మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

సత్యము, అసత్యము


సత్సు తాయతే తత్‌ సత్యమ్‌ ।
విద్యమాన - ఈ సృష్టిలో ఉన్న వస్తువులో వ్యాపకమై ఉన్న గుణము సత్యము.
సత్యం కస్మాత్‌? సత్సు తాయతే, సత్ప్రభవం భవతీతి వా ।
                    (నిరుక్తము 3-13)
సత్పురుషులో విస్తరించుటచేత, సత్పురుషునుండి ఉద్భవించుట వన సత్యమనబడుచున్నది.
యత్‌ యథావత్‌ తత్త్వపదార్థం తత్‌ సత్యమ్‌ ।
ఏ వస్తువు ఎట్లుండునో దానినట్లే చెప్పుట సత్యము. పదార్థము-వస్తువు ఏ విధముగా ఉంటుందో దానిని అట్లే తెలిసికొనుట, దానిని అదేమాదిరిగా ఒప్పుకొనుట, ఇతరుకు దానిని గురించి అదేవిధముగా చెప్పుట, ఆ వస్తువుతో అలాగే వ్యవహరించుట, దాని ద్వారా పూర్ణలాభమును పొందుటను సత్యము అందురు. దానికి విపరీతమైనది అసత్యము.
సత్యము: సరళము, వస్తుస్థితికి అనుకూము. సత్యము గ చోట ఉత్సాహము, నిర్భయము ఉంటుంది. ఇది వజ్రము కన్న కఠినము. పుష్పము కంటె మృదువు. అభ్యాసము లేకపోవుటవన సామర్థ్యము లేకపోవుటవన సత్యభాషణము కఠినమనిపించును. నిజానికి సత్యమును సాధారణవ్యక్తియు, విద్వాంసుడును సుభముగ చెప్పగడు.
అసత్యము: వక్రము, వస్తుస్థితికి ప్రతికూము. అసత్యముగ చోట జ్జా, భయము ఉండును. అసత్యమును అతితెలివిపయి మాత్రమే చెప్పగరు. అసత్యభాషణమువన కష్టప్రాప్తియు కుగును.
న హి సత్యాత్పరో ధర్మో నానృతాత్‌ పాతకం పరమ్‌ ।
న హి సత్యాత్పరం జ్ఞానం తస్మాత్సత్యం సమాచరేత్‌ ॥
సత్యము కన్న ధర్మము అసత్యమునకు మించిన పాపములేదు. సత్యమును మించిన జ్ఞానములేదు. అనగా సత్యమే జ్ఞానము. కావున సత్యమునే ఆచరించుము.
నాస్తి సత్యవతామప్రాప్యమ్‌ ॥ (చాణక్య నీతి సూత్రము)
సత్యవంతుకు భించనిది లేదు.
సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌ ॥ (యోగదర్శనము 2-36)
సత్యము సిద్ధించినవాని వాక్కు అమోఘము. అనగా అతని వచనము వ్యర్థము కాదు. అతడు యోగ్యతగ వానిని ‘ధార్మికుడవు కమ్ము’ అని ఆశీర్వదించినచో అతడు ధార్మికుడగును. ‘సుఖీభవ’ అని ఆశీర్వదించినచో అతని దుఃఖము దూరమగును.
సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌ న బ్రూయాత్‌ సత్యమప్రియమ్‌ ।
ప్రియం చ నానృతం బ్రూయాత్‌ ఏష ధర్మః సనాతనః ॥
                    (మనుస్మృతి 4-138)
సత్యమునే చెప్పుము. ఆ సత్యమును ప్రియమైన మాటలో చెప్పుము. కఠినవచనముతో మనస్సును బాధించునట్లు చెప్పకుము. మరియు ప్రియమైన మాటతో అసత్యమును మాత్రము చెప్పకుము. ఇదియే అతి ప్రాచీన ధర్మము.
ఇది ఎట్లన మన మధ్య ఒక వ్యక్తి అంధుడై ఉన్నచో అతడా మాట అంగీకరించును. ఈ మాట సత్యము. మనమాతనిని మాటిమాటికి అంధుడని అనినచో అతని మనస్సుకు బాధ కుగును. దీనినే అప్రియసత్యము అందురు. దీనిని చెప్పుట యోగ్యము కాదు.
మనము లోకములో స్తుతి, నిందా అను శబ్దము వినుచున్నాము. ఆ శబ్దమును చాలావరకు తప్పు అర్థములో ప్రయోగిస్తారు. వీటి సరిjైున అర్థము ఇట్లున్నది.
పదార్థ గుణ సంకీర్తనం స్తుతిః ॥
పదార్థము యొక్క గుణమును చెప్పుటను స్తుతి అంటారు.
గుణేషు గుణారోపణం స్తుతిః । దోషేషు దోషారోపణం చ స్తుతిః ॥
పదార్థములో ఉన్న గుణమును ఉన్నవని చెప్పుటను మరియు లేని గుణమును లేవని చెప్పుటను స్తుతి అంటారు.
గుణేషు దోషారోపణమసూయా । దోషేషు గుణారోపణమప్యసూయా ॥
ఇక్కడ ‘అసూయా’ అనగా నిందా అని అర్థము. పదార్థములో ఉన్న గుణమును లేవనుటను మరియు లేని గుణము ఉన్నవనుటను నిందా అని అంటారు.
అనగా సత్యమును చెప్పుటను స్తుతి యనియు అసత్యమును చెప్పుటను నిందా అనియు చెప్పవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి