మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

మానుకొండ రాధాకృష్ణమూర్తి - పరిచయం

శ్రీ మానుకొండ రాధాకృష్ణమూర్తి గారు 1967 సం॥ నాటి పట్టభద్రు. వీరు మినిష్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌, గవర్నమెంటు ఆఫ్‌ ఇండియా సంబంధిత ఆఫీసులో, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసరుగా విధు నిర్వహించి, 2004 సం॥లో, తమ 60 సం॥ వయస్సు తరువాత ఉద్యోగవిరమణ చేశారు.
శ్రీ రాధాకృష్ణమూర్తి గారి జన్మస్థము, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుంటూరు జిల్లా అంతర్గత తెనాలి పట్టణము. వీరి తల్లిదండ్రు లిరువురు కూడ మంచి శ్రమశీం గలిగిన సంస్కారవంతు. దైవభక్తి మెండుగా గలిగి, దానధర్మముతో కూడిన ధార్మిక జీవితాను గడిపి, సుసంతానముతో ధన్యజీవుయినారు. వారికి మొత్తముగా 11మంది సంతానము. వరుసగా కలిగిన అయిదుగురు ఆడప్లి సంతానములో ఇరువురు కాం చేసిన తరువాత శ్రీ రాధాకృష్ణమూర్తి గారు, 1943 జూన్‌ మాసములో జన్మించిరి. వీరి తరువాత ముగ్గురు మగప్లిు గలిగిరి. ఆ తరువాత వీరి తండ్రిగారు తమ 57 సం॥ వయస్సులో 1962లో అకా మృత్యువాత బడిరి. అప్పుడు కుటుంబ బాధ్యతు, వీరి తల్లిగారు వీరరాఘవమ్మగారిపై బడినవి. అప్పటి నుండి, 19 సం॥ వయస్సుగ మూర్తిగారు కుటుంబ బాధ్యతను నిర్వహించటములో తల్లిగారికి వీరు ఎంతగానో తోడ్పడినారు. వీరి తండ్రిగారు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వర్క్సు చేశారు.తండ్రిగారి చివరి కోరిక మేరకు వీరి తల్లిగారు ఎంతో కష్టపడి శ్రీ రాధాకృష్ణమూర్తి గారిని మెకానికల్‌ ఇంజనీరుగా చదివించినారు. వీరు ఉద్యోగము చేసుకుంటూ, నిస్వార్థముగా ముందుగా వీరి తోడబుట్టినవారికి తగిన చదువు, ఉద్యోగము మరియు వివాహాది సంస్కారము నెరవేర్చుటయందు, తల్లిగారికి సహకరించిరి. తల్లిగారు తమ 68 సం॥ వయస్సులో 1985 సం॥లో స్వర్గస్థుయినారు. అనంతరము వీరి 52 సం॥ వయస్సులో శ్రమించి మిగిలిన తన చెల్లెలి వివాహము కూడ, 1994 సం॥లో పూర్తిచేసారు. తన తండ్రిగారి చివరిరోజు కోర్కె, అందరు బాగుండాలి అనే వాక్యమునకు, వీయినంతవరకు న్యాయము చేశారు.వీరు మాత్రము నైష్ఠిక బ్రహ్మచాయిగానే మిగలిగిపోయారు.
శ్రీ రాధాకృష్ణమూర్తి గారు, తమ తల్లిదండ్రు పేరు ‘‘మానుకొండ వీరరాఘవమ్మ మరియు క్రిష్ణయ్య గార్ల మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్టును 2006 సం॥లో స్థాపించిరి. ఆ ట్రస్టు ద్వారా అనేకమందికి, రకరకముగా ఆర్థిక సహాయము చేయుచున్నారు. అనగా వైదిక ధర్మప్రచారమునకు ప్రధానముగాను, తరువాత వైదిక గురుకుముకు, విద్యార్థుకు, రోగుకు ఉచితముగా పుస్తకము, ఫీజు, మందు, కళ్ళ ఆపరేషన్‌ు, అట్లాగే వృద్ధుకు నెవారి ఫించను రూపముగా ఆర్థిక సహాయము మరియు ఉచితమని తోచినప్పుడు వేరే వేరే రకముగాను దయాభావంతో, ఉదారంగాను సహాయము చేశారు. ఇప్పటికి చేస్తున్నారు, చేస్తారు. అందులో ఒక భాగంగానే ప్రస్తుతము ‘‘వైదిక సిద్ధాంత పరిచయము’’ గ్రంథ పునర్ముద్రణకు అవసరమైన పూర్తి ఖర్చును మాకు ఇచ్చి తోడ్పడినారు. 
వీరు ఈ మధ్యన 2015 సం॥లో తెనాలి ఆర్యసమాజ భవన పునరుద్ధరణకు ఇతోధికంగా, ఆర్థిక సహాయము చేసి సమాజమునకు తోడ్పడినారు. తెనాలి ఆర్యసమాజ సభలో, వారి కార్యక్రమములోను విరివిగా పాల్గొంటూ వారిని బాగా ప్రోత్సహిస్తున్నారు.
నియమబద్ధముగా జీవితమును సాగించుచున్న వీరికి ఆధ్యాత్మిక భావము కూడ మెండుగానే ఉన్నవి. వీరికి తన 25 సం॥ వయస్సులోనే 1968 సం॥లో, తెనాలి పట్టణములో శ్రీ నాగం రామారావు (వామదేవ్‌)గారి ద్వారా విద్వత్‌ శిరోమణి, షడ్దర్శనాచార్యు, కళాపూర్ణ బిరుదాంకితు, నైష్ఠిక బ్రహ్మచాయి అయిన శ్రీ పండిత గోపదేవ్‌శాస్త్రిగారితో పరిచయమేర్పడినది. వారి ద్వారా ఆర్యసమాజ భావాను, వేద సిద్ధాంతమును బాగుగా అవగాహన చేసుకున్నారు. తరువాత కూడ శతాధిక ఆయుష్కు శ్రీ పండిత గోపదేవ్‌శాస్త్రిగారు పరమపదించే వరకు అనగా 1996 సం॥ వరకు వారిని కుసుకుంటూ, వారితో చక్కని అనుబంధమును కలిగి ఉన్నారు.
ప్రస్తుతము వీరు హైదరాబాదులో నివసిస్తూ, ఎవరైనా మిత్రు వీరిని కవటానికి వచ్చినప్పుడు వారితో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక విషయమును, సైంటిఫిక్‌గా విశ్లేషించి, తర్కబద్ధముగా వివరించి వారికి కలిగే సందేహమును, ఓర్పుగా, నేర్పుతో నివృత్తి చేసి వారికి మంచి జ్ఞానమును కలిగించే ప్రయత్నము చేయుచున్నారు. వీరితో మాట్లాడినవారు ఒకరకంగా వీరిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించగుగుతారు, ప్రసన్నువుతారు. ఉదాహరణ:
ఈ పుస్తకమునకు అనుబంధముగా చివరలో ఇవ్వబడిన, శ్రీ రాధాకృష్ణమూర్తి గారి చేతనే స్వయముగా వ్రాయబడిన ‘‘నా మనస్సులోని మాట (అంతరంగము)’’ అనే పేరున వ్యక్తపరుపబడిన వారి అభిప్రాయము స్వయంపోషకము, ఆదరణీయము ఈ పుస్తక పఠనావశ్యకతను గుర్తింపజేయుటలో వారు పడిన హృదయవేదన ప్రశంసనీయము కూడ.
ప్రస్తుతము వీరు 74 సం॥ వయస్సులో కూడ ఉత్సాహంగా, ఆరోగ్యముగానే ఉన్నారు. వీరు శతవర్షము పైబడి, ఆరోగ్యముగా జీవిస్తూ ఆర్యసమాజానికి, మానవ సమాజానికి తోడ్పడుతూ, వైదిక సంస్కృతిని ఉద్ధరించే ప్రయత్నములోనే ఉండాని, అందుకు తగిన శక్తిసామర్థ్యమును, సర్వేశ్వరుడు శ్రీ రాధాకృష్ణమూర్తి గారికి ప్రసాదించాని, మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి