మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

వేదాది ఆర్షగ్రంథములు


వేదము స్వతః ప్రమాణము. అనగా వేదములో చెప్పబడిన విషయము ప్రామాణికతను గూర్చి ఆలోచించుటకు ఇతర ప్రమాణముతో పనిలేదు. యథా ప్రదీపవత్‌, అనగా మనము సూర్యుని చూచుటకు వేరే ప్రకాశమక్కరలేదు. సూర్యుని ప్రకాశమే సూర్యుని చూచుటకు ఉపయోగపడును. అంతేకాదు. ఆ ప్రకాశము వననే ఇతర వస్తువును చూడగము. వేదము కూడ ఇదేవిధముగ స్వతః ప్రమాణమై ఇతర గ్రంథము ప్రామాణికతను నిర్ణయిస్తుంది.
విద జ్ఞానే అను ధాతువునుండి వేదశబ్దమేర్పడును. వేదమనగా జ్ఞానమని అర్థము. మానవుకు ఆ జ్ఞానము సృష్ట్యాదిలోనే భించవలెను. కారణమేమన -
ఇప్పుడు ప్రపంచములోని కొన్ని దేశాు వైజ్ఞానికరంగములో ఎంతో ప్రగతిని సాధించాయి. ఈ దేశాలోని అడవులో నివసించువారు ఈనాటికి అజ్ఞానుగానే ఉన్నారు. మనము పాఠశాలో, కళాశాలో విద్యాభ్యాసము చేసిన తరువాతనే విద్యావంతుము, జ్ఞానుము అగుచున్నాము. ఇప్పుడు జన్మించిన బాురను ఏకాంత ప్రదేశములోనో, మూర్ఖుసాంగత్యములోనో ఉంచినచో వారు పెరిగి మూర్ఖులే అగుదురు. సృష్టి ఆదిలో భగవంతుడు వేదవిద్యను మానవుకు ఇవ్వనిచో, వారు ఆ విద్యను ఇతరుకు నేర్పకపోయినచో మనము అజ్ఞానుగానే ఉండెడివారము. ఆర్యావర్తమునుండి విద్వాంసు ఈజిప్టు, గ్రీసు, యూరోపు మొదగు దేశాలోని ప్రజకు విద్యనేర్పక పూర్వము అక్కడివారు విద్యావిహీనులై ఉండిరి. యూరోపు నుండి కొంబసు మొదగువారు అమెరికాకు వెళ్ళకపూర్వము అక్కడివారు అజ్ఞానుగానే ఉండిరి. ఆఫ్రికాలోని నీగ్రోు అమెరికాతో సంబంధము కలిగిన తరువాతనే విద్యావంతులైనారు. దీనివన మనుష్యుడు నైమిత్తిక జ్ఞానము లేకుండా విద్యావంతుడు జ్ఞానవంతుడు కాలేడు. జ్ఞానోన్నతిని పొందడు అని నిర్థారణ యగుచున్నది. కన్నుకు సూర్యుని ప్రకాశమునకు సంబంధము ఉన్నది. ఈ రెంటిలో ఏ ఒకటి లేకపోయినను రెండవది నిరర్ధకము. అటునే బుద్ధికి జ్ఞానమునకు సంబంధము ఉన్నది. జ్ఞానములేనిచో బుద్ధి నిరర్థకము. అందుకే మానవుని బుద్ధియొక్క సార్థకత కొరకు జ్ఞానము - వేదము అవసరము.
సృష్టి ఆదిలో సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మానవుకు అవసరమైన నైమిత్తిక జ్ఞానమును వేదముద్వారా అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరా అను యోగ్యులైన నుగురు ఋషు మస్తిష్కములో ప్రకాశింపజేసినాడు. వారి ద్వారా వేదము లోకమున ప్రచారము గావింపబడినది. అందుకే భగవంతుడు ఆదిగురువు.
స పూర్వేషామపి గురుఃకాలేనానవచ్ఛేదాత్‌. (యోగదర్శనము 1-26).
కాముచే ఛేదింపబడనివాడు - త్రికాములో నుండువాడు అయిన పరమేశ్వరుడు సృష్టి ఆదిలోనున్న మన పూర్వుకు గురువు.
వేదము ఈశ్వరీయ జ్ఞానమని ఆర్షసాహిత్యము స్పష్టముగ తెలియజేయుచున్నది. అలాగే మహమ్మదీయు కురాన్‌ షరీఫ్‌ను క్రైస్తవు బైబిల్‌ను ఈశ్వరీయ జ్ఞానమని ప్రచారము చేయుచున్నారు. శ్రోతకు నిజముగా ఈశ్వరీయ జ్ఞానమేది? అను సందేహము కుగును. అందుచే ఈశ్వరీయ జ్ఞానమేదియో నిర్ణయించవయును. లేనిచో మానవు సందేహమునకు గురిjైు సత్యమును తెలిసికొనక అసత్యమార్గము ననుసరించి దుఃఖము ననుభవింతురు. జీవిత క్ష్యమును పొందరు. ఈశ్వరీయజ్ఞానమును నిర్ణయించుటకు ఈ క్రింది హేతువు ఉపయోగపడును.
1.    ఈశ్వరీయజ్ఞానము సృష్టికి ఆరంభమున ప్రకాశింపజేయబడవలెను. లేకున్న ఈశ్వరుడు పక్షపాతి యగును.
2.    ఈశ్వరీయజ్ఞానము ఒకానొక దేశమునకు సంబంధించిన భాషలో ప్రసాదింపబడరాదు.
3.    ఈశ్వరీయజ్ఞానము సృష్టినియమముకు విరుద్ధముగ ఉండకూడదు.
4.    ఈశ్వరీయజ్ఞానమునందు సమస్త సత్యవిద్య మూసిద్ధాంతము ఉండవలెను.
ఈ హేతువుకు బైబిల్‌, కురాన్‌ు నిువలేవు. వేదములే ఈశ్వరీయముని నిర్థారణ యగును. ఈశ్వరుని రచను రెండు.
1.     దృశ్యకావ్యము - జగత్తు. 2. శబ్దకావ్యము - వేదము. ఈ రెండిరటియందు సమన్వయము కదు. అందుకే వేదము స్వతః ప్రమాణము.
ఋషు యోగమువన సమాధిస్థులై వేదమంత్రమును సాక్షాత్కారము చేసికొని - యథార్థముగ తెలిసికొని ఇతర గ్రంథమును - శాస్త్రమును ఉపదేశించినారు. అందుకే అవి పరతః ప్రమాణము. అనగా వాటిలో వేదానుకూమైనదే గ్రాహ్యము.
స్వతఃప్రమాణము :-
ఋషిణా ద్రష్టమార్షమ్‌. ఋషుచే దర్శించబడినవి ఆర్షము. అవి మూ వేదసంహితు.
1. వేదము - సంహితు (నాుగు) :
1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అథర్వవేదము.
పరతః ప్రమాణము :-
ఋషిణా ప్రోక్తమార్షమ్‌. ఋషుచే ఉపదేశింపబడినవి. ఇవి వేద ప్రామాణ్యము నంగీకరించునవి.
2. వేదాంగము (ఆరు) :
1. శిక్షా    -    పాణిని మహర్షి ‘వర్ణోచ్ఛారణశిక్షా’.
2. క్పము    -    శ్రౌతసూత్రము (యజ్ఞసంబంధమైనవి), గృహ్యసూత్రము (సంస్కారముకు సంబంధించినవి), ధర్మ సూత్రము (వర్ణాశ్రమ వ్యవస్థననుసరించి మానవుని కర్తవ్యమును బోధించునవి).
3. వ్యాకరణము    -    పాణినిమహర్షికృత అష్టాధ్యాయీ సూత్రపాఠము, ధాతుపాఠము, ఉణాది కోశము, గణపాఠము, లింగాను శాసనము. వీటిని ఉపదేశముని అంటారు.
4.  నిరుక్తము    -    యాస్కమునికృత నిఘంటువు, నిరుక్తము.
5.  ఛన్దస్సు    -    పింగళాచార్యముని కృతము.
6.  జ్యోతిషము    -    వశిష్టఋషికృతము. దీనియందు అంక గణితము, బీజగణితము, రేఖా గణితము, భూగోళము, భూగర్భము, ఖగోళవిషయము గవు.
జ్యోతిః అనగా ప్రకాశవంతమైన పదార్థము. వాటికి సంబంధించినది జ్యోతిషము. గ్రహము (సౌరకుటుంబము) నక్షత్రము యొక్క స్థితిగతును తొపును. స్థితివన కాజ్ఞానము, గతివన ఋతు జ్ఞానము కుగును.
మానవ శరీరమునకు గ అంగముతో వేదమునకు వేదాంగమును అంకారికముగా పోల్చి ఇట్లు చెప్పినారు.
1.     చన్దః పాదౌతు వేదస్య హస్తో కల్పో-థ పఠ్యతే ।
    జ్యోతిషాం అయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే ॥
2.     శిక్షా ఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతమ్‌ ।
    తస్మాత్సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే ॥
ఛందస్సు    -        పాదము
క్పము    -        చేతు
జ్యోతిషము    -        కన్ను
నిరుక్తము    -        చెవు
శిక్షా    -        ముక్కు
వ్యాకరణము    -        ముఖము
వేదమును వేదాంగము యుక్తముగ చదువుకొన్నవాడు విద్వాంసులో పూజనీయుడగును.
మనుష్యుడు తన అభిప్రాయమును-భావమును ముఖము ద్వారా ఇతరుకు తెలియజేస్తాడు. అదేవిధముగ వేదముయొక్క అభిప్రాయమును-అర్థమును స్పష్టము చేయునది వ్యాకరణము. అందుకే  వ్యాకరణము ముఖముతో ప్చోబడినది. వ్యాకరణమును సంపూర్ణముగా అధ్యయనము చేయని వ్యక్తికి వేదము బోధపడదు. వేదాంగము ఉద్దేశ్యము వేదమంత్రమును సరిగా అర్థము చేయుటయే.
3. ఉపాంగము (ఆరు)
వీటిని దర్శనము లేక శాస్త్రము అని కూడ అంటారు.
1. న్యాయ దర్శనము        -    గౌతమఋషి కృతము
                వాత్సాయన భాష్యము
2. వైశేషిక దర్శనము        -    కణాదఋషి కృతము
                ప్రశస్తపాద భాష్యము
3. సాంఖ్యదర్శనము         -     కపిఋషి కృతము
                బాగురుముని భాష్యము (అభ్యము)
                విజ్ఞాన భిక్షు భాష్యము (భ్యము)
4. యోగ దర్శనము         -     పతంజలిఋషి కృతము
                వ్యాసభాష్యము
5.     మీమాంసా దర్శనము     -     జైమినిఋషి కృతము
                వ్యాసభాష్యము (అభ్యము)
                శాభరభాష్యము (భ్యము)
6.     వేదాంత దర్శనము     -     వ్యాసమహర్షి కృతము
                బౌధాయనవృత్తి (అభ్యము)
                శాంకరభాష్యము (భ్యము)
సాంఖ్య, మీమాంస, వేదాంతదర్శనముకు సంబంధించిన ప్రస్తుతము భించు భాష్యములో సూత్రకారు అభిప్రాయమునకు భిన్నమైన భాష్యకారు అభిప్రాయము అప్రామాణికమని తెలియవలెను.
4.     ఉపవేదము (నాుగు)
1. ఆయుర్వేదము    -    చరకము, శుశ్రుతము, ధన్వంతరికృత నిఘంటువు.
2. ధనుర్వేదము    -    శస్త్రాస్త్ర సంబంధమగు రాజవిద్య. అంగిరసుడు, భరద్వాజుడు వ్రాసినవి పూర్వముండెడివి. ఇప్పుడు ుప్తము.
3. గాంధర్వవేదము    -    గానవిద్య, సామగానము, నారద సంహిత.
4. అర్థవేదము    -    శ్పివిద్య (జుఅస్త్రఱఅవవతీఱఅస్త్ర డ ్‌వషష్ట్రఅశీశ్రీశీస్త్రవ), విశ్వకర్మ, త్వష్ట, దేవజ్ఞుడు మయుడు వ్రాసిన సంహితు. (భరద్వాజుని విమానశాస్త్రము కొంతకాము క్రితము భించినది. ఇది ‘యంత్ర సర్వస్వము’ అను గ్రంథములో ఒక భాగము).
5.     బ్రాహ్మణ గ్రంథము (నాుగు)
వేదమునకు బ్రహ్మ అని కూడ పేరు. బ్రహ్మయొక్క వ్యాఖ్యానము బ్రాహ్మణము. వీటిలో అనేక విషయముతో పాటు యాజ్ఞిక ప్రక్రియకు ప్రాధాన్యత కదు.
1. ఐతరేయము, 2. శతపథము, 3. సామవిధానము - తాండ్యబ్రాహ్మణము, 4. గోపథము.
6.     ఉపనిషత్తు (పదకొండు)
వీటిలో అధ్యాత్మ (పరమాత్మ, జీవాత్మ, శరీరము) విద్య ఉన్నది. సాధారణముగ బ్రహ్మవిద్య అని అంటారు. ఉపనిషత్తు అను పేరుతో 108 గ్రంథము ఉన్నాయి. వాటిలో అల్లా - ఉపనిషత్తు కూడ ఒకటి. వాటన్నింటిలో ఈ క్రింది 11 మాత్రమే వేదానుకూముగ నున్నవని శిష్టు - విద్వాంసు అభిప్రాయము.
1. ఈశ, 2. కేన, 3. కఠ, 4. ప్రశ్న, 5. ముండక, 6. మాండూక్య, 7. ఐతరేయ, 8. తైత్తిరీయ, 9. ఛాందోగ్య, 10. బృహదారణ్యక, 11. శ్వేతాశ్వతర.
వీటిలో మొదటిదిjైున ఈశోపనిషత్తు యజుర్వేదము యొక్క చివరి (40వ) అధ్యాయము. తక్కినవి ఋషి ప్రోక్తము.
7. వేదశాఖు - 1127
8. ఇతిహాస గ్రంథము
వాల్మీకిరామాయణము, మహాభారతము. వీటిలో చాలా ప్రక్షిప్తము - ఇతరుచే చేర్చబడినవి ఉన్నవి. ఆ విషయము అప్రామాణ్యము.
9. స్మృతు
మనుస్మృతి, యాజ్ఞవ్క్య స్మృతి, పారాశరస్మృతి మొదగునవి. వీటన్నింటిలో మనుస్మృతి ప్రక్షిప్తమును వదలి, ప్రామాణికముగ గ్రహించబడును.
    చతుర్దశ విద్యు
    వేదము, బ్రాహ్మణ గ్రంథము.
    ఉపనిషత్తుతో కలిసి                -    4
    ఉపవేదము                    -    4
    వేదాంగము ఉపాంగము యుక్తముగా        -    6
    మొత్తము                        -    14
  బ్రాహ్మణానీతిహాసాన్‌ పురాణాని కల్పాన్‌ గాథా నారశంసీరితి. (అశ్వలాయన గృహ్యసూత్రము)
శతపథాది బ్రాహ్మణ గ్రంథముకే ఇతిహాసము, పురాణము క్పము, గాథా నారశంసీ అని పేర్లు. ప్రాచీన సాహిత్యమున పురాణమను శబ్దము బ్రాహ్మణగ్రంథముకే వర్తించును. నవీనములైన అష్టాదశ పురాణముకు కాదు.
ఆర్ష గ్రంథముకు అనార్ష గ్రంథముకు (ఋషు కానివారివి) చాలా భేదమున్నది. ఆర్ష సాహిత్యము తేలికగా ఉండి తక్కువ శ్రమతో ఎక్కువ లాభమును పొందగము. అనార్ష సాహిత్యము కఠినము. ఎక్కువ శ్రమతో తక్కువ లాభమును పొందుదుము. ఆర్షసాహిత్యపఠనము సముద్రమునందు మునిగి అమ్యూములైన ముత్యమును పొందునట్టిది. అనార్షసాహిత్య పఠనము పర్వతమును పగుగొట్టి గవ్వంత లాభమును పొందునట్టిది. ఇందుకొక ఉదాహరణ. గౌతమమహర్షి. న్యాయదర్శనమున ప్రతిజ్ఞా అనునది తొపుటకు ఈ సూత్రము రచించినాడు.
సాధ్యనిర్దేశః ప్రతిజ్ఞా । (న్యా.ద. 1-1-3)
గంగేషోపాధ్యాయుడను పండితుడు తత్వచింతామణి అను నవ్యన్యాయదర్శనమున అదే ప్రతిజ్ఞా అనునది తొపుటకు రచించిన వాక్యమిది. ‘‘సాధ్యతావచ్ఛేదకావచ్ఛిన్న సాధ్యప్రకారకః, పక్షతావచ్ఛేదకావచ్ఛిన్న పక్ష విశేషకః బోధజనకః శబ్దః ప్రతిజ్ఞా’’ దీనివన ఆర్ష సాహత్యమునకు అనార్ష సాహిత్యమునకు గ భేదము తెలిసికొనవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి