వర్ణవ్యవస్థ:
వర్ణ శబ్దమునకు రంగు, వర్ణన, ప్రశంసా, అక్షరము, స్వీకారము అను అర్థమున్నవి. ప్రస్తుత విషయంలో వృఞ్ వరణే అను ధాత్వర్ధములో వాడబడినది. వృణోతీతి వర్ణః వరించునది - స్వీకరించునది వర్ణము. మానవు వారి గుణకర్మస్వభావము ననుసరించి - వారి యోగ్యత కనుకూముగా స్వీకరించునది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుని వర్ణము నాుగు.
వర్ణమునకు సంబంధించిన విషయము యజుర్వేదమందలి పురుషసూక్తమున భిస్తుంది. దీనిలో మనుష్య సమాజము అంకారికముగ ఇట్లు వర్ణించబడినది.
ఓం యత్పురుషం వ్యదధుః కతిధా వ్యక్పయన్ ।
ముఖం కిమస్యాసీత్కిం బాహూ కిమూరూ పాదా-ఉచ్యేతే ॥
(యజుర్వేదము 31-10)
ఏ పురుషుని వర్ణించిరో అతనినెన్నివిధము కల్పించిరి? అతనికి ముఖమేమి? బాహువులేమి? ఊరువులేవి? పాదములేవి? ఈ మంత్రములో అన్ని ప్రశ్నలే. వీటి సమాధానము తరువాత మంత్రములో నున్నవి.
ఓం బ్రాహ్మణో-స్య ముఖమాసీద్ బాహూ రాజన్యః కృతః ।
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాశూద్రో-అజాయత ॥
(యజుర్వేదము 31-11)
ఆ కల్పిత పురుషునకు బ్రాహ్మణుడు ముఖము వంటివాడు. క్షత్రియుడు బాహువు వంటివాడు. వైశ్యుడు ఊరువు వంటివాడు. శూద్రుడు పాదమువంటివాడు. ఈ బ్రాహ్మణాది పదము గుణవాచకము. ఇప్పుడు వ్యవహారములో నున్నట్లు జన్మతో ఏర్పడునవి కావు. మానవుందర ఒకే జాతి. పురుషాకారమును తొపు శరీరములో ముఖమునందు జ్ఞానేంద్రియమున్నవి. కావున జ్ఞానము ఎక్కువగానుండు వాడు, బుద్ధిబముచే జీవించువాడు బ్రాహ్మణుడనబడును. ఇతడు వేదాధ్యయనము చేసి పరమేశ్వరప్రాప్తికి నిరంతరము ప్రయత్నము చేస్తాడు.
క్షాత్రంవైవీర్యమ్. క్షాత్రమనగా వీర్యము, బపరాక్రమము ఎక్కువగా గవాడు క్షత్రియుడు. ఇతనిలో జాతిని, దేశమును రక్షించు గుణము ఎక్కువగా ఉండును. అందుచే అతడు బాహువుతో ప్చోబడినాడు. శరీరము నకపాయము కలిగినపుడు చేతు సహాయమున శరీరమును రక్షించుకొనుట అందరికి తెలిసిన విషయమే.
శరీరమును స్థిరముగా ఉంచుటకు ఊరువు తోడ్పడును. తొడ బముతో ఎక్కువ సమయము కూర్చుందుము. మానవజాతి పోషణ కవసరమగు పదార్థమును ప్రోగుచేసి జాతిని పోషించువాడు వైశ్యుడు. పాదము శరీరమును నిబెట్టుటకు ఉపయోగపడును. అట్లే జాతి నికడకు జాతి జవసత్వమును కాపాడుటకు ఉపయోగపడువాడు శూద్రుడు.
శరీరములోని ముఖము మొదగు అవయవము భిన్నమైన గుణము కలిగి శరీరస్థితికి అన్నివిధము తోడ్పడును. అదేవిధముగ మానవజాతి పోషణకు దాని మనుగడకు అవసరమైన గుణము గవారు తోడ్పడుదురు. అందుకు అవసరమైన గుణవిశేషము ఆధారముగ మనుష్యు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రపదముచే వ్యవహింపబడుదురు. వీరిలో ఒకరు ఎక్కువ అని కాని తక్కువ అని కాని ఎంచకూడదు. అందుకని వేదము -
అజ్యేష్ఠాసో అకనిష్టాస ఏతే సంభ్రాతరో వావృధుః సౌభగాయ ।
(ఋగ్వేదము 5-60-5)
మనుష్యులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తంచకుడు మీరందరు సోదయి. సౌభాగ్యమునకై వృద్ధిచెందుడు అని ఉపదేశిస్తుంది.
జన్మనా జాయతే శూద్రః సంస్కారాద్ద్విజ ఉచ్యతే. జన్మతో అందరు శూద్రులే. సంస్కారము - విద్యాజ్ఞానాదు వన మనుష్యుడు ద్విజుడగుతాడు. ద్విజునగా బ్రాహ్మణక్షత్రియవైశ్యు.
పూర్వకామున గురుకుమునందు విద్యార్థి విద్యనార్జించి స్నాతకుడగునాడు గురువుతని గుణ కర్మస్వభావము బాగుగ నెరిగి బ్రాహ్మణాది పదముచే వ్యవహించుటకు అధికారమొసంగెడివారు. బ్రాహ్మణ క్షత్రియాది పదము గుణవాచకము. జాతివాచకము కావు. జాతి నిత్యము బ్రతికియున్నంతకాము జాతి మారదు. వర్ణము మారుచుండును. బ్రాహ్మణవర్ణుడు క్రైస్తవాది మతమును స్వీకరించినపుడు అతడు బ్రాహ్మణపదవాచ్యుడు కాడు. ఇది లోకవిదితమే.
వేదాధ్యయనాదు వన ఈ శరీరము బ్రాహ్మణ శరీరమగునని మనుస్మృతిలో నున్నది.
స్వాధ్యాయేన వ్రతైర్హోమైస్త్రైవిద్యేనేజ్యయా సుతైః ।
మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుః ॥ (మనుస్మృతి 2-28)
అన్ని విద్యను చదువుట, చదివించుట, బహ్మచర్యసత్యభాషణాది నియమపాన, సత్యగ్రహణము, అసత్యత్యాగము, సత్యవిద్య దానము, అగ్నిహోత్రము, వేదమునందలి జ్ఞానకర్మోపాసన విద్య గ్రహణము, పక్షేష్టి మొదగువాటి అనుష్ఠానము, ధర్మపూర్వకముగ చక్కటి సంతానోత్పత్తి పంచమహాయజ్ఞము, అగ్నిష్టోమాది యజ్ఞము, శ్పివిద్య, విజ్ఞానాదుచే ఈ శరీరము బ్రాహ్మణశరీరమగును.
శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్ ।
క్షత్రియాజ్ఞాతమేవం తు విద్యాద్వైశ్యాత్తథైవ చ ॥ (మనుస్మృతి 10-65)
గుణకర్మ వన శూద్రుని సంతానము బ్రాహ్మణుడగును. అట్లే బ్రాహ్మణుని సంతానము శూద్రుడగును. అదేవిధముగ క్షత్రియ వైశ్యు సంతానము గుణకర్మ వన బ్రాహ్మణులో లేక శూద్రులో అగుదురు. అనగా ఏ వర్ణమువారి సంతానమైనను గుణకర్మ ననుసరించి ఇతర వర్ణము వారగుదురు.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణము కర్తవ్యము గుణకర్ము ఈ విధముగ నున్నవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి