ఇంతకుముందు కార్యకారణము అననేమో వివరింపబడినవి. విభిన్న అవయవము జ్ఞానపూర్ణమైన, నియమబద్ధమైన, పనితనము గ కూర్పు - సంయోజకతను కార్యమని తెలిసికొన్నాము. అది దాని అవయవము వియోగము వన నశించునని కూడ తెలిసికొన్నాము. మనకు ప్రతిదినము ఉపయోగములోనికి వచ్చు లేదా దృష్టిలోనికి వచ్చు పదార్థములో పై గుణమున్నచో దానిని కార్యము అనవచ్చును. ఎవరైన మొదటిసారిగ తాజమహును చూచినపుడు దాని నిర్మాణములో కనబడు పనితనమును అందుకు ఉపయోగించిన పదార్థము విశిష్టతను, దానిని నిర్మించిన శిల్పియొక్క బుద్ధికుశతను, చాతుర్యమును ప్రశంసించకుండ యుండలేడు. దాని నిర్మాణములో ఎందరో వ్యక్తు పనిచేసియుందురనియు, దానికి కొన్ని సంవత్సరము కాము పట్టియుండుననియు తెలిసికొనును. అతడు ప్రత్యక్షముగా దాని నిర్మాణమును చూచి యుండనక్కరలేదు. అయినను అతనికి పైన చెప్పిన జ్ఞానము కుగును. ఆ జ్ఞానము దార్శనికభాషలో కార్యకారణసంబంధము వన కలిగినది. సాధారణ మానవుడీ విషయమును శాస్త్రీయముగ తొపలేకపోవచ్చును. ఇచ్చట
తాజమహు - కార్యము
దానికి రూపక్పనచేసి దానిని నిర్మించిన శిల్పి - చేతననిమిత్తకారణము. అందుకు ఉపయోగించిన పారాయి, సున్నము మొదగునవి - ఉపాదానకారణము. దాని నిర్మాణములో ఉపయోగపడిన పనిముట్లు, కూలీు, కాము, మొదగునవి - సాధారణకారణము.
ఇదేవిధముగ మనకు దృష్టిగోచరమగు జగత్తును పరీక్షించినచో ఇది నియమబద్ధముగ నున్నట్లు తెలియును. ఆధునికై వైజ్ఞానికు చేయుచున్న పని సృష్టిలోని నియమమును తెలిసికొనుటయే. దీనిలో ఎంతో జ్ఞానపూర్వకమైన పనితనము గోచరించును. సూర్యుని చుట్టు గ్రహము యొక్క నియమబద్ధ భ్రమణమే సృష్టిలోని కఠోర - అటమైన నియమముకు నిదర్శనము. లేనిచో వేదాంగములోని జ్యోతిశ్శాస్త్రమే వ్యర్ధమగును. అంతేకాదు ఆధునిక శ్పిజగత్తునకు (లిదీవీరిదీలిలిజీరిదీవీ తీరిలిజిఖి) మనుగడయే యుండదు.
అతి సూక్ష్మపరమాణువు సంయోగమే ఈ సృష్టి. మరియు వాటి వియోగమే నాశము - యము. కావున సృష్టి ఒక కార్యము. ఐనచో దీనికి మూడు మూకారణము తప్పనిసరిగా యుండును. అవి 1. చేతననిమిత్తకారణము - ఈశ్వరుడు 2. ఉపాదానకారణము - ప్రకృతి. 3. సాధారణకారణము - జీవు. వీటిని అనాదితత్త్వము అని అంటారు. ఇవి వేదములో ఆంకారికముగ ఇట్లు వర్ణింపబడియున్నవి.
ఓం ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరి షస్వజాతే ।
తయోరన్యః పిప్పం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి ॥
(ఋగ్వేదము 1-164-20)
రెండు పక్షు-1. జీవాత్మ, 2. పరమాత్మ (ఈశ్వరుడు) చేతనత, పాన అను సమానగుణము కలిగి మిత్రభావముతో ఒక వృక్షమును (ప్రకృతిని) పరిష్వంగమొనర్చుచున్నవి. వాటిలో ఒకటి-జీవాత్మ వృక్ష ఫమును (కర్మఫమును) అనుభవించుచున్నది. రెండవది - ఈశ్వరుడు అట్లు అనుభవించకుండ సాక్షివలె అంతట ప్రకాశించుచున్నది.
ఈ మంత్రమునందు 1. ఈశ్వరుడు, 2. జీవుడు. 3. ప్రకృతి అను మూడు అనాది పదార్థము వర్ణింపబడియున్నవి. అనాది అనగా ఆది - ప్రారంభము లేనిది అని అర్థము. ఇవి మూకారణము. మూకారణముకు కారణముండవు. లేనిచో వానికి అనవస్థాదోషము ప్రాప్తించును. అనాది పదార్థముకు అంతము ఉండదు. అవి ఎ్లప్పుడు ఉండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి