మనము ప్రతినిత్యము సిద్ధాంతపరమైన శాస్త్రీయవిషయమును మరియు లౌకిక విషయము నెన్నింటినో వినుచుంటాము. అవి ఎంతవరకు సత్యము అను సందేహము కుగుటలో ఆశ్చర్యము లేదు.
దారిలో మనకు ఒక పసుపుపచ్చని ధాతువు ముక్క కనిపించినపుడు అది ఇత్తడియా లేక బంగారమా అనునది మనకు కాని కంసాలి (స్వర్ణకారుడు) కన్నుకు గాని సరిగా తెలియదు. దానిని ఒరిపిడిరాయిపై గీచి చూచినపుడు అది ఇత్తడియో, బంగారమో, బంగారమే jైున దానిలో మిశ్రితమైన ఇతర పదార్థమెంత అనునది నేర్పరిjైున వ్యక్తి తెలిసికొనును. అట్లే మనము వినుచుండు సిద్ధాంత సంబంధమైన విషయము సత్యాసత్యమును నిర్ణయించుటకు మహర్షు ఒరిపిడిరాయి లాంటి కొన్ని పద్ధతు తెలిపినారు. విద్వాంసుడైన వ్యక్తి వాటి ఆధారముగ వినిన విషయములోని సత్యాసత్యమును నిర్ణయింపగడు. అవి ఈ విధముగ ఉన్నవి.
1. సృష్టి క్రమమునకు అనుకూమైనది సత్యము, విరుద్ధముగా నున్నది అసత్యము.
2. తన ఆత్మ పవిత్రతకు, విద్యకు అనుకూమైనది సత్యము. అనగా తనకెట్లు సుఖము ప్రియమో దుఃఖమప్రియమో అట్లే తాను ఇతరుకు సుఖమును కలిగించినచో ప్రసన్నుగను, దుఃఖమును కలిగించినచో అప్రసన్నుగను అగుదురని తెలియవలెను.
3. ప్రత్యక్షాది ప్రమాణము కనుకూమైనది సత్యము, విరుద్ధమైనది అసత్యము.
ప్రత్యక్షానుమానోపమానశబ్దాః ప్రమాణాని । (న్యాయదర్శనము 1-1-3)
ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనునవి ప్రమాణము.
1. ప్రత్యక్షము :
ఇన్ద్రియార్థసన్నికర్షోత్పన్నం జ్ఞానమవ్యపదేశ్యమవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షమ్ ॥ (న్యా.ద.1-1-4)
జ్ఞానేంద్రియముకు భూతముయొక్క గుణముతో సంబంధమేర్పడినపుడు కుగు జ్ఞానమును ప్రత్యక్షము అంటారు.
జ్ఞానేంద్రియము : 1. నాసిక, 2. నాుక, 3. కన్ను, 4. చర్మము, 5. చెవు.
భూతము : 1. పృథివి, 2. జము, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశము.
భూతము గుణము (అర్థము) : 1. గంధము (వాసన) 2. రుచి 3. రూపము, రంగు 4. స్పర్శ 5. శబ్దము.
ఆ జ్ఞానము సంజ్ఞాసంజ్ఞి సంబంధము వన కలిగినది (ఇతయి చెప్పినది) కాకూడదు. మొదట ఒక జ్ఞానము కలిగి తరువాత దాని స్థానమున ఇంకొక జ్ఞానము కుగకూడదు. అంతేకాదు ఆ జ్ఞానము నిశ్చయాత్మకమైనదిగా (ఇది ఇదియే అని) ఉండవలెను.
2. అనుమానము :
అథ తత్పూర్వకం త్రివిధమనుమానం
పూర్వవచ్చేషవత్ సామాన్యతో దృష్టం చ (న్యా.ద. 1-1-5)
ఒకప్పుడు ఏదైన పదార్థము ప్రత్యక్షముగా తెలిసినదై ఇంకొకచోట ఆ పదార్థము యొక్క సహచరి ప్రత్యక్షమైనచో ఆ కనపడని పదార్థము యొక్క జ్ఞానము కుగుటను అనుమానము అని అంటారు. అది ఎట్లన పుత్రుని చూచి తండ్రిని, పొగను చూచి అగ్నిని, సుఖదుఃఖమును చూచి పూర్వజన్మమును తెలిసికొనుట. ఇది మూడు విధము.
(1) పూర్వవత్ : కారణమును చూచినపుడు కార్యజ్ఞానము కుగుట. మేఘమును చూచి వర్షమును, చదువుచున్న విద్యార్థి తెలివితేటను చూచి విద్వాంసుడగునని నిర్ణయించుట.
(2) శేషవత్ : కార్యమును చూచినపుడు కార్యజ్ఞానము కుగుట. నదీ ప్రవాహమును చూచి కురిసిన వర్షమును, కుమారుని చూచి తండ్రిని, సృష్టిని చూచి అనాది కారణమును, దాని కర్తయగు ఈశ్వరుని, సుఖదుఃఖమునుచూచి పాపపుణ్యమును తెలిసికొనుట.
(3) సామాన్యతోదృష్టము : కార్యకారణ సంబంధము లేనిచోట ఒకానొక సమాన ధర్మము వన కుగు జ్ఞానము. ఎట్లన ప్రతి మనుష్యుడు తానున్న స్థానమునుండి కదక వేరొక స్థానమునకు చేరడు. ఇది అందరిలోను కనిపించు సమానధర్మము. మనము బొంబాయి వెళ్ళినపుడు అక్కడ బెంగుళూరులోని స్నేహితుడు కనబడినచో అతడు బెంగుళూరునుండి బయుదేరి బొంబాయికి వచ్చినాడనియే తెలిసికొందుము.
‘అను అర్థాత్ ప్రత్యక్షస్య పశ్చాత్ మీయతే జ్ఞాయతే’ ప్రత్యక్షమునకు పిమ్మట కుగునదని అనుమాన శబ్దార్థము.
3. ఉపమానమ్ :
ప్రసిద్ధసాధర్మ్యాత్ సాధ్యసాధనముపమానమ్ । (న్యా.ద. 1-1-6)
ప్రసిద్ధ ప్రత్యక్షసాధర్మ్యముచే సాధ్యమును - సిద్ధపరుపవసిన పదార్థము యొక్క జ్ఞానమును కలిగించు సాధనమును ఉపమానము అని అంటారు. ఒకడు తన నౌకరును విష్ణుమిత్రుని పిుచుకొనిరమ్మని, ఆ నౌకరు విష్ణుమిత్రుని ఎన్నడును చూచియుండని కారణమున, అతనిని బోలిన దేవదత్తుని చూపించి అతడిట్లుండునని చెప్పును. అప్పుడా నౌకరు విష్ణుమిత్రుని గుర్తించి పిుచుకొని వచ్చును.
4. శబ్దము : ఆప్తోపదేశః శబ్దః । (న్యా.ద.1-1-7)
పూర్ణవిద్వాంసుడును, ధర్మాత్ముడును, పరోపకారప్రియుడును, సత్యవాదియు, పురుషార్థియు, జితేంద్రియుడును, తాను దేని వన సుఖమును పొందెనో దానిని ఇతరుకు చెప్పవలెనను కోరికతో ప్రేరితుడై తనకు తెలిసినట్లు సమస్త మనుష్యు కల్యాణార్థము (మేుకొరకు) బోధించువాడును, పృథివి మొదుకొని పరమేశ్వరుని పర్యంతమువరకు గ పదార్థము జ్ఞానముకలిగినవాడును అగు ఉపదేష్ట ఆప్తుడు. ఇట్టి పురుషుని ఉపదేశము మరియు పూర్ణాప్తుడగు పరమేశ్వరుని యుపదేశమగు వేదమును శబ్దప్రమాణమంటారు.
ప్రమా అనగా జ్ఞానము. ప్రమాకరణం ప్రమాణం. ఏ సాధనము ద్వారా వస్తువు యొక్క జ్ఞానము కుగుతుందో దానిని ప్రమాణమంటారు. ఈ విధమగు పరీక్షచే మనుష్యుడు సత్యాసత్యమును నిర్ణయించవలెను. ఇంకొక మార్గము లేదు.
క్షణప్రమాణాభ్యాం వస్తుసిద్ధిః ।
తాను నిరూపింపజేయు వస్తువునకు ప్రమాణమును, క్షణమును తొపవలెను. లేనిచో దానిని ఇతయి అంగీకరించనవసరము లేదు. ప్రమాణమును గూర్చి పైన చెప్పబడినది.
అసాథారణో ధర్మః క్షణమ్ ।
ఇతర వస్తువులో లేకుండ కేవమావస్తువులోనే గ గుణమును క్షణమంటారు. ఆ క్షణము అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అను దోషము లేకుండా యుండవలెను.
అతివ్యాప్తి : చెప్పిన క్షణము సిద్ధింపజేయు వస్తువుతో పాటు ఇతర వస్తువులో ఉండుట. ఉదా: ఆవుకు క్షణము నాుగు కాళ్లుండుననుట. నాుగు కాళ్లు ఆవుతోపాటు కుక్క, గుఱ్ఱము మొదగు ఇతర జంతువులో కనిపించుటచే ఈ క్షణమును అతివ్యాప్తి అంటారు.
అవ్యాప్తి : చెప్పిన క్షణము సిద్ధింపజేయుదానిలో కాకుండ ఇతర వస్తువులో ఉండుట. ఉదా: గుఱ్ఱమునకు క్షణము కాలిగిట్టు చీలియుండుననుట. ఈ క్షణము గుఱ్ఱములో కాకుండ ఆవు మొదగు ఇతర జంతువులో నుండుటచే దీనిని అవ్యాప్తి అంటారు.
అసంభవము : ఆకాశ కుసుమము, గొడ్రాలి సంతానము, కుందేటి కొమ్ము మొదగునవి.
ఆవుకు క్షణము గంగడోు.
ప్రమేయము (తెలిసికొనదగినవి) :
ప్రమాణము ద్వారా తెలిసికొనదగిన పదార్థమును ప్రమేయము అంటారు. వాటిని ఇచట సామాన్యముగ తొపుతున్నాను. వీటిని విశేషముగ తెలిసికొనుటకు న్యాయదర్శనభాష్యమును చదవవలెను.
1. ఈ సృష్టికి కారణములైన మూతత్వము. అవి 1. పరమేశ్వరుడు 2. జీవు 3. ప్రకృతి.
2. ఆత్మశరీరేన్ద్ర్రియార్థబుద్ధిమనఃప్రవృత్తిదోషప్రేత్యభావఫదుఃఖాపవర్గాస్తు ప్రమేయమ్ (న్యా.ద. 1-1-9)
1. జీవాత్మ, పరమాత్మ 2. శరీరము, 3. జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము 4. అర్థము - భూతము గుణము 5. బుద్ధి, 6. మనస్సు, 7. ప్రవృత్తి, 8. దోషము 9. ప్రేత్యభావము - పునర్జన్మ, 10. ఫము, 11. దుఃఖము, 12. అపవర్గము - మోక్షము అనునవి ప్రమేయము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి