1. శరీరము, ధనము, సంపత్తి మొదగు అనిత్యపదార్థమును (ఎ్లప్పుడు ఉండనివి, నశించునవి) నిత్యపదార్థముగా (ఎ్లప్పుడు ఉండునవి, నాశము పొందనివి) భావించుట మరియు నిత్యములైన పరమాత్మ, జీవాత్మ, ప్రకృతును అనిత్యముని అనుకొనుట.
2. అశుచి, అపవిత్రత, అశుభ్రతను శుచి, పవిత్రత, శుభ్రతగా తెలిసికొనుట మరియు శుచిని అశుచిగా తెలిసికొనుట.
3. ఇంద్రియమును సంతృప్తిపరచు దుఃఖదాయకమైన విషయసేవనమును సుఖముగా తెలిసికొనుట మరియు సుఖమును దుఃఖముగా తెలిసికొనుట.
4. జడపదార్థములైన శరీరము, శిలు, లోహము మొదగు భోగ్యపదార్థమును చేతనముగా భావించుట మరియు చేతనములైన జీవాత్మపరమాత్మను జడపదార్థముగా తెలిసికొనుటను అవిద్య లేదా అజ్ఞానము అని అంటారు.
విద్య - జ్ఞాన క్షణము :
1. అనిత్యపదార్థమును అనిత్యముగా మరియు నిత్యపదార్థమును నిత్యముగా 2. అశుచిని అశుచిగా మరియు శుచిని శుచిగా 3. దుఃఖమును దుఃఖమనియు, సుఖమును సుఖమనియు, 4. జడమును జడముగా, చేతనమును చేతనముగా తెలిసికొని వాటితో అట్లే వ్యవహరించుటను విద్య - జ్ఞానము అని అంటారు.
ప్రపంచములో ఎవరును దుఃఖాన్ని ఇష్టపడరు. దుఃఖము వదనుకొనువారు దాని కారణమును దూరము చేసికొనుటకు ప్రయత్నిస్తారు. అట్టివారు దుఃఖరహితమైన శాశ్వత సుఖమును - ఆనందమును కోరుతారు. వారు ఆ ఆనందమును పొందుటకు కావసిన సాధనమును సాధించుటకు కూడ క్రియాశీురగుతారు. ఈ నాుగు పదార్థమును (1. దుఃఖము 2. దుఃఖ కారణము 3. సుఖము 4. సుఖ సాధనము) దార్శనిక భాషలో ప్రయోజనము - ఉద్దేశ్యము అని అంటారు. యోగదర్శనములో వీటని 1. హేయము. 2. హేయహేతువు. 3. హానము 4. హానోపాయము అని అంటారు.
హేయము :
హేయం దుఃఖమనాగతమ్ ॥ (యోగదర్శనము 2-16)
భవిష్యత్తులో రాబోవు దుఃఖము దూరము చేసికొనతగినది. భూతకాలిక దుఃఖము భోగము - అనుభవము వన నశిస్తుంది. వర్తమానమున కుగు దుఃఖము భోగింపబడుచు కొంతకాము తర్వాత నశిస్తుంది. మిగిలినది రాబోవు దుఃఖము. ఆ దుఃఖము రాకుండా చేసికొనవలెను.
హేయ హేతువు :
ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయ హేతుః ॥ (యోగదర్శనము 2-17)
ద్రష్టా R జీవుడుÑ దృశ్యము R ప్రకృతి (సమస్త భోగ్యపదార్థము). ఈ రెంటి యొక్క సంయోగము - బంధనము హేయమైన సాంసారిక దుఃఖమునకు హేతువు - కారణము.
తస్య హేతురవిద్యా ॥ (యోగదర్శనము 2-24)
జీవాత్మ ప్రకృతు సంయోగమునకు కారణము అవిద్య - అజ్ఞానము.
హానము :
తదభావాత్ సంయోగాభావో హానం తద్‌దృశేః కైవ్యమ్ ॥
(యోగదర్శనము 2-25)
అవిద్యనాశము వన కుగు జీవాత్మ ప్రకృతు సంయోగనాశమును హానము అని అంటారు. ఆ హానమే జ్ఞానస్వరూపుడైన పురుషుని (జీవాత్మ) యొక్క కైవ్యము - మోక్షము. అదే మానవుని ముఖ్య పురుషార్థము.
హానోపాయము :
వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః ॥ (యోగదర్శనము 2-26)
నిర్మమైన వివేకఖ్యాతి - ప్రకృతిపురుషత్యంతభిన్నును జ్ఞానము హానోపాయము - మోక్షమునకు ఉపాయము.
వివేకఖ్యాతి కుగుటకు అనుష్ఠించవసినది - ఆచరించవసినది ఏమనగా
యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః ॥
(యోగదర్శనము 2-28)
యోగాంగమును అనుష్ఠించుటచే అవిద్యjైున అశుద్ధి నశించి వివేకఖ్యాతి పర్యంతమైన జ్ఞానము ప్రకాశిస్తుంది.
యోగాంగమును సాధించిన కొది అశుద్ధి - అవిద్య నశిస్తుంది. అవిద్య నశించినకొది సమ్యక్ జ్ఞానము పెరుగుతుంది. కాబట్టి సాంగయోగానుష్ఠానమే వివేకఖ్యాతిని కలిగిస్తుంది. ఆ యోగాంగము లేవన.
యమనియమాసనప్రాణాయామప్రత్యాహారధారణా-
ధ్యానసమాధయో-ష్టావంగాని ॥ (యోగదర్శనము 2-29)
అనుష్ఠించవసిన యోగాంగము ఎనిమిది. అవి 1. యమము 2. నియమము 3. ఆసనము. 4. ప్రాణాయామము 5. ప్రత్యాహారము 6. ధారణా 7. ధ్యానము 8. సమాధి. వీటిని గురించి విశేషముగ తెలిసికొనుటకు యోగదర్శనమును చదువవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి