ఏకమేవ తు శూద్రస్య ప్రభుః కర్మ సమాధిశత్ ।
ఏతేషామేవ వర్ణాణాం శుశ్రూషామనసూయయా ॥ (మనుస్మృతి 1-91)
నింద, ఈర్ష్య, అభిమానాది దోషమును వదలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు సేవ యథారీతి చేయుచు జీవించుట. ఇదియే శూద్రుని కర్మ.
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ॥ (భగవద్గీత 18-44)
శూద్రుని స్వాభావికమైన కర్మ సేవాభావము.
ఆశ్రమవ్యవస్థ :
బ్రహ్మచర్యాశ్రమం సమాప్య గృహీ భవేత్ ।
గృహీ భూత్వా వనీ భవేత్ వనీ భూత్వా ప్రవ్రజేత్ ।
(శతపథబ్రాహ్మణము. కాం.14)
బ్రహ్మచర్యాశ్రమము పూర్తిచేసి గృహాశ్రమములో ప్రవేశించవలెను. ఆ తర్వాత వానప్రస్థము పిదప సంన్యాసము గ్రహించవలెను. ఈ విధముగ ఆశ్రమము నాుగు.
1. బ్రహ్మచర్యము, 2. గృహాశ్రమము, 3. వానప్రస్థము, 4. సంన్యాసము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి