బ్రహ్మ, చర్యము అను రెండు శబ్దము కలిసి ‘‘బ్రహ్మచర్యము’’ అను శబ్దమేర్పడును.
బ్రహ్మశబ్దార్థము : బృహ వృద్ధౌ అను ధాతువు నుండి బ్రహ్మశబ్దమేర్పడును. బ్రహ్మ అనగా గొప్పది అని అర్థము.
జ్ఞానప్రదములైన సమస్త గ్రంథములో ఈశ్వరుని జ్ఞానమైన వేదము గొప్పది. అందుచే బ్రహ్మశబ్దమునకు వేదము అని అర్థము.
సృష్టియొక్క మూతత్వములైన ఈశ్వరజీవప్రకృతులో ఈశ్వరుడు గొప్పవాడు. కావున బ్రహ్మశబ్దమునకు ఈశ్వరుడని కూడా అర్థము.
శరీరధారకములైన రస రక్త మాంస మేద అస్థి మజ్జ వీర్యము అను సప్తధాతువులో వీర్యము ఉత్కృష్టమైనది. అది అన్ని ధాతువు సారము. అందుచే బ్రహ్మశబ్దము వీర్యవాచకము.
ఈ విధముగ బ్రహ్మశబ్దమునకు 1. వేదము 2. ఈశ్వరుడు 3. వీర్యము అని మూడర్థము.
చర్యమనగా ఆచరణ. అధ్యయనము, ఉపాసన, రక్షణ అని చెప్పవచ్చును.
కాబట్టి బ్రహ్మచర్యమునకు మూడర్థమును ఈ విధముగా చెప్పవచ్చును.
1. వేదాధ్యయనము, 2. ఈశ్వరోపాసన, 3. వీర్యరక్షణ
సాధారణముగ బ్రహ్మచర్యమనగా వీర్యరక్షణ మాత్రమే యని అనుకొందురు. వైదిక సాహిత్యములో పై మూడర్థములో గ్రహించబడును. బ్రహ్మచారి గురుకుములో ఈ మూడు పను చేయుచునే బ్రహ్మచర్యాశ్రమమును పాలించును.
బ్రహ్మ వేదః. తదధ్యనార్థమ్ ఆచార్యమాచరణీయం
సమదాధాన భైక్షచర్యోర్ధ్వరేతస్కత్వాదికం
బ్రహ్మచారిభిరనుష్ఠీయమానం కర్మ బ్రహ్మచర్యమ్ ॥
(సాయణాచార్య భాష్యము అథర్వవేదము 11-5-17)
బ్రహ్మ అనగా వేదము. దానినధ్యయనము చేయుటకై బ్రహ్మచారుచే అనుష్ఠింపబడు అగ్నిహోత్రము, భిక్షావృత్తి, ఊర్ధ్వవీర్యతాది కర్మను బ్రహ్మచర్యమంటారు.
ఛాందోగ్యోపనిషత్తు (3-16) నందు బ్రహ్మచర్యము కనిష్ఠ, మధ్యమ, ఉత్తమమని మూడు విధముగా ఉన్నది.
కనిష్ఠ బ్రహ్మచర్యము :
మనుష్యుడు 24 ఏండ్ల వరకు జితేంద్రియుడుగా బ్రహ్మచారిగా నుండి వేదాది విద్యను, సుశిక్షను గ్రహించవలెను. అటుపై వివాహము చేసికొన్నను విషయలోుడు కాకుండయున్నచో శరీరమునందు ప్రాణము బము కవై సమస్త శుభగుణమును వసింపజేయుము.
మధ్యమ బ్రహ్మచర్యము :
44 ఏండ్ల పర్యంతము బ్రహ్మచారిగ నుండి వేదాది శాస్త్రము నధ్యయనము చేయువానికి ప్రాణేంద్రియాంతఃకరణము, ఆత్మయు బయుక్తమై దుష్టును దండిరచి శిష్టును పాలించువాడగును.
ఉత్తమ బ్రహ్మచర్యము :
48 సంవత్సరము పర్యంతము బ్రహ్మచారిగా నుండువానికి ప్రాణమునుకూమయి అతడు సమస్త విద్యను గ్రహించును.
పూర్ణ విద్వాంసు, జితేంద్రియు, నిర్దోషు, యోగునగు స్త్రీపురుషు మరణపర్యంతము బ్రహ్మచాయిగ నుందురేని సంతోషముగ నుండవచ్చును. గృహాశ్రమము స్వీకరించు పురుషుడు 48 సం॥ స్త్రీ 24 సం॥ కన్నా నెక్కువ సంవత్సరము బ్రహ్మచర్యము పాలించరాదు. బ్రహ్మచారుకు బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞముకర్తవ్యము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి