మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ఉగ్రసేనుడు

కాయవనుని సంహారం
    మధురానగరం ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు. అక్కడే దేవకీ వసుదేవు వద్ద బరామ కృష్ణు ఆనందంగా దినాు గడుపుతున్నారు. ఉరుమురిమి పడ్డట్లు మాయావిjైున కాయవనుడు అనే రాక్షసుడు మధురపైకి దండెత్తాడు. అందుక్కారణం నారదుడు కాయవనుని వద్దకు వెళ్లి ఆ మాటా ఈ మాటా చెప్పి చివరకు నీకు ప్రియమిత్రుడైన కంసున్ని చంపిన కృష్ణున్ని అలా వదిలివేసావేమిటి? అంటూ కృష్ణునితో యుద్ధం చేయమని ఎగదోసాడు. ఆ నారదుని మాటకు వెర్రెక్కి పోయిన కాయవనుడు మధురపై దండెత్తాడు.
    కృష్ణుడు ఆలోచించాడు. సముద్రున్ని దగ్గరకు వెళ్లి కొంత స్థం అడిగాడు. విశ్వకర్మ అన దేవశిల్పిని పిల్చి సముద్రంలోపనే అద్భుత నగరాన్ని నిర్మించమని కోరాడు. ఆయన అద్భుతంగా తనశక్తిని ఉపయోగించి మహానగరాన్ని నిర్మించాడు. మధురావాసుందరూ గాఢ నిద్రలో ఉండగా కృష్ణుడు తన మాయచేత వారందర్నీ కొత్త నగరానికి చేర్చాడు. బరామున్ని మధురా పట్టణాన్ని చూసుకోమని చెప్పి త్లెవారగానే కాయవనుని దగ్గరకు బయుదేరాడు.
    చేతితో ఏ ఆయుధం లేకుండా వచ్చిన కృష్ణున్ని చూడగాన కాయవనుడు మహాగర్వంగా మీదికి గుర్రాన్ని తోలాడు. కృష్ణుడు ఆ రాక్షసునికి చిక్కకుండా పరుగెత్తాడు. కాయవనుడు కృష్ణునివెంట గుర్రాన్ని పరుగుతీయించాడు. కృష్ణుడు చిక్కినట్లే చిక్కడం త్రుటిలో తప్పించుకుని పరుగుతీయడం కాయవనునిలో అసహనం పెరిగి పోయింది. కృష్ణుడలా పరుగెత్తి పరుగెత్తి ఓ కొండ గుహలో దూరాడు. కాయవనుడు గుర్రం దిగి గుహలోకి వెళ్లాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ముని ఉన్నాడు. ధ్యానంలో ఉన్న ఆ మునిని చూడగానే కాయవనుడు కోపంతో ఓరీ! నీ మాయు నాకు నారదుడు ముందే చెప్పాడు. నువ్వు నిద్ర నటిస్తే నిన్ను వదిలేస్తానని అనుకున్నావా? గోపాుడా నువ్వు ఇంక శాశ్వతంగా నిద్రపో! అంటూ తన్నాడు. ఆ తోపుతో మునికి ధ్యానభంగం అయింది. ఎవరూ అన్నట్లు నెమ్మదిగా కళ్లు తెరచి చూసాడు. అంతే కాయవనుడు పిడికెడు బుగ్గి అయిపోయాడు. ప్రక్కనే కృష్ణుడు ఆ మహామునికి దర్శనం ఇచ్చాడు. కోరిన వరాు ఇచ్చాడు.
    ఆ మహాత్ముని పేరు ముచికందుడు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి