మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

శరీరము


చేష్టేంద్రియార్థాశ్రయః శరీరమ్‌ । (న్యాయదర్శనము 1-1-11)
జీవుడు శరీరమునందుండి లోకమునందు వ్యవహరిస్తుంటాడు. ఈ శరీరము చేష్ట - క్రియ, ఇంద్రియము, అర్థముకు ఆశ్రయము.
ఇంద్రియము జీవునకు సాధనము. అవి జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము, అంతరింద్రియము అని మువ్విధము.
జ్ఞానేంద్రియము : 1. ముక్కు, 2. నాుక, 3. నేత్రము, 4. చర్మము, 5. చెవు. వీటిద్వార జీవునకు పాంచభౌతికమైన ప్రపంచ జ్ఞానము కుగును. ఒక్కొక్క ఇంద్రియము దానికి సంబంధించిన భూతముయొక్క గుణమును మాత్రమే గ్రహించును. ఇతరభూతము గుణము దానికి తెలియవు. ఇది నిర్దుష్టమైన నియమము. అభౌతిక పదార్థము జ్ఞానము జ్ఞానేంద్రియముకు కుగదు.
కర్మేంద్రియము : 1. ముఖము, 2. హస్తము, 3. పాదము, 4. పాయువు 5. ఉపస్థ. వీటితో జీవుడు కర్ము చేయును.
అంతరింద్రియము - మనస్సు  : జీవుడు దీని సహాయమున సంక్ప వికల్పాదు నొనర్చును. మనస్సు ఒక సమయమున ఒక ఇంద్రియముతో మాత్రము సంబంధము కలిగియుండును. అప్పుడు మనస్సు ద్వారా ఆ ఇంద్రియము గ్రహించిన జ్ఞానమును తెలిసికొనును. కర్మేంద్రియమైనచో తత్సంబంధమైన కార్యము చేయును. జీవుడు శరీరమునందుండి పాపపుణ్యకర్ము చేయుచు వాటి ఫమును అనుభవించుచుండును. ఈ విధముగ జీవునకు శరీరముతో సంబంధము కుగటను బంధనము అంటారు. జీవునకు శరీరముతో సంబంధము తొగిపోవుటను ముక్తి అంటారు. బంధనముగాని ముక్తి గాని జీవునకు స్వాభావిక గుణము కావు. అవి నైమిత్తికము.
బంధో విపర్యయాత్‌ । (సాంఖ్యదర్శనము 3-24)
విపర్యయము - అవిద్యా - అజ్ఞాననిమిత్తముగా జీవునకు బంధనము కుగును.
జ్ఞానాన్ముక్తిః । (సాంఖ్యదర్శనము 3-23)
జ్ఞాన - విద్యానిమిత్తముగ జీవునకు ముక్తి కుగును.
అజ్ఞానము వన ప్రకృతి (శరీరము)తో సంబంధమేర్పడును. ప్రకృతిలో దుఃఖము మాత్రమే కదు. శరీర సంబంధమున్నంతవరకు జీవునకు దుఃఖము తప్పదు.
జ్ఞానము వన పరమాత్మతో సంపర్కమేర్పడును. పరమాత్మతో ఆనందము, పూర్ణశాశ్వతసుఖము కదు. ముక్తజీవుడు పరమాత్మలోని ఆనందము ననుభవించును.
జ్ఞానము, అజ్ఞానము అనునవి రెండు విభిన్న వస్తువు కావు. అదేవిధముగ ప్రకాశము, అంధకారము కూడ వేరు వేరు వస్తువు కావు. జ్ఞానము యొక్క అభావము అజ్ఞానము. ప్రకాశము యొక్క అభావము అంధకారము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి