మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ముక్తియందు జీవుని స్థితి

ముక్తి
‘ముచ్ఛ మోచనే’ అను ధాతువునకు ‘క్తిన్‌’ ప్రత్యయము చేర్చినచో ముక్తి శబ్దమేర్పడును. ముక్తి శబ్దమునకు విడిపోవుట అని అర్థము. మోక్షము, అపవర్గము, అమృతము, పరమపదము, అత్యంతపురుషార్థము, నిఃశ్రేయసము, కైవ్యము అనునవి పర్యాయపదము.
1.     దుఃఖజన్మప్రవృత్తిదోష మిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే
    దనంత రాపాయాదపవర్గః ॥ (న్యాయదర్శనము 1-1-2)
ఇంతక్రితము బంధనము విషయమున దుఃఖమునకు మూము మిథ్యాజ్ఞానమని తొపబడినది. ఈ మిథ్యాజ్ఞానము తొగి యథార్థజ్ఞానము కలిగినపుడు దోషము (రాగద్వేషము) నశించును. అప్పుడు ధర్మాధర్మప్రవృత్తి ఉండదు. ప్రవృత్తిలేనిచో జన్మ ఉండదు, జన్మయే లేనిచో దుఃఖముండదు. ఆ స్థితినే అపవర్గమంటారు.
2.     బాధనాక్షణం దుఃఖమ్‌ ॥ (న్యాయదర్శనము 1-1-21)
    తదత్యన్తవిమోక్షో-పవర్గః ॥ (న్యాయదర్శనము 1-1-22)
బాధ- పీడ క్షణముగా కది దుఃఖము. ఇది అధర్మము వన కుగుతుంది. శరీరాదు దుఃఖముతో కూడియున్నట్టివి. జీవునకు శరీరసంబంధము వన కుగు దుఃఖమునుండి పూర్ణవిముక్తిని అపవర్గమంటారు.
3.    తదభావే సంయోగాభావో-ప్రాదుర్భావాశ్చ మోక్షః ॥
                (వైశేషిక దర్శనము 5-2-18)
తదభావే R అజ్ఞాననాశము వన రాగద్వేషాది దోషము నశించును. ఆ దోషము లేనప్పుడు ప్రవృత్తి-అదృష్టము నశిస్తుంది. అందువన సంయోగాభావః R జీవాత్మకు మనస్సుతో, శరీరముతో సంబంధము నశిస్తుంది. అప్పుడు అప్రాదుర్భావాః చ R జన్మ వన కుగు దుఃఖము ఉండదు. ఈ స్థితినే మోక్షము అని అంటారు.

 జీవుని స్థితి

    సమాధిసుషుప్తిమోక్షేషు బ్రహ్మరూపితా ॥ (సాంఖ్యదర్శనము 5-116)
సమాధియందు, సుషుప్తి-గాఢనిద్రయందు, మోక్షమునందు జీవుడు పరమాత్మ సమానముగా బ్రహ్మానందము ననుభవిస్తాడు. సమాధి, సుషుప్తియందు బ్రహ్మానందము ననుభవించినప్పటికి జీవునిలో బంధనహేతువులైన క్లేశాది వాసను - సంస్కారము ఉండును. మోక్షమునందు బంధవాసను లేని పరమాత్మ సారుప్యముంటుంది. అతడు అనంత వ్యాపక బ్రహ్మమందు స్వచ్ఛందంగా సంచరించును. సమస్త లోక లోకాంతరములో సంచరించును. శుద్ధజ్ఞానముచే సమస్త సృష్టిని చూచును. ఇతర ముక్తపురుషుతో కలియును. నిర్ముడగుటచే పూర్ణజ్ఞాని అగును. అతనికి సర్వపదార్థము జ్ఞానము యథార్థముగ కుగును. ఈ సుఖవిశేషమే స్వర్గము - ముక్తి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి