మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

‘‘మనుర్భవ’

వేదబుషు భారతం భేదరహిత జీవితం
ఎవని శ్రమకు తగినఫం వాడె అనుభవించురా
దగాదోపిడీు లేని ధర్మం పాలించురా
శ్రమవిభాగరంగంరా వర్గాశ్రమసంగంరా
అందరమూ సుందరమూ ఆర్యభూమి భారతం
శరీరాంగ బంధురమూ శాంతి ధామ జీవితం
(వేద)

    నేటి సమస్త సమస్య పరిష్కారం వేదం. ఈ మాట చెవిటికి శంఖువు వంటిది - నేటి అవస్థ ఇట్టిది. అయినా ప్రయత్నించేవారుండనే ఉంటూరు. మహాభారతకాం (5000 సంవత్సరాకు పూర్వము) నాటికే వేదం తెలిసినవారు ఇద్దరో ముగ్గురో ! మరి నేడు?

    ఈ సాగరం ఈదజాకపోయినా - ఆకాశం అంతు దొరకక పోయినా, దానికి తవొగ్గవసినదే. వైదికసిద్దాంతస్వాధ్యాయం చేయవసిందే. లేనిచో - ఉతుకుడు కుక్క వాకం ఉండనే వుంది. మందు మింగదచక పండు బిర్రుగ మూసుకున్న ఈ సమాజానికి సూదిపొడుపు తప్పదు. ఎక్కితే ఎక్కుతుంది. కక్కితే  కక్కుతుంది. కూటికి కాటికి కుదురుండనే వుంది. కనుక - ఇంతదనుక చెప్పింది కునుకక - ఈ ‘వైదిక సిద్దాంత పరిచయం’ చదవండి. శ్రీ నాగభూషణంగారు స్వాధ్యాయంలో అనుభూతి పొందిన కొన్ని వేదమంత్రాు, మహర్షు ప్రోకాు తొగు రూపంలో ఇందు పొందుపరిచినారు. నెమరేయండి. ఇది క్లుప్తం - ఇది ఆప్తం. ఇది సూత్రం - ఇది పాత్రం. ఇది మంత్రం - ఇది స్వతంత్రం. ఇది సూటి - ఇది ధాటి, నీతోటి - నాతోటి. బుషు హృదయం ఋతంభరామయం.

   
    దేవుడు తొవని దేవులాట గుడ్డ్డెద్దు సేబడిన గుతుపాటు - వంటి బాట కారాదు.

    ‘‘మనుర్భవ’ - మానవుడవు కమ్ము - మానవార్థం తెలిసికొమ్ము. నడుమ మొలిసినకొమ్ము కోసుకొమ్ము. తుమ్ముపడిశముంపే లెమ్ము లేచే శక్తి ఉంపే రమ్ము, ఈ     చిక్కు విప్పుటకు ఈ భూగోళంలోని ఏ వాదం పనికిరాదు. వేదమొక్కటే పూర్ణం. ఈ పూర్ణమే సంపూర్ణ పరిష్కారం.

    కాదనువాడెవడున్నా కదనానికి రమ్మన్నా.
    శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్‌
    క్షత్రియాజ్ఞాతమేవం తు విద్యాద్‌ వైశ్యాత్‌ తధైవ చ 
(మనుస్మ ృతి)
అస్తు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి