మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ధ్రువోపాఖ్యానం

ధ్రువోపాఖ్యానం
    ఉత్తానపాదుడు ఒక చక్రవర్తి ఆయనకు ఇద్దరు భార్యు సునీత పెద్దభార్య. చిన్న భార్య పేరు సురుచి. సునీత కొడుకు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. ఉత్తానపాదునికి రెండో భార్య అయిన సురుచి అంటే వ్లమాలిన ప్రేమ. ఎప్పుడూ ఆమె ఇంట్లోనే ఉండేవాడు. సునీతి ఈ అవమానాన్ని మౌనంగా భరిస్తూ ఉండేది.
    ఇలా ఉండగా ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి ఇంట్లో కుమారుడైన ఉత్తమున్ని తొడపై కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఐదేళ్ల ద్రువుడు అక్కడికి వచ్చి ‘నాన్నా! నేను నీ ఒళ్లో కూర్చుంటా’ అన్నాడు. అక్కడే ఉన్న సురుచి ‘ఒరేయ్‌ మీ నాన్న నాన్న ఒళ్లో కూర్చోవానుకుంటే నువ్వు నా కడుపున పుట్ట వసింది. ఇప్పుడు నీకు అర్హత లేదు. మ్లె దేవుడికి మొక్కు అంటూ కసిరికొట్టింది. తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా ఉండిపోయాడు.         అవమాన భారంతో ధ్రువుడు ఇంటికి వచ్చాడు. ఉక్రోషం, ఏడుపు వచ్చేశాయి. జరిగిన సంగతి సునీతికి చెప్పి భోరుమన్నాడు. ధ్రువున్ని దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ‘అవును నాయనా! మీ పినతల్లి పుకుల్లో ఏమీ అసత్యం లేదు. నేను పేరుకి పెద్దభార్యనయినా ఒక దాసీ గానే బతుకుతున్నాను. నా పాు తాగిన కర్మానికి నీకు కూడా మివ గౌరవం పోయాయి. అయినా ఒక మాట చెప్తాను విను. మనం ఎప్పుడూ ఎవరిపైన ద్వేషభారం పెంచుకోకూడదు. నీకు తండ్రి వద్ద  గౌరవం, మన్నన భించాంటే పోయి శ్రీమహావిష్ణువును ధ్యానించు అంటూ కొడుక్కి హితబోధ చేసింది. దిక్కులేనివారికి దేవుడే దిక్కు కదా మరి!
    ధ్రువుడు పట్టుదతో తపస్సు చేయడానికి అడవికి బయుదేరాడు. మధ్యలో నారదుడు కన్పించి ధ్రువున్ని మెచ్చుకొని ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే 12 అక్షరా మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని జపిస్తే నీ కోరికు అన్ని తీరుతాయి అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఒకప్పుడు విష్ణువు నడయాడిన పవిత్రమైన మధువనానికి వెళ్లి అక్కడ తపస్సు చేసాడు ధ ృవుడు. ఏమి తపస్సు! లోకాు బ్రహ్మాండాు వేడెక్కి త్లడిల్లిపోయే తపస్సు చేసాడు. ఒంటి కాు పైన నిబడి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని దుష్కరమైన వ్రతాన్ని ఆచరించాడు ధ్రువుడు.
    బ్రహ్మాది దేవతు శ్రీమహావిష్ణువు వద్దకు పోయి ధ్రువునికి వరమిచ్చి లోకాను కాపాడమని మొరపెట్టుకున్నారు. విష్ణువు దేవతను పంపించి, మధువనానికి వెళ్లి ప్రత్యక్షమయ్యాడు. ఆబా తపసిని చూస్తే ముచ్చట వేసింది. తన చేతి శంఖంతో  ధ్రువున్ని తట్టి లేపి, అబ్బాయి! ధ్రువా ఈ నాటి నుండి నీ పేరు చిరస్థాయిగా ఉండేట్లు నీకు సప్తఋషు పక్కన చోటు కల్పిస్తున్నాను. నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు విష్ణులోక నివాసాన్ని ప్రసాదించు అన్నాడు ధ్రువుడు. మహావిష్ణువు ధ్రువుని మరింతగా ముద్దుచేసి ‘నాయనా! అవన్నీ నీకు తర్వాత భిస్తాయి. ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్లి హాయిగా రాజ్యపాన చేసి సుఖంగా ఉండు’ అంటూ ఎన్నో యోగసాధనా రహస్యాు ఉపదేశించాడు.
    ధ్రువుడు ఇంటికి వచ్చి తల్లికీ తండ్రికీ మ్రొక్కాడు. తన పినతల్లి కొడుకనుకోకుండా ప్రేమతో చూశాడు. విష్ణుభక్తు ఎవరినీ  ద్వేషించరు.  ధ్రువుడు విష్ణు భక్తులో ఎన్నదగినవాడై గొప్ప పరిపాకుడై  పేరుపొందాడు.

1 కామెంట్‌: