అవిద్య-అజ్ఞానము వన జీవునకు శరీరముతో సంబంధము కుగుతుంది. ఈ శరీరము జీర్ణమైనపుడు దీనిని విడిచి ఇంకొకశరీరములో ప్రవేశిస్తాడు. ఈ విధముగ అజ్ఞానములో నున్నంతకాము జన్మ, మరణము మర జన్మ, మరణము అను అవాగమనచక్రములో చిక్కుకొని దుఃఖమును అనుభవిస్తుంటాడు. దీనినే బంధనము అనిఅంటారు. బంధనములోనున్నంతవరకు దుఃఖము తప్పదు. దుఃఖము మూడురకము అవి.
1. ఆధ్యాత్మికదుఃఖము : వ్యాధు మొదగువాటివన కుగు శారీరిక బాధు. కామక్రోధాదు వన కుగు మానసిక బాధు. ఇవి జీవుడు తనకై తాను కలిగించుకున్నవి.
2. ఆధిభౌతికదుఃఖము : ఇది ఇతర ప్రాణు వన కుగునది. వ్యాఘ్రాది క్రూరమృగము వన, విషజంతువు వన, హంతకు చోరువన కుగు బాధు.
3. ఆధిదైవికదుఃఖము : దేవతనగా ప్రాకృతికములైన పంచభూతము. వీటివన కుగు భూకంపము, ఆశనిపాతము, అతివృష్టి, అనావృష్టి మొదగునవి. ఇవి కూడ దుఃఖమును కలిగించునవి.
ఇట్టి దుఃఖమున్నింటికి కారణము బంధనము.
అవిద్యాస్మితరాగద్వేషాభినివేశాః క్లేశాః ॥ (యోగదర్శనము 2-3)
అవిద్య, అస్మి, రాగము, ద్వేషము, అభినివేశము అను ఈ ఐదు క్లేశము - మిథ్యాజ్ఞానము, విపర్యయము. ఇవి కష్టమును, బాధను కలిగించునవి. వీటిలో అస్మిత మొదగు క్లేశము అవిద్య ఉన్నచో ఉండును. అవిద్య లేనిచో ఉండవు. కావున అస్మితాదుకు అవిద్య మూము.
క్లేశమూః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయః ॥ (యోగదర్శనము 2-12)
ఈ జన్మలోను రాబోవు జన్మలోను అనుభవించదగు కర్మాశయము R పాపపుణ్యము సంస్కారము క్లేశము వన కుగును.
సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః ॥ (యోగదర్శనము 2-13)
అవిద్యాది క్లేశమున్నంతవరకు కర్మాశయమునకు విపాకమైన - ఫరూపమైన జాతి-జన్మ, ఆయువు-జీవనకాము, భోగము-సుఖదుఃఖానుభవము అను ఈ మూడు ఉంటాయి.
తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్ ॥ (యోగదర్శనము 2-14)
ఆ జాతి, ఆయువు, భోగము పుణ్యకర్మ వన సుఖమును, పాపకర్మ వన దుఃఖమును కలిగిస్తాయి.
దుఃఖజన్మప్రవృత్తిదోషమిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే తదనంత రాపాయాదపవర్గః ॥ (న్యాయదర్శనము 1-1-2)
దుఃఖమునకు కారణము జన్మ, జన్మకు కారణము ధర్మాధర్మప్రవృత్తి, ప్రవృత్తికి కారణము రాగ ద్వేషమును దోషము. ఆ దోషమునకు మూము మిథ్యాజ్ఞానము, అవివేకము, అవిద్య. ఈ విధముగ శాస్త్రములో దుఃఖభరితమైన బంధనమునకు కారణము అవిద్య, అజ్ఞానము, విపర్యయము, మిథ్యాజ్ఞానము, అవివేకము, ప్రకృతిపురుషవివేకజ్ఞానము లేకపోవుట అని చెప్పబడినది. బద్ధజీవుడు చేయు శుభాశుభకర్మ ఫమును అనుభవించకుండ తప్పించుకొనలేడు.
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి