మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ఆస్తిక నాస్తిక శబ్దార్థము


ప్రపంచములోని మానవు ఆస్తికు, నాస్తికు అని రెండు రకముగ ఉన్నారు. ఆస్తికునగా ఇంద్రియగోచరమగు నీ ప్రపంచమును పుట్టించి, కొంతకాము దానిని స్థితిలో నుంచి, ఆ తరువాత ప్రళయము చేయు ఒక చేతన - పూర్ణజ్ఞానయుక్తమైన తత్త్వము ఉన్నదని అంగీకరించువారు. దానిని ఈశ్వరుడని అంటారు. సాధారణముగా దేవుడనియు అంటారు. వైదికు, హిందువు - పౌరాణికు, అద్వైతాది సాంప్రదాయకు, మహమ్మదీయు, క్రిష్టియను మొదగువారు ఆస్తికు.
నాస్తికు పైన వర్ణించినట్టి దేవతత్త్వము లేదంటారు. పదార్థము గుణమువన ఈ సృష్టి దానికదియే ఏర్పడుననియు, ఇందుకింకొక చేతనపదార్థము అవసరము లేదని వారి వాదము. వీరు భౌతికవాదు, జైను, బౌద్ధు, చార్వాకు, కమ్యూనిస్టు మొదగువారు.
పాణిని మహర్షి అష్టాధ్యాయీ యందు ఆస్తిక నాస్తిక శబ్దమును ఈ క్రింది సూత్రము ద్వారా నిర్దేశించియున్నాడు.
    అస్తినాస్తిదిష్టం మతిః ॥ (అష్టాధ్యాయీ 4-4-60)
    అస్తీతి అస్యమతిః అస్తికః । నాస్తీతి అస్య మతిః నాస్తికః ॥ (మహాభాష్యము)
భగవంతుడు మరియు ధర్మమునందు విశ్వాసము కవాడు ఆస్తికుడు మరియు విశ్వాసము లేనివాడు నాస్తికుడు.
    నాస్తికో వేదనిందకః ॥ (మనుస్మృతి 2-11)
అనగా వేదమును నిందించువాడు - వేదప్రతిపాదిత సిద్ధాంతమునకు విరుద్ధ ఆచరణగవాడు నాస్తికుడు.
దేవతత్త్వము ఉనికిని అంగీకరించు ఆస్తికుందరు ఏకమతస్థు - ఒకే అభిప్రాయము కవారు కారు. వారి మధ్య ఎన్నో భేదమున్నవి. ఒకరి సిద్ధాంతము లింకొకరికి గిట్టవు. ఈశ్వరతత్త్వమును సైతము అందరు ఒకేవిధముగ అంగీకరింపరు. ఈశ్వరుడన ఎవరు? మన కన్ను కగపడు ఈ ప్రపంచమేమి? దీని ప్రయోజనమేమి? ఈశ్వరునకు జీవునకు గ సంబంధమేమి? ఉపాసన అనగా నేమి? దాని సాధనము లెవ్వి? దాని ప్రయోజనమేమి? బంధనమననేమి? దానికి కారణమేమి? దానివన కుగు నష్టమేమి? పశుపక్ష్యాదు యోనులెందుకు? మనుష్యయోని ఉత్కృష్టత ఏమి? మనుష్యుని కర్తవ్యము లెవ్వి? అతని ఉద్దేశ్యమేమి? ధర్మమనగా నేమి? మొదగు విషయము గురించి విభిన్న మతస్థు ఏకాభిప్రాయు కారు. నిష్పక్షపాతిjైున జిజ్ఞాసువు వారి వాదనను వినినచో అతనికి ఆస్తిక్యము పైననే వెగటు కుగును. ఇది నేటి సమాజములోని ఆస్తిక్యస్థితి. అంతమాత్రమున ఆస్తిక్యమనునది ఆకాశకుసుమము వంటి క్పానిక విషయము కాదు. ప్రాచీనకామున అనగా మహాభారత యుద్ధమునకు పూర్వము మనదేశములో ఇట్టి అనైక్యతస్థితి లేదు. నేడు ప్రచారములో నున్న విభిన్న మత మతాంతరము లేవు అందుకు కారణము ఆ రోజులో వేదాది ఆర్షగ్రంథము సమాజములో పఠనపాఠనవిధిలో బహుళప్రచారములో నుండుటయే.
భారత యుద్ధానంతరము మనదేశములో ఋగ్వేదాది సచ్ఛాస్త్రము పఠనపాఠనవిధి లోపించినది. ప్రజలో దార్శనికదృష్టి నశించినది. అట్టి పరిస్థితిని అవకాశముగా గ్రహించి కొందరు స్వసిద్ధాంతమును వేదము పేర ప్రచారము చేయుచు విభిన్న మతముకు, సాంప్రదాయముకు రూపక్పన చేసిరి. ‘‘చెట్టుపేరు చెప్పి కాయమ్ముకొనుట’’ యను లోకోక్తిని చరితార్థము చేసిరి.
ఋగ్వేదాది ఆర్షగ్రంథమున్నియు దేవవాణిjైున సంస్కృతభాషలోనే ఉన్నవి. పూర్వకామున సంస్కృతాధ్యయనము పాణినిమహర్షికృత అష్టాధ్యాయీ మొదగు ఉపదేశము, పతంజలి ఋషికృత మహాభాష్యము ద్వారా జరుగుచుండెడిది. వ్యాకరణము బోధించుటకు అంతకంటే సుభతరమైన పద్ధతి మరియెండు లేదు. దీని స్థానమున కఠినతమములైన రూపావతార కౌముద్యాదు ప్రవేశపెట్టబడినవి. దీనిచే సంస్కృతము ప్రజకు దూరమైనది. దీనితోపాటు వైదికసాహిత్యమంతయు ప్రజకు దూరమైనది. సంస్కృతభాష అధ్యయనాధ్యాపనము లోకమున సన్నగ్లిుట వన విదేశీయు, వారి అడుగుజాడ గ్రుడ్డిగా ననుసరించు ఏతద్దేశీయును సైతము సంస్కృతభాషను మృతభాష యని చెప్పుటకు వెనుకాడరైరి. కాని వీరి ఈ ఆక్షేపము సూర్యరశ్మి నాపుటకు చేతు నడ్డుపెట్టుటవంటిదియే.
ఇప్పటికైనను పాణినీయ అష్టాధ్యాయీ మాధ్యమున సంస్కృత ప్రచారము గావించినచో వేదాది సచ్ఛాస్త్రము ప్రజాదరణను పొందుననుటలో సందేహము లేదు. అప్పుడు మానవసమాజము వేదబోధిత ధర్మాచరణులై సుఖశాంతుతో తోటిమానవు యెడ సోదరభావముతో జీవితము గడుపుచు ధర్మార్థకామ మోక్షమునెడి పురుషార్థమును సిదిధంచుకొనగదు. అంతే కాదు
    ఏతద్దేశప్రసూతస్య సకాశాదగ్రజన్మనః ।
    స్వం స్వం చరిత్రం శిక్షేరన్‌ పృథివ్యాం సర్వమానవాః ॥ (మనుస్మృతి 2-20)
అను మనుస్మృతి శ్లోకము చరితార్థమగును. అనగా ఓ ప్రపంచములోని మానవులారా ఈ భారతదేశమున జన్మించిన వేదాది సకశాస్త్ర పారంగతులైన విద్వాంసు - బ్రాహ్మణు సమక్షమున మీ మీ యోగ్యత కనువైన విద్యను మరియు కర్తవ్యమును నేర్చుకొనుడు.
మనుష్యుని బుద్ధి ఇతరు సహాయము లేనిది ఉన్నతిని పొందదు. బుద్ధివికాసమునకై చక్కటి సాహిత్యమవసరము. అట్టి గ్రంథపఠమువన మనుష్యుడు మంచిచెడును, సత్యాసత్యమును తెలిసికొని తన చరిత్రను - నడవడిని సరిదిద్దుకొని ఆదర్శజీవితమును గడుపగడు. అట్టి సాహిత్యమెద్దియన -
    బుద్ధివృద్ధికరాణ్యాశు ధన్యాని చ హితాని చ ।
    నిత్యం శాస్త్రాణ్యవేక్ష్యేత నిగమాన్‌ శ్చైవ వైదికాన్‌ ॥ (మనుస్మృతి 4-19)
శీఘ్రముగ బుద్ధిని - మేధస్సును వృద్ధిచేయు శాస్త్రమును ప్రతినిత్యయము చదువవలెను. అట్టి శాస్త్రములేవన ధన్యము, హితకారకములైన వేదము, వైదికసాహిత్యయము. వీటిగురించి ‘ఆర్షగ్రంథము’ అను శీర్షికన వ్రాయబడినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి