మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ప్రకృతి


సత్‌    -    ఎ్లప్పుడుండునది
జడము    -    జ్ఞానము లేనిది.
వికారి    -    మార్పు చెందు స్వభావము కది.
    పరమాణువు సమూహము
స్థము నాక్రమించు స్వభావము కది.
దీనికి అవ్యక్తమని కూడ పేరు. అనగా ఇంద్రియము ద్వారా తెలియబడనిది అని అర్థము. ఇది అతి సూక్ష్మము. సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క సమావస్థ. ఈశ్వరుడు ప్రళయానంతరము సృష్టి చేయదచుకొన్నప్పుడు (ఈక్షించినపుడు) నిశ్శబ్దము, అంధకారబంధరమైన ప్రకృతిలో క్షోభ-గతి కలిగించును. అప్పటినుండి సృష్టి రచనాక్రమము ప్రారంభమగును.
కొందరు ఆస్తికు ప్రకృతి యనబడు పదార్థము లేదంటారు. దానిని ఈశ్వరుడు తన సామర్థ్యముచే పుట్టించునని వారి వాదము. ఈ ఆలోచనా సరళి వైదిక సిద్ధాంతమునకు విరుద్ధము. ఎందుకనగా
నావస్తునో వస్తుసిద్ధిః । (సాంఖ్యదర్శనము 1-88)
అవస్తునః R లేని వస్తువు నుండిÑ వస్తుసిద్ధిః R పదార్థము యొక్క పుట్టుకÑ న R జరుగదు.
భగవద్గీతలో కూడ ఈ సిద్ధాంతప్రతిపాదన కదు.
నాసతో విద్యేతే భావో నాభావో విద్యతే సతః ।
ఉపయోరపి దృష్టో-న్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః ॥ (భగవద్గీత 2-16)
అనగా లేని పదార్థమునకు పుట్టుక ఉండదు. ఉన్న పదార్థమునకు అభావము కుగదు. ఈ రెంటియొక్క సిద్ధాంతము తత్త్వజ్ఞానుచే తెలియబడినది.
అందుచే సృష్టికి ఉపాదానకారణమైన ప్రకృతి లేదనుట సత్యము కాదు.
ప్రకృతి యనబడు ఈ అతిసూక్ష్మ పదార్థముతో ఈశ్వరుడు సృష్టి రచన చేయును.
సత్త్వరజస్తమసాం సామ్యావస్థా ప్రకృతిః ప్రకృతేర్మహాన్‌
మహతో-హంకారః అహంకారాత్‌ పంచతన్మాత్రాణి ఉభయమిన్ద్రియమ్‌ ।
తన్మాత్రేభ్యః స్థూభూతాని పురుష ఇతి పంచవింశతిర్గణః ॥
                (సాంఖ్యదర్శనము 1-61)
సత్త్వరజస్తమోగుణము సమావస్థ ప్రకృతి (1) ప్రకృతి యందు ఈశ్వరుని ఈ క్షణమువన గతి కలిగి మహత్తు (1) అను పదార్థము పుట్టును.
ఈ మహత్తునుండి అహంకారము (1) పుట్టును. ఈ అహంకారము నుండి తన్మాత్రు (5), జ్ఞానేంద్రియము (5), కర్మేంద్రియము (5), మనస్సు (1) పుట్టును. తన్మాత్ర నుండి స్థూభూతము (5) పుట్టును. ఈ 24 ప్రాకృతిక పదార్థము. పురుషుడు అనగా చేతన తత్త్వము (జీవాత్మ, పరమాత్మ) 25వ పదార్థము. స్థూభూతము సంయోగము వన మనకు కనిపించు జగత్తు ఏర్పడుచున్నది.
మనుష్యునకు సృష్టిజ్ఞానము కుగుటకు జ్ఞానేంద్రియము ఉపయోగపడును. అవి
    ఘ్రాణరసనచక్షుస్త్వక్‌ శ్రోత్రాణీంద్రియాని భూతేభ్యః ।
            (న్యాయదర్శనము 1-1-12)
1. ముక్కు, 2. నాుక, 3. కన్ను, 4. చర్మము, 5. చెవు. ఈ ఐదు జ్ఞానేంద్రియము భూతమునుండి ఉత్పన్నమైనవి. ఆ భూతములేవన
    పృథివ్యాపస్తేజోవాయురాకాశమితి భూతాని ॥ (న్యాయదర్శనము 1-1-13)
1. పృథివి 2. జము 3. అగ్ని 4. వాయువు, 5. ఆకాశము. ఈ ఐదు భూతము వీటి గుణములేవన.
    గంధరసరూపస్పర్శశబ్దాః పృథివ్యాదిగుణాస్తదర్థాః ॥
(న్యాయదర్శనము 1-1-14)
1. గంధము, 2. రుచి, 3. రూపము, రంగు, 4. స్పర్శ, 5. శబ్దము. ఈ ఐదు పృథివి మొదగు భూతము గుణము మరియు ముక్కు మొదగు ఇంద్రియముకు అర్థము - విషయము.
అనగా (1) ‘గంధము’ పృథివిగుణము మరియు పృథివినుండి ఉత్పన్నమైన ముక్కునకు విషయము. (2) ‘రుచి’ జగుణము మరియు జమునుండి ఉత్పన్నమైన నాుకకు విషయము. (3) ‘రూపము - రంగు’ అగ్నిగుణము, అగ్ని నుండి పుట్టిన కన్నుకు విషయము. (4) ‘స్పర్శ’ వాయుగుణము. వాయువునుండి పుట్టిన చర్మమునకు విషయము. (5) ‘శబ్దము’ ఆకాశగుణము, ఆకాశము నుండి పుట్టిన చెవికి విషయము.
ఇంద్రియాదుగు ప్రాకృతికపదార్థము ఒకదానికన్న ఇంకొకటి సూక్షమము. ఆ క్రమమీవిధముగా ఉన్నది.
    ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః ।
    మనసశ్చ పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్‌ పరః ॥ (కఠోపనిషత్తు 3-10)
    మహతః పరమక్తవ్యమవ్యక్తాత్‌ పురుషః పరః ।
    పురుషాన్న పరం కించిత్‌ సా కాష్ఠా స పరాగతిః ॥ (కఠోపనిషత్తు 3-11)
నేత్రాది ఇంద్రియము కంటె (అర్థాః) శబ్దస్పర్శాది విషయము సూక్ష్మము. ఆ విషయము కన్న మనస్సు సూక్ష్మము, మనస్సు కన్న నిశ్చయాత్మకమగు వృత్తి బుద్ధి సూక్ష్మము. ఆ వృత్తి కంటె మహత్తత్త్వము సూక్ష్మము.
మహత్తత్త్వము కంటె ప్రకృతి సూక్ష్మము. ప్రకృతి కన్న పురుషుడు - జీవాత్మ, జీవాత్మ కన్న పరమాత్మ సూక్ష్మము. పరమాత్మ కన్న సూక్ష్మమేదియు లేదు. అదియే అంతిమము, పరమావధి. అంతకన్న సూక్ష్మమింకొకటి లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి