే విషయ భోగము. ఈ శాఖు, చిగుళ్లు సర్వత్ర వ్యాపించి యున్నవి. మనుజును కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసననెడి వేర్లు, ఊడు అన్ని లోకములోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి. (2)
నరూపమస్యేహ తథోపభ్యతేనాంతో న చాదిర్నచసంప్రతిష్ఠా
అశ్వత్థ మేనం సువిరూఢమూమ్‌ అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా 3
ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా భ్యము గాదు. ఏనన ఇది ఆదియు, అంతము, సరిjైున స్థితియు లేనిది, కనుక అహంకార మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు, ఊడు గ ఈ సంసార రూప - అశ్వత్త వృక్షమును నిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండిరచి.. (3)
తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతాననివర్తంతి భూయః
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతఃప్రవృత్తిః ప్రసృతా పురాణీ
4
అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వ ృక్ష పరంపర విస్తరించి యున్నది. అట్టి ఆది పురుషుడైన నారాయణునే శరణు పొంది, ద ృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన, నిధి ధ్యాసాదు చేయవలెను. (4)
నిర్మానమోహాజితసంగదోషా అధ్యాత్మనిత్యావినివ ృత్తకామాః
ద్వంద్పైర్విముక్తాఃసుఖదుఃఖసంజ్ఞైగచ్ఛంత్యమూఢాఃపదమవ్యయంతత్‌
5
దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛ నుండి పూర్తిగా మలినవారును, పరమాత్మ స్వరూపము సందు నిత్యస్థితులైన వారును, సుఖదుఃఖాదిద్వంద్వము నుండి విముక్తులైన వారును అగు జ్ఞాను శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.(5)
న తద్భాసయతే సూర్యోన శశాంకోన పావకః
యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ 6
స్వయం ప్రకాశ రూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్నిగాని ప్రకాశింప జేయజారు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ము మర ఈ జగత్తున ప్రవేశింపరు. అనగా జన్మింపరు.
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థానికర్షతి 7
ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మనా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియమును శబ్దాది విషయము ద్వారా తనవైపు ఆకర్షించును. (7)
శరీరం యదవాప్నోతియచ్చాప్యుత్క్రామతీశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్‌ 8
వాయువు వాసనను ఒక చోటి నుండి మరియొక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదుకు స్వామిjైున జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సు ఇంద్రియమును గ్రహించి, వాటితో గూడ మరొక శరీరమును పొందును. అనగా దానిలో ప్రవేశించును. (8)
శ్రోత్రం చక్షుఃస్పర్శనం చ రసనం ఘ్రణమేవ చ
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే 9
ఈ జీవాత్మ త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణము అనెడి పంచేంద్రియమును మనస్సును ఆశ్రయించి, శబ్దాది విషయమును అనుభవించును. (9)
ఉత్క్రామంతం స్థితం వాపిభుంజానం వా గుణాన్వితమ్‌
విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః 10
జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరము నుండి స్థితుడైయున్నప్పుడును, విషయ భోగమును అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణముతో కూడియున్నప్పుడును అజ్ఞాను తెలిసికొనలేరు. కేవము వివేకశీురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రము వన స్వస్వరూపమును తెలిసికొన గ్లుదురు. (10)
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్‌
యతంతో2ప్యకృతాత్యానోనైనం పశ్యంత్యచేతసః 11
అంతఃకరణ శుద్ధిగ యోగు తమ హృదయము యందున్న ఈ ఆత్మ తత్త్వమును ప్రయత్నశీురై తెలిసికొనగరు. కాని, అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞాను ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొనజారు. (11)
యదాదిత్యగతం తేజో జగద్భాసయతే 2ఖిమ్‌
యచ్చంద్రమసి యచ్చాగ్నౌె తత్తేజోవిద్ధి మామకమ్‌ 12
సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటునే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును, నా తేజస్సేయని యెరుంగుము. (12)
గామా విశ్య చభూతాని ధారయామ్యహమోజసా !
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వారసాత్మకః 13
పృథ్వి యందు ప్రవేశించి, నేను నా శక్తి ద్వారా సక భూతమును ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై -అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధుకు అనగా వనస్పతున్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను. (13)
అహం వైశ్వానరో భూత్వాప్రాణినాందేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తఃపచామ్యన్నం చతుర్విధమ్‌ 14
నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్నిరూపములో సర్వప్రాణు శరీరము యందుండి నాుగు విధములైన ఆహారమును జీర్ణము చేయుచుందును. (14)
(ఆహారము భక్ష్య భోజ్య చోష్య లేహ్యముగా నాుగు విధము. నమబడునవి భక్ష్యము (రొట్టె మొదగునవి) మ్రింగబడునవి భోజ్యము (పాు మొదగునవి), ప్చీబడునవి చోష్యము (ఆస్వాదింపబడునవి, చెఱకు మొదగునవి) నాకుచు తినదగినవి లేహ్యము (తేనె మొదగునవి)
సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః స్మృతిర్‌ జ్ఞానమపోహనం చ
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యోవేదాంతకృద్వేదవిదేవ చాహమ్‌ 15
సమస్త ప్రాణు హృదయములో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మ ృతి, జ్ఞానము అపోహనము (సందేహమును తొగించుట) కుగుచున్నవి. వేదము ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే.(15)
ద్వావిమౌ పురుషౌ లోకేక్షరశాక్షర ఏవచ
క్షరః సర్వాణి భూతానికూటస్థో2క్షర ఉచ్యతే 16
ఈ జగత్తు నందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశరహితుడు) అని పురుషు రెండు విధముగా గరు. సకప్రాణు శరీరము నశ్వరము. జీవాత్మ నాశ రహితుడు. (16)
ఉత్తమఃపురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహ ృతః
యో లోకత్రయమావిశ్యభిభర్త్యవ్యయ ఈశ్వరః 17
పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ అతడు ముల్లోకము యందును ప్రవేశించి అందరిని భరించి పోషించుచున్నాడు. (17)
యస్మాత్‌క్షరమతీతో2హమ్‌ అక్షరాదపిచోత్తమః
అతో2 స్మిలోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః 18
ఏనన, నశ్వరమగు జడవర్గము (క్షేత్రము) కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మకంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తు నందును, వేదము యందును పురుషోత్తముడనని ప్రసిద్ధి కెక్కితిని (18)
యోమామేవమసమ్మూడో జానాతి పురుషోత్తమమ్‌
స సర్వవిద్భజతిమాం సర్వభావేన భారత 19
ఓ అర్జునా! జ్ఞానిjైునవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నేనిరంతరము పరమేశ్వరునిగా భజించును. (19)
ఇతిగుహ్యతమం శాస్త్రమ్‌ ఇదముక్తంమయానఘ
ఏతద్‌ బుద్ద్వాబుద్ధిమాన్స్యాత్‌ కృతకృత్యర్ధభారత 20
ఓ పుణ్యపురుషా! ఓ అర్జునా! అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానిjైు క ృతార్థుడు కాగడు. (20)
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
పురుషోత్తమ యోగో నామ పంచదశో2ధ్యాయః 15

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి