మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

సాయినామ స్మరణ

25. సాయినామమంత్రమెంతో
సాయినామ మంత్రమెంతో మధురమైనది
సాయి చరణ సన్నిధిలో మహిమ ఉన్నది

గురుదేవుని చూపులో కరుణ ఉన్నది
నా సాయిని చూడాని ఆశ ఉన్నది

సాయినామ స్మరణలో శాంతి ఉన్నది
ఆ శాంతికి చిహ్నముగా షిరిడి ఉన్నది

ఆదరించి సేదదీర్చు కరుణ ఉన్నది
ఆ కరుణే సాయి చెంత కురియుచున్నది

ఆప్తును ఆదుకొనే తావు ఉన్నది
ఆ తావే సాయినాథ చరణ సన్నిధి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి