మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ధర్మము దాని స్వరూపము


ధృఞ్‌ ధారణే అను ధాతువునకు ఉణాది ‘మన్‌’ ప్రత్యయము చేర్చినచో ధర్మ శబ్దమేర్పడును.
1.    ధ్రియతే సుఖప్రాప్తయే సేవ్యతే స ధర్మః పక్షపాతరహితో
    న్యాయః సత్యాచారో వా ॥ (ఉణాదివ్యాఖ్య 1-40)
ధర్మమనగా సుఖప్రాప్తికై సేవించునది, పక్షపాతరహితమైన న్యాయము, సత్యాచారము.
2. ధరతీతి ధర్మః. ధర్మమనగా ధారణచేయునది. ఈ విషయము మహాభారతము - నందొకచోట ఇట్లు చెప్పబడినది.
    ధారణాద్ధర్మ ఇత్యాహః ధర్మో ధారయతే ప్రజాః ।
    యత్‌స్యాద్ధారణసంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః ॥
ధారణ చేయుటవన - ధరించుట వన ధర్మమని పేరు. ధర్మము ప్రజను ధరిస్తుంది. నిశ్చయముగా దేనివన ధారణ కుగునో అదియే ధర్మము.
3. మనుష్యుడు తనకన్న ఉన్నతమైన పదార్థమునందు విశ్వాసముంచి దానిచే ప్రభావితుడయి చేయు క్రియాకలాపముకు ధర్మమని పేరు.
4.     ధృతిక్షమాదమో-స్తేయం శౌచమిన్ద్రియనిగ్రహః ।
    ధీర్విద్యాసత్యమక్రోధో దశకం ధర్మక్షణమ్‌ ॥ (మనుస్మృతి 6-92)
1. ధైర్యము 2. క్షమాగుణము 3. మనోనిగ్రహము 4. చౌర్యము చేయకుండుట 5. శుచి - పవిత్రత 6. జ్ఞానకర్మేంద్రియమును వశమందుంచుకొనుట 7. బుద్ధి 8. విద్యా 9. సత్యభాషణము 10. కోపము లేకపోవుట - ఈ పది ధర్మక్షణము.
5.     వేదః స్మృతిః సదాచారః స్వస్యచ ప్రియమాత్మనః ।
    ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాద్ధర్మస్య క్షణమ్‌ ॥ (మనుస్మృతి 2-12)
1. వేదము 2. స్మృతి - వేదానుకూ మనుస్మృత్యాది శాస్త్రము. 3. సదాచారము 4. తన ఆత్మ పవిత్రతకు ప్రియమైనవి. ఇవి ధర్మక్షణము.
6.     ఆర్షధర్మోపదేశం చ వేదశాస్త్రావిరోధినా ।
    యస్తర్కేణానుసంధత్తే న ధర్మ వేద నేతరః ॥ (మనుస్మృతి 12-106)
వేదశాస్త్రముకు విరుద్ధముగా లేని ఋషుయొక్క ధర్మోపదేశము, తర్కమునకు నిుచునది ధర్మము. లేనిచో ధర్మము కాదు.
7.     వేదప్రతిష్ఠితం కర్మ ధర్మ స్తన్మంగం పరమ్‌ ।
    ప్రతిసిద్ధక్రియాసాధ్యః స గుణో-ధర్మ ఉచ్యతే ॥
వేదవిహితమైన పరమశుభకరమైన కర్మయే ధర్మము. దానికి విపరీతమైనది అధర్మము.
8.     మనుష్యుడు వర్ణాశ్రమవ్యవస్థననుసరించి చేయదగు కర్తవ్యము కూడ ధర్మమే. ఇది యంయు మనుస్మృతిలో విస్తారముగ నున్నది.
9.     యతో-భ్యుదయ నిఃశ్రేయససిద్ధిః స ధర్మః ॥
                (వైశేషిక దర్శనము 1-1-2)
దేనివన ఇహలోకసుఖము పరలోకసుఖము - ముక్తి సిద్ధించునో అది ధర్మము. ఇది పదార్థవిద్య.
10.     అర్థకామేష్వసక్తానాం ధర్మజ్ఞానం విధీయతే ॥ (మనుస్మృతి 2-13)
అర్థము - నానా విధములైన ధనము మరియు స్త్రీ సేవనాదుయందు ఆసక్తు కానివారికి మాత్రమే ధర్మము తెలిసికొను కోరిక కుగును.
11.     ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః ।
    తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతో-వధీత్‌ ॥ (మనుస్మృతి 8-15)
మానవుడు ధర్మమును నశింపజేసినచో అది అతనినే నష్టము చేయును. దానిని రక్షించినచో అది అతనిని రక్షించును. కావున ధర్మము నశింపబడరాదు. అని ముమ్మారు చెప్పబడినది. ధర్మరక్షణ ధర్మాచరణయే మన కర్తవ్యము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి