మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

చేతననిమిత్తకారణము :


ఇది ఉపాదానకారణమును కార్యరూపములోనికి మార్చునది. ఇది జ్ఞానవంతమైనది. అనగా ఉపాదానకారణమును కార్యముగా మార్చుటకు కావసిన జ్ఞానము కలిగినట్టిది. దీనిని కర్త అని కూడ అంటారు. ‘స్వతన్త్రఃకర్తా’ (1-4-54). ఇది పాణిని యొక్క వ్యాకరణసూత్రము. కర్తjైునవాడు ‘కర్తుమ్‌, అకర్తుమ్‌, అన్యథా కర్తుం సమర్థః’. (ఇచట ఒక విషయము గమనింపవలెను. ఈశ్వరునిలో కేవము కర్తృత్వము గదు. జీవునిలోనే ఈ మూడు గుణమున్నవి.) అనగా కర్త కార్యము చేయుటయందు స్వతంత్రుడు. కార్యము చేయుటను మానుకొనును లేదా విపరీతముగ గూడ చేయగడు. ఉదాహరణలో కుమ్మరి (కర్త) ఘటము చేయుటకై మృత్తికను సిద్ధముచేసికొని ఘటము చేయవచ్చును. లేదా మానుకొనవచ్చును లేదా విపరీత కార్యము చేయవచ్చును. అందుకతడు స్వతంత్రుడు, సమర్థుడు. కర్త కేవము నిర్మాతయే కాదు, దానినతడు రక్షించగడు, నాశము కూడ చేయగడు. అనగా కర్త నిర్మించుట, రక్షించుట, నశింపచేయుట అను మూడు పను చేయగడు.
కర్త ఉన్నచోటనే కార్యము ఏర్పడును. కర్తయొక్క గుణములైన కర్తృత్వము, జ్ఞానము మొదగునవి కార్యములో నుండవు.
ఉపాదానకారణము :
ఇది కార్యమేర్పడుటకు కావసిన ముడిపదార్థము. ఇది జడము - జ్ఞానము లేనిది.
కారణాభావాత్కార్యాభావః । (వైశేషిక దర్శనము 1-2-1)
అనగా ఉపాదాన కారణము లేనిచో కార్యమేర్పడదు. అంతే కాదు.
కారణగుణపూర్వకః కార్యగుణో దృష్టః । (వైశేషిక దర్శనము 2-1-24)
ఉపాదాన కారణములోని గుణము కార్యములో కనిపించును. ఉపాదాన కారణము కార్యరూపము లోనికి మారును. అపుడు కారణముండదు. కార్యము నశించినపుడు కార్యముండదు. అప్పుడు అది కారణరూపములో ఉండును.
న తు కార్యాభావాత్‌ కారణాభావః । (వైశేషిక దర్శనము 1-2-2)
కారణ భావాత్‌ కార్యభావః । (వైశేషిక దర్శనము 4-1-3)
కార్యము నశించినపుడు కారణముండదనుట సరిjైునది కాదు. కారణమున్నపుడు మాత్రమే కార్యమేర్పడును. ఉదాహరణలో ఉపాదాన కారణమైన మట్టి ఘటముగా ఏర్పడినపుడు కారణముండదు. ఘటమును ముక్కుగ, చూర్ణముగ చేసినపుడు అది కారణమైన మృత్తికగా మారి కార్యము (ఘటము) ఉండదు.
సాధారణ కారణము :
ఉపాదాన కారణమును కార్యముగా మార్చుటకు చేతన నిమిత్తకారణమునకు ఉపకరించు సాధనము, కాము, కార్యప్రయోజనము మున్నగునవి. ఉదాహరణలో కుమ్మరి కుండచేయుట కుపయోగించు చక్రదండాదు, అందుకు కావసిన కాము కుండ ప్రయోజనము మొదగునవి. ‘వినా ప్రయోజనం మందో-పి న ప్రవర్తతే’. ప్రపంచములో ప్రయోజనరహితమైన పనిని మూర్ఖుడు కూడ చేయడని లోకోక్తి. సాధారణ కారణము కార్యముకన్న భిన్నములే.
కేవము కుమ్మరిగాని, మృత్తిక గాని, చక్రదండాదు గాని ఘటమును చేయజావు. ఈ మూడు కారణమున్నపుడే కార్యమేర్పడును. ఇది నియమము - సిద్ధాంతము. ఇది కార్యకారణము సంబంధమున సంక్షిప్త వివరణ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి