మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

శాస్త్రముల మహత్యము


యోగిరాజగు శ్రీకృష్ణుడు శాస్త్రము యొక్క మహత్యమును గూర్చి అర్జునునితో ఈ విధముగ చెప్పినాడు.
1.     యః శాస్త్రవిధిముత్సృజ్యవర్తతే కామకారతః ।
        న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిమ్‌ ॥
2.    తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థిథౌ ।
    జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ॥ (భగవద్గీత 16-23, 24)
శాస్త్రవిధిని విడిచి తన ఇష్టానుసారముగ వర్తించువాడు తన కార్యమున సిద్ధిని పొందడు. ఇహలోక సుఖమును గాని పరమగతి - మోక్షమును గాని పొందడు.
కావున ఓ అర్జున కర్తవ్యాకర్తవ్య నిర్ణయవిషయమున నీకు శాస్త్రము పరమప్రమాణము. ఈ విషయము నెరిగి శాస్త్రమున చెప్పబడిన కర్మను ఇహలోకమున - ఈ శరీరమున చేయుము.
ఇచ్చట శ్రీకృష్ణుని గొప్పతనమును గూర్చి ఒకమాట చెప్పుట ఆవశ్యకమనిపించుచున్నది. ఒక సందర్భమున కురుపితామహుడైన భీష్ముడు యుధిష్ఠిరునితో ఇట్లు చెప్పినాడు.
వేదవేదాంగ తత్త్వజ్ఞం బంచాప్యధికం తథా ।
నృణాం లోకే హి కో-న్యో-స్తి విశిష్టః కేశవాదృతే ॥
        (మహాభారతము సభాపర్వము 38 అ.)
వేదవేదాంగవిజ్ఞాని అధికబుడైన శ్రీకృష్ణుని మించినవాడు ఈ నరులో ఇంకెవడున్నాడు. దీనివన శ్రీకృష్ణుడు ఆనాటి రాజులో మహాజ్ఞానిగా, గొప్పవ్యక్తిగా గుర్తింపబడియున్నాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి