మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

మహా భాగవత వచనం

శ్రీ మహా భాగవతం
(వచనం)
కథా ప్రారంభం
    శ్రీ వేదవ్యాసుడు సరస్వతి నదీ తీరంలోని తన ఆశ్రమంలో దర్భాసనం మీద కూర్చున్నాడు. ఆయన ముఖం గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తుంది. వ్యాసు వారు ఏదో దీర్ఘాలోచనలో మునిగినట్లు గంభీరంగా కనిపిస్తున్నాడు. శ్రీహరినామ సంకీర్తనం ఎక్కడినుంచో వినిపిస్తున్నది. వ్యాసుడు అటు వైపు చూసాడు. నారదు! భూమికి దిగి వచ్చిన సూర్యబింబంలా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. నారద మహర్షి.
    వ్యాసుడు ఎదురేగి వెళ్లి స్వాగతం పలికి నారదున్ని ఆశ్రమం లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంపై కూర్చున్న నారదుడు వ్యాసున్ని పరీక్షగా చూసి చిరునవ్వు నవ్వాడు.
    మహాత్మ మీ ముఖంలో విచారం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. కారణం ఏమిటి? అడిగాడు నారదుడు.
    చెప్పడం మొదలెట్టాడు వ్యాసుడు.
    దేవర్షీ! నిజమే నీవు అన్నమాట! నాకు మనశ్శాంతి లేదు. ఎందుకో తెలియడం లేదు. చిక్కు పడిఉన్న వేదాల్ని విడదీసి నాుగు భాగాు చేశాను. అందుకు మును, బ్రహ్మ అందరూ ఆనందించారు. 18 పురాణాు రచించాను. ఇంకా పంచమ వేదం అని పేరుపడిన మహాభారతాన్ని 18  పర్వాుగా, క్ష శ్లోకాలో చెప్పాను. ఇదంతా విశ్వ శ్రేయస్సు కోసం చేసినదే కదా!
    అవును నిజమే అన్నాడు నారదుడు.
    అయినా ఏదో వెలితి! ఏదో అసంతృప్తి నా హృదయాన్ని పట్టుకుని వదడం లేదు. ఈ అశాంతికి కారణం నాకు తెలియడం లేదు. నువ్వు మహాజ్ఞానివి. చెప్పి పుణ్యం కట్టుకో..
    అశాంతితో గిగి లాడుతున్న నీకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఒక్క క్షణం స్తిమితంగా ఆలోచిస్తే నీకే కారణం బోధపడుతుంది. నువ్వు అడిగావు కనుక చెప్తా విను.
    వేదవ్యాసా! నీవు వేదాల్ని విభజించావు. శాస్త్ర పురాణాు చెప్పావు. కానీ మానవుడు శ్రమ లేకుండా తరించే ఉపాయాన్ని చెప్పలేదు. సామాన్యుడు వేదాను వల్లించగడా? యజ్ఞాు చేయగడా? కలియుగంలో అది సాధ్యమా? అది సరే! మనశ్శాంతికి దగ్గరి త్రోవ మహా విష్ణువుకి సంబంధించిన కథల్ని, విష్ణుభక్తు కథల్ని వినడం.. అందువ్ల మనస్సులో విష్ణుభక్తి కుదురు కోవడం ` తద్వారా మనశ్శాంతి భిస్తుంది. రాబోయేది కలియుగం. ఆ యుగంలో ప్రజు ఎక్కువ శ్రమపడి క్ష్యాన్ని చేరుకోలేరు. వారికి అన్నీ సుభంగా  భించాలి. మోక్షం అయినా అంతే. కనుక నువ్‌ విష్ణువు లీల్ని వర్ణించు. అట్లాంటి గ్రంథం వ్ల చదివినవారికి ముక్తి భిస్తుంది. నీకు మనశ్శాంతి కుగుతుంది. పైగా లోకానికి కూడా మేు కుగుతుంది.
    వేదవ్యాసుడు నారదుని మాటు విన్నాడు. ఆ మహర్షి చెప్పిన ప్రతి మాట యధార్థం అనిపించింది. సరే  మీరు  చెప్పినట్లు  విష్ణు వుకీ, విష్ణుభక్తుకు సంబంధించిన కథు భాగవతం పేరున రచిస్తాను అన్నాడు వ్యాసుడు.
    శుభస్య శీఘ్రం అంటూ నారదుడు వెళ్ళిపోయాడు.
    వేదవ్యాసుడు భాగవతం రచించి శిష్యు ద్వారా అన్ని లోకాకు  వ్యాపింపజేసాడు.  భగవతం ఒక్కటే ముక్తికి మార్గం అని  అందరు గ్రహించేరు. భక్తి తొమ్మిది రకాని పెద్దు చెప్పారు. వానిలో శ్రవణభక్తి మొట్టమొదటిది. శ్రీహరి లీల్ని ఒకరు చెప్పగా వినడం వల్లే ముక్తి భిస్తుంది. ఇందువ్ల నిరక్షరాస్యు కూడా తరించే మార్గం భాగవతం ప్రబోధించింది. ఇక  చదువుకొని  ఆనందించే  వారి  భాగ్యం  వేరే చెప్పాలా?
    ఆ శ్రీహరి కథు మధురాతి మధురాు. ఆ కథల్ని వేదవ్యాసుని కుమారుడైన శుక మహర్షి  ధర్మరాజు మనుమడు  అయిన  పరీక్షిత్తు మహారాజుకు  7రోజు చెప్పాడు. అదే  శ్రీ మహాభాగవతం గా  ప్రసిద్ధికెక్కింది.
పూర్వ కథ
    పాండవు  అయిదుగురు.  ధర్మరాజు,  భీముడు,  అర్జునుడు, నకుడు,  సహదేవుడు.  వీళ్ళు  పాండురాజు కొడుకు.  దుర్యోధనుడు, దుశ్శాసనుడు  మొదలైనవారు  కౌరవు  వందమంది. వీళ్లు ధృతరాష్ట్రుని పుత్రు. పాండురాజు,  దృతరాష్ట్రుడు  అన్నదమ్ము.  అన్నదమ్ము ప్లిలైన  కౌరవ పాండవుకు  రాజ్య పంపకం వద్ద  తగాదా వచ్చింది.  అది  కురుక్షేత్ర యుద్ధం దాకా సాగింది. ఆ యుద్ధంలో  కౌరవుందరూ  మరణించారు.  రాజ్యం మొత్తం పాండవుకి దక్కింది. ధర్మరాజు రాజయ్యాడు. పేరుకు తగ్గట్టు  ధర్మంగా పరిపాలించాడు. ఇంతలో కలియుగం ప్రారంభమైంది.  క్రమంగా అధర్మ క్షణాు కనిపించడం మొదలైంది. ధర్మరాజు  రాజ్య పరిపానలో విరక్తుడు అయ్యాడు. అర్జునుని మనుమడు అభిమన్యుని కొడుకయిన పరీక్షిత్‌ మహారాజుకి రాజ్యం అప్పగించి ఒక శుభముహూర్తంలో ధర్మరాజు తన నుగురు సోదయీ ద్రౌపది వెంటరాగా అడవుకు వెళ్లి పోయాడు.
    తర్వాత వారందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
    పరీక్షిత్తు ధర్మరాజు లాగే ధర్మంగా పరిపాలించాడు. ఒకనాడు ఆయనకు వేటాడాని అనిపించింది. అడవికిపోయి క్రూర జంతువుని చంపాడు. ఓ పక్క వేట మరో ప్రక్క అసట. మరో పక్క చుర్రుమనిపించే ఎండ. ఆ రాజుకి  చాలా దాహం వేసింది. దూరంగా ఏదో ఆశ్రమం కనిపిస్తే కాసిన్ని మంచినీళ్లు దొరక్క పోతాయా యని అక్కడికి వెళ్లాడు.
    అది శమీకుడు అనే ముని ఆశ్రమం. పరీక్షిత్తుకు ఆ ఆశ్రమంలో ఓ చెట్టుకింద ధ్యానంలో ఉన్న ముని కనిపించాడు. పరీక్షిత్తు వినయంగా మహాత్మా చాలా దాహంగా ఉంది కాసిని మంచినీళ్లు ఇప్పించండి అని అడిగాడు. ఉహు.. ముని ఉకలేదు. పకలేదు ధ్యానంలో ఉన్నాడుగా మరి.
    పరీక్షిత్తు కోపం వచ్చింది. ఓ పక్క ఎండ! మరో ప్రక్క దాహం! కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు ఆ రాజు. పక్కనే ఓ పాము ప్రాణం పోయిపడి ఉంది. ఆ పాము శవాన్ని పైకెత్తి ముని మెడలో వేసి చరచరా అక్కడినుంచి వెళ్లిపోయాడు. వేట చాలించి కోటకు చేరుకున్నాడు.
    ఆ శమీకునికి ఒకే ఒక్క కొడుకున్నాడు. అతని పేరు శ ృంగి. తండ్రి అంటే అతనికి మహా ప్రేమ గౌరవము. స్నేహితుతో ఆడుకొంటూ ఆశ్రమంలోకి వచ్చి తన తండ్రి మెడలో పాము ఉండడం చూసి భయంతో కేకు వేశాడు. అందరు స్నేహితు చేరి అది బ్రతికి ఉన్న పాము కాదు అని చెప్పాక శ ృంగి తండ్రి మెడలో ఉన్న పాము శవాన్ని తీసి బయటకు విసిరేశాడు. తన తండ్రికి జరిగిన అవమానానికి కోపంతో ఊగిపోయాడు శ ృంగి. నా తండ్రి మెడలో ఈ పామును వేసిన దుర్మార్గుడు ఎవరో వాడు నేటికీ ఏడవ రోజున పాము కొచ్చి చచ్చిపోవు గాక అని శపించాడు.
    ఈ హడావుడి హంత పూర్తయ్యేసరికి శమీకుడు ధ్యానం ముగించాడు. కళ్లు తెరచి జరిగినదంతా కొడుకు చెప్పగా దివ్యద ృష్టితో తొసుకున్నాడు. తన కొడుకు ధర్పపరిపాకుడైన పరీక్షిత్తును శపించాడని గ్రహించి శమీకుడు చాలా విచారించాడు. శృంగిని  మందలించాడు.
    ఎంత పని చేసేవురా అబ్బాయి!  ధర్మరాజు మనవడు మన రాజ్యాన్ని ధర్మంగా పరిపాన చేస్తున్న పరీక్షిత్తు మహరాజును నువ్వు శపించావు. ఆయన చాలా మంచివాడు. ఆయన పరిపాన వల్లే రాజ్యం సుభిక్షంగా ఉంది. మనలాంటి మునుకు కూడా ఏ కష్టం లేకుండా ఉంది. రాజు లేకపోతే రాజ్యం అరాజకం అవుతుంది. దుష్టు చెరేగిపోయి సజ్జనుని హింసిస్తారు. ధర్మం నశిస్తుంది. కోపం మంచిది కాదు. పైగా మనలాంటి మునుకు అసు తగదు. ఏ పని చేసినా మంచి చెడ్డల్ని గురించి ఆలోచించాలి. కోపం వ్ల మనుషుల్లోని సమస్త సద్గుణాు నశిస్తాయి. అయ్యో! నీ శాపం ఒక మంచి మనిషిని బాధిస్తుంది కదా!
    ఒమీకుడు కొడుకుని మందలించి ఒక శిష్యున్ని పరీక్షిత్తు వద్దకు పంపి జరిగిన సంగతున్నీ ఆయనకు తెలియజేశాడు. శమీక శిష్యుడు నిండు సభలో చెప్పిన మాటు విని పరీక్షిత్తు ఒక క్షణం మౌనం వహించాడు. ఇంక తనకు ఏడు రోజులే ఆయుష్‌ ఉన్నదన్నమాట!
    పరీక్షిత్తు నిబ్బరంగా ముని కుమారుడు ఇలా అన్నాడు... పెద్దల్ని అవమానించిన పాపం వూరికే పోదు. నేను అపరాధం చేసాను. అందుకు శిక్షను ఆనందంగా అనుభవిస్తాను. మీరు ఆశ్రమానికి పోయి మీ గురువుతో గురుపుత్రుని తో నన్ను క్షమించవసిందిగా చెప్పండి.         ముని కుమారుడు వెళ్లిపోయాడు.
    సభలోని మంత్రు, పురోహితు నోటి మాటల్లేకుండా విగ్రహాల్లా కూర్చున్నారు. ఎంత పని జరిగింది? అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
    పరీక్షిత్తు వారందరినీ చూస్తూ... సభాసదులారా! ఇంతకాం మీ అందరి సహకారంతో రాజ్యాన్ని ఓహో అన్నట్లు పరిపాలించాను. కానీ ఇప్పుడు కర్మవశున్నై మహామునిని అవమానించాను. నేను పాముకాటు నుండి తప్పించుకునే ప్రయత్నాు చేయను. మీరు ఎవరు చింతించకండి. నా పెద్దకొడుకు జనమేజయుడు బుద్ధిమంతుడు. ఈ రాజ్యం వాడికి అప్పగించి నేను గంగా తీరానికి పోయి ఈ ఏడు రోజు శ్రీహరి గురించి ధ్యానం చేస్తూ గడుపుతాను అని చెప్పాడు.         చెప్పినట్లుగానే వెంటనే జనమేజయునికి రాజ్యాన్ని అప్పగించాడు. సమస్త బంధానుంచి విముక్తుడయ్యాడు. గంగా నదీ తీరంలో ఉత్తర దిక్కుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు పరీక్షిత్తు. నిరాహార వ్రతం చేస్తూ గోవింద నామ సంకీర్తనతో ప్రొద్దు గడుపుతున్నాడు. ఆయనతోపాటు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి దేవర్షి గణాు ముని సంఘాు గోవింద నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు.
    ఇంతలో....
    చుక్కతెగి పడినట్లు పరీక్షిత్తు  అదృష్టం పండినట్లు శుకమహర్షి  అక్కడికి  విచ్చేసాడు.  ఆయన  వ్యాసుని కుమారుడు.  ఆజన్మ  విష్ణు భక్తుడు. యోగి. 20 ఏళ్ల వయస్సు గ  శుకమహర్షి  బ్రహ్మ తేజస్సుతో ధగధగలాడే పోతున్నాడు.
    మునుందరూ  శుకున్ని చూసి  లేచి నమస్కరించారు. పరీక్షిత్తు  పాదాభివందనం చేసి స్వాగతం పలికాడు. 
    మహాత్మా మీరాక మా భాగ్యం. మీ దర్శనం మా జన్మజన్మ  పాపాను  నాశనం చేయగదు. నాకు ముక్తి మార్గం ఉపదేశించండి. నా జీవితం  బహు స్వ్పం...  7 రోజు మాత్రమే అన్నాడు పరీక్షిత్తు.          శ్రీ శుకుడు చిరునవ్వుతో రాజును చూసాడు.
    రాజా! నీ కోరిక  సమంజసమైనది. శ్రీహరి కథు తప్ప  ముక్తిని ఇచ్చేవి మరొకటి లేవు.  ఆ కథు మా తండ్రి  వేదవ్యాసుడు  రచించి  నాచే చదివించిన  భాగవతంలో ఉన్నాయి. 
    భాగవత కథు వింటే చాు ముక్తి భిస్తుంది. సంసార జంజాటం దూరమవుతుంది. మనశ్శాంతి భిస్తుంది. భక్తి పెంపొందుతుంది. ఇహ పరలోకాలో  సౌఖ్యం  భించాంటే  భాగవతము చదవాలి. కాబట్టి భాగవత కథు చెప్తాను విను.  విని తరించు  అన్నాడు  శుకుడు.
విష్ణుభక్తి ప్రాశస్త్యం
    శుకుడు చెప్పడం ప్రారంభించాడు. మహారాజా విష్ణువు సర్వాత్మకుడు. సమస్త లోకాల్లో సమస్త ప్రాణు  ఆ దేవుని రూపాలే!   సృష్టికి కారకుడు. అతడే పరిపాకుడు. శ్రీహరి సర్వాంతరాత్మకుడు అని తపస్సు ద్వారా తొసుకున్న వారే ఋషు యోగు. వీరందరూ  విష్ణు భక్తు.
    విష్ణు భక్తి లేని వాడు మనిషే కాడు.  వాడి జ్ఞానం  పాండిత్యం నిష్ఫం. వాడి మానవజన్మ  వ్యర్ధం. వాసుదేవునియందు  భక్తి కవాడు  ప్రపంచంలో అగ్రగణ్యుడు. విష్ణుభక్తిని మించిన సంపదు కానీ  భోగభాగ్యాు కానీ వేరే లేవు.
    ఆ పరమాత్మ అవ్యక్తంగా అందరిలో ఉంటున్నప్పటికీ  సజ్జనుకు, సాధువుకి, భక్తుకి  హాని కుగుతున్నప్పుడు  వారిని రక్షించడానికి అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. దుష్టశిక్షణ శిక్ష రక్షణ  తన కర్తవ్యంగా  భావిస్తాడు శ్రీహరి.
    ఆ శ్రీహరి అవతారాలో  ముఖ్యమైనవి  వాటి విశేషాను  వర్ణిస్తాను శ్రద్ధగా విను...
మత్స్యావతారం
    ద్రవిడ దేశానికి రాజు సత్యవ్రతుడు. ఆయన మహా విష్ణుభక్తుడు.  ఆయన ప్రతిరోజు స్నానం చేసి శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు ఒకనాడు యథా ప్రకారంగా నదిలో స్నానంచేసి  విష్ణువుకు తర్పణం ఇవ్వడానికి దోసిలితో నీళ్లు తీశాడు. చిత్రం! ఆయన  దోసిళిలోనికి నీళ్లతోపాటు ఒకచిన్న చేపప్లి వచ్చింది. బంగారు రంగుతో మెరిసిపోతోంది ఆ చేపప్లి. సత్యవ్రతుడు దాన్ని చూసి  ముచ్చటపడి తన కమండంలో వేసుకొని తన కోటకు  తీసుకుపోయాడు.  త్లెవారింది.. ఆ చేపప్లి  కమండం  పట్టనంతగా  పెరిగిపోయింది. రాజు అయ్యో పాపం అనుకొని ఒక కుండలో  నీళ్లు పోసి  చేపను జాగ్రత్తగా  దాంట్లో ఉంచాడు. ఆ మర్నాటికి ఆ కుండ కూడా  చేపకు  సరిపోలేదు.  సత్యవ్రత మహారాజు  ఆశ్చర్యపోయాడు. ఇలా కాదు  దీన్ని  ఒక మడుగులో  వేచి చూద్దాం  అనుకొని చేపను పెద్ద మడుగులోకి చేర్చాడు. ఆ మడుగు సరిపోలేదు చేపకి. మహారాజు      ఆ పెద్ద చేపను వాహనాపై  మోయించి  సముద్రంలో  వదిలిపెట్టాడు.         మహారాజా! నువ్వు నన్నెంతో  భక్తిశ్రద్ధతో  సంరక్షించావు.  నాకు చాలా సంతోషంగా ఉంది. అని చేప అనగానే  సత్యవ్రతుడు  చేపకు నమస్కరించి దేవతా చక్రవర్తి! నువ్వు విష్ణువుడవు. లేకపోతే  చేప రోజు రోజుకూ ఇంత పెద్దదిగ ఎలా ఎదుగుతుంది?..  నా పుణ్యం పండిరది. నన్ను అనుగ్రహించడానికి  నీవు దయ చేశావు.  నేను ఏం చేయాలో చెప్పు... అన్నాడు.
    సత్యవ్రతా! నేటికి 7వ రోజున సృష్టి ముగిసి పోతుంది. ఆనాడు జ ప్రళయం వస్తుంది. ప్రపంచం అంతా జమయం అయిపోతుంది. ఒక పడవలో సప్తర్షు మాత్రం రక్షింపబడి ఉంటారు.  ఆ మహా నౌక మీ దగ్గరకి వస్తుంది. నువ్వు ఆ పడవ లోనికి ఎక్కు  రాబోయే కాంలో నువ్వు  మనువు అవుతావు. నువ్వు చెప్పిన  ధర్మ శాస్త్రం  ప్రకారమే  ప్రపంచం  నడుచుకుంటుంది. అందుకు ఇంకా సమయం ఉంది.
    శ్రీమహావిష్ణువు  మత్స్యరూపిగా ఇలా చెప్పి సముద్రంలోకి  ఈదుతూ వెళ్ళాడు.
    జప్రళయం  రానే వచ్చింది. లోకమంతా జమయం!   బ్రహ్మగారు వేదాను త కింద పెట్టుకొని నిద్రిస్తున్న సమయంలో సోమకుడు  అనే రాక్షసుడు  ఆ వేదాల్ని  దొంగిలించుకు పోయాడు.  మత్స్యరూపి అయిన శ్రీమహావిష్ణువు ఒక్క దెబ్బతో  ఆ సోమకాసురుని సంహరించి వేదాల్ని బ్రహ్మకు అప్పగించాడు.
    శ్రీమహావిష్ణువు చెప్పినట్లుగానే  సప్త ఋషుతో  నౌక వెళుతూ వచ్చింది. సత్యవ్రత మహారాజు ఆ పడవలోకి చేరాడు.
    సప్తర్షు సత్యవ్రతుడు మత్స్యరూపంలో ఉన్న శ్రీహరిని స్తుతించారు. సత్యవ్రతుడు ఆ తరువాత ఏడవ మనువుగా  నియమించబడ్డాడు. 
కూర్మావతారం
    దుర్వాస మహాముని  ఒకనాడు  స్వర్గంలో  గంగానదిలో స్నానం చేసి  ధ్యానం చేసుకుని బంగారు రంగులో మెరిసిపోతున్న  తామర పువ్వును కోశాడు. మహా సంతోషంతో దానిని తీసుకుని వచ్చి  ఐరావతం మీద ఊరేగుతున్న ఇంద్రునికి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు  దాన్ని ఐరావతానికి అందించగా  తామర పువ్వును కాలితో తొక్కి నలిపి వేసింది.
    దుర్వాసునికి  కోపం  కట్టు తెంచుకుంది. ఇంద్రునికి గర్వభంగం చేయవసిందే  అనుకున్నాడు.  దారికి అడ్డంగా నిబడి  కళ్లలో నిప్పులొుకుతున్నట్ల్లు  ఇంద్రుని చూస్తూ  ఒరేయ్‌! నీకింత కండకావరమా? ప్రేమతో నేను నీకు బహూకరించిన ఈ పువ్వును నలిపి పారేస్తావా.. నీ సంపదు  అన్నీ నశించు గాక! అని వేగంగా  అక్కడినుంచి వెళ్లిపోయాడు.
    ఇంద్రుడు ఖిన్నుడైపోయాడు. కళ్ళముందే ఇంద్రలోకం సంపదన్నీ పాసముద్రంలో మునిగిపోవడం జరుగుతోంది  క్పవ ృక్షాు  భాగ్య దేవతు  అన్ని స్వర్గాన్ని వదిలి పోతున్నాయి. స్వర్గలోకం  రాలిపోయిన పూ తోట మారిపోయింది. ఇంద్రుడు తన మేడ మీదికి  వెళ్లి చూడగా బలిచక్రవర్తి  సైన్యంతో దండయాత్రకు వచ్చిన  సంరంభం  కనబడిరది. బలిని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇంద్రుని వద్ద బము లేదు. బగమూ లేదు. బలితో మంచి మాటు మాట్లాడి  స్వర్గాన్ని అప్పగించేశాడు.
    బుషికి అపరాధం చేసి నందుకు ఇది తనకు శిక్ష అని అనుకున్నాడు.ఇంద్రుడు జరిగిన వృత్తాంతం  అంత బ్రహ్మకు  చెప్పుకున్నాడు. బ్రహ్మగారికి  ఏం చెయ్యాలో పాుపోలేదు.  బ్రహ్మ   ఇంద్రాది దేవతు  అందరూ కలిసి శ్రీమహావిష్ణువు దర్శించి  తమ గోడు చెప్పుకొన్నారు. 
    దేవాది దేవా!  దేవత పాట్లు  ఏమని చెప్పేది? చెట్టుకొకరు  పుట్టకొకరు అన్నట్లుంది. న్వి నీడలేదు. బలిచక్రవర్తి ప్రతాపం  ముందు నిబడలేక పోతున్నాము.
    మహావిష్ణువు గంభీరంగా పలికాడు.
    అంతా నాకు తొసు. పెద్దల్ని అవమానించడం వ్ల  స్వర్గానికే చేటు వచ్చింది. దుర్వాస మహాముని శాపం వ్ల  మొత్తం దేవతందరూ దురవస్థ పాయ్యారు. సరే జరిగిందేదో జరిగిపోయింది.. పా సముద్రాన్ని మథిస్తే  మళ్ళీ ఇంద్రున సంపదన్నీ  బయటికి వస్తాయి.  దానివ్ల  రాక్షసుల్ని  జయించే శక్తి వస్తుంది అమృతం భిస్తుంది.  పా సముద్రాన్ని  తరవాంటే  మనకిప్పుడు  రాక్షసు సాయం  చాలా అవసరం.  వారితో  స్నేహం నటించి అమ ృతం ఆశచూపి,  వారిని వశపరుచుకోండి. మందర పర్వతాన్ని  కవ్వంగా  సర్ప రాజైన వాసుకుని కవ్వపు త్రాడుగా ఉపయోగించుకోండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అని మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు.
క్షీరసముద్ర మథనం
    దేవతు పొయ్యి  రాక్షసుని కలిసి  అమృతం గొప్పదనాన్ని చెప్పారు. చావులేని అమృతం అన్న మాట వినగానే వాళ్లకి ఆశ కలిగింది.  సముద్రమధనానికి సరి అంటే సరే అన్నారు దేవదానవు. మందర పర్వతాన్ని  పెకిలించి  మోసుకు రాలేక  దేవతు రాక్షసు  శ్రీహరి ప్రార్ధించారు. శ్రీహరి  గరుత్మంతుని  మూపుపై మందర పర్వతాన్ని ఉంచి తెచ్చి పాసముద్రంలో వేయించాడు. పర్వతం సముద్రంలో మునిగిపోయింది. దాన్ని కింద పడి ఎందరో దేవదానవు  మరణించారు. అప్పుడు మహావిష్ణువు తాబేు రూపం ధరించి  ఆ పర్వతాన్ని  తన డిప్పపై మోసి కూర్మావతారుడయ్యాడు. పర్వతం  నిబడిరది. వాసుకుని కవ్వపు తాడుగా చేసి రాక్షసు, దేవతు చెరొక వైపు పట్టుకుని పా సముద్రాన్ని మధించడం మొదుపెట్టారు.         అలా చిుకుతూ చిుకుతూ ఉండగా పొగు కక్కుతూ  సెగు చిమ్ముతూ హాలాహం అనే పేరుగ విషం పుట్టింది. దాని వేడికి  లోకాలే త్లడ్లిుతున్నాయి.  దేవదానవు శివుని ప్రార్థించారు.  ఆ హాలాహలాన్ని  శివుడు  నేరేడు పండులా చేసి చేతిలోనికి తీసుకున్నాడు. పార్వతీదేవి స్వామీ దాన్ని మ్రింగి లోకాన్ని రక్షించండి అంది. ఆమెకు తన పతిjైున పరమశివుని శక్తిపై అంత నమ్మకం.  లోకాపై అంత కరుణ.
    శివుడు హాలాహలాన్ని మింగి దాన్ని తన గొంతులోనే ఉంచాడు.  మళ్లీ మధించడం  ప్రారంభమైంది. ఉచ్చైశ్రవం  అనే గుర్రం  ఐరావతం అనే ఏనుగు,  ఐదు క్పవ ృక్షాు  పాసముద్రం నుండి రాగా వాటిని ఇంద్రుడు తీసుకున్నాడు. ఇంకా తరవగా  చంద్రుడు  క్ష్మీదేవి వచ్చారు.  క్ష్మీదేవి  మహావిష్ణువును వరించింది. ఆ తరువాత ఒక దివ్యపురుషుడు  అమృత కశాన్ని  పట్టుకొని సముద్రం నుంచి వచ్చాడు.  రాక్షసు అమాంతం  ఆ కషాన్ని పట్టుకుని  పారిపోయారు.
    దేవతల్లో గగ్గోు మొదలైంది.
    ఇతరుల్ని  హింసించే స్వభావంగ  రాక్షసు చేతుల్లో  అమ ృతం  ఉండిపోయింది. వారు అమృతాన్ని పట్టుకొని దేవతకు చిక్కకుండా దూరంగా పారిపోతున్నారు.
జగన్మోహిని
    అలా పారిపోతున్న రాక్షసుకి ఒక దివ్య సౌందర్యంతో  అరారుతున్న జగన్మోహిని కనబడిరది. ఆమెను చూడగానే వాళ్లకి మతు పోయాయి. ఆమె నవ్వుతూ అకరించే సరికి మైమరిచిపోయి అమ ృత కశం ఆమె చేతుల్లో పెట్టేశారు.
    ఆ మెరుపు తీగ మీరు దేవతు సమానంగా కష్టపడ్డారు కనుక అమృతాన్ని మీకు న్యాయంగా పంచుతాను. మీరు దేవతు చెరోవైపు బంతు తీర్చి కూర్చోండి అంది.
    రాక్షసు, దేవతు రెండు వరుసుగా కూర్చున్నారు. మోహిని దేవతకు అమృతాన్ని పోస్తూ తన విలాసాతో, హొయతో  రాక్షసుల్ని మాయలో ముంచేసింది.
    వస్తున్నాను.. తొందరపడకండి... అని ఊరిస్తూ ఉందేకానీ తమ వైపుగా రావడం లేదేనని రాహువు అనే రాక్షసునికి అనుమానం వచ్చింది. వాడు దేవతలా మారి పోయి సూర్యుడు-చంద్రుడు మధ్య చడీచప్పుడు లేకుండా వచ్చి కూర్చున్నాడు. తొందరలో మోహని వాడి చేతులో ఇంత అమృతం పోసింది. పోసిందే తడవుగా అమృతాన్ని  త్రాగేశాడు. సూర్యచంద్రులిద్దరూ ఇది గమనించి  వీడు దేవత కాదు రాక్షసుడు అని సైగ చేశారు. మరుక్షణంలో సుదర్శన చక్రం వచ్చి  వాడి కంఠాన్ని  నరికేసింది.  అప్పటికే  వాడు  అమ ృతాన్ని  త్రాగి ఉన్నందున మరణించలేదు. త రాహువుగాను, కేతువు మొండెం గాను బతికే ఉన్నాయి.
    అమృతం పూర్తిగా దేవతకే పంచడం జరిగింది. జరిగిన మోసం రాక్షసు గ్రహించారు. గో చేశారు. గ్లొుమన్నారు దేవతపైకి యుద్ధానికి సిద్ధమయ్యారు.
    మోహిని విష్ణువుగా మారిపోయింది. రాక్షసుకి అమృతం  అందలేదు.  దైవ బం లేదు. యుద్ధంలో దేవతు చెరేగి పరాక్రమం చూపించారు. రాక్షసు చిత్తుగా ఓడిపోయి పలాయనం చిత్తగించారు         చంద్రుడు శివునికి శిరోభూషణంగా అయ్యాడు. ఆ పా సముద్రం తీరం పైన మహా వైభవంగా క్ష్మీనారాయణు వివాహం జరిగింది.
    రాహుకేతువు పగ చల్లారలేదు. ఇప్పటికీ సూర్య చంద్ర గ్రహణ రూపంలో వారి పైకి వచ్చి మింగుతున్నారు.
    శత్రుశేషం ఊరికి ఉండదు కదా!
    తనను నమ్ముకొన్న దేవతకు శ్రీహరి కూర్మావతారుడై మోహిని దేవి అమృతాన్ని పంచి మేు చేసాడు.
    అందుకే శ్రీ మహావిష్ణువుకి ఆర్తత్రాణ పరాయణుడు అన్న పేరు వచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి