ఎన్వీ రఘువీర్‌ప్రతాప్ ఇంటి పేరు నారాయణదాసు. వీరి వంశమÖలపురుషుడైన రామచంద్రయ్యగారు తమను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పిన గురువులయిన నారాయణదాసు, శ్రీరామదాసు అనే గురువుల పేర్లు వారి కుమారులకు పెట్టుకున్నాడు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత నారాయణదాసు, శ్రీరామదాసువారి ఇంటి పేర్లయినవి. నారాయణదాసు వంశ పరంపరలోనివాడే మన రఘువీర్‌ప్రతాప్.
నారాయణదాసు వంశంలో మÖలపురుషుని నుండి రఘువీర్‌ప్రతాప్ 16 వ తరంలో ఉన్నాడు. ఈ వంశం వారికి తరానికి ఒకరైన విద్యావంతులు జన్మిస్తారని గురువులైన నారాయణ దాసు, శ్రీరామదాసు వరం ఉందట. అది ఇప్పటివరకు అవిచ్ఛిన్నంగా నడుస్తూ వస్తుంది. దీనికి నిదర్శనంగా ఇప్పుడు ఈ తరంలో రఘువీర్ ప్రతాప్ కనిపిస్తున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లా కలువకొలను వీరి స్వగ్రామం. వీరి తండ్రిగారైన శ్రీ నారాయణదాసు శ్రీరామాచార్యులు గొప్ప ఆధ్యాత్మికవేత్త. శేషజీవితమంతా పాలమÖరు పట్టణంలోని మౌనప్ప గుడి అభివృద్ధికై పాటు పడినారు. వారు దాదాపు 20 ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వారి ప్రతి పుస్తకానికి నాన్నగారు ముందుమాట కూడా వ్రాశారు. శ్రీ రామాచార్యులుగారు మా నాన్నగారైన కపిలవాయి లింగమÖర్తిగారు చాలా సన్నిహితులు. వారు పౌరోహిత్యంలోనూ, జ్యోతిషంలోనూ ప్రవీణులు. ఇద్దరూ కలిస్తే చర్చలతో ఆత్మీయంగా గంటలు గంటలు గడిపేవారు. కుటుంబ జీవితంలోను, సాహిత్య జీవితంలోను ఇద్దరికీ విడదీయరాని బంధం ఉండెడిది.
అ సాన్నిహిత్యము, ప్రేమానురాగాలు, ఆప్యాయత, ఆదరాభిమానాలు నాకు రఘువీర్‌ప్రతాప్‌తో కూడా కొనసాగుతున్నాయి.
రఘువీర్ ప్రతాప్ సౌమ్యుడు, నిరాడంబరుడు.ఎప్పుడు చెరిగిపోని చిరునవ్వు, ప్రశాంతత, సమతుల్యత, కోపానికి అమడ దూరంలో ఉండటం, ఎవరు కలిసినా ఆప్యాయంగా పలకరించటం, అందరికి సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ ఆయనకు సహజ లక్షణాలు. సహనం, ఓపిక, పరిస్థితుల కనుగుణంగా సర్దుకుపోవడం, అందరితో అహంకారం లేకుండా ఒదిగిపోవడం, కలిసిపోవడం ఆయనకున్న సుగుణాలు.
ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడ స్నేహాన్ని చిగురింప చేస్తాడు .వారితో అల్లుకుపోతాడు. అందుకే ఉద్యోగరీత్యా పనిచేసిన ప్రదేశాలలో కూడా చాలామంది ఆత్మీయులు, ప్రాణస్నేహితులు ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల కవిమిత్రులతో కూడా చనువుగా, ఆత్మీయంగా ఉంటాడు. దానికి నిదర్శనం ఆయన నిర్వహించే పుస్తకావిష్కరణలకు, పురస్కారాల ప్రధానాలకు దూర ప్రాంతాలనుంచి చాలామంది మిత్రులు స్వయంగా వచ్చి కార్యక్రమాలలో పాల్గొంటారు. వారందరిపై ప్రేమ అనే మత్తుమందు చáల్లి ఆత్మీయతతో వశీకరణం చేసుకున్నాడేమో?
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, లబ్దప్రతిష్టుల నుండి కొత్తగా కవనరంగంలో కడుగిడుతున్న నవకవులు కూడా ఆయనకు ఆత్మీయ మిత్రులే. అందరితో అలా సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటో?
చాలామందికి వృత్తి, ప్రవృత్తి వేరువేరుగా ఉంటాయి. వృత్తి బ్రతుకుతెరువుకొరకైతే ప్రవృత్తి మానసిక ఆనందం కొరకు ఉపయోగపడుతుంది. వృత్తినే దైవంగా భావించే రఘువీర్ ప్రతాప్ వృత్తిలో కూడా తన అనుభవాలను సాహిత్య వాసనతో అక్షరబద్దం చేశారు.
దీనికి ఉదాహరణ ఆయన రచించిన ‘మీVAన్నత వృక్షాలు’ అనే గ్రంథం. దానిలో అపురూపమైన , అరుదైన వృక్షాలను గురించి విలువైన సమాచారం అందించారు. భారతదేశంలోనేగాక ప్రపంచదేశాలలోని మీVAన్నత వృక్షాల పుట్టుక, ప్రత్యేకత, ఉపయోగం వంటి విషయాలను వివరించారు. ఈ గ్రంథంతో తను పనిచసే అటవీశాఖకు గొప్ప గుర్తింపును తెచ్చారు.
మాపై ఉన్న ప్రేమానురాగాలతో ఈ గ్రంథాన్ని మా దంపతులిద్దరికీ అంకితం చేశారు. ఇది ఊహించని అనుకోని వరం. ఈ గ్రంథాన్ని అంకితంగా పొందడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
వృత్తి నుండి పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో సర్వసాధారణం. ఇది మరో కొత్త జీవితానికి పునాది. మన అభిరుచులు, అనుభూతులు, ఆశయాలు సంపూర్ణంగ ఆస్వాదించవచ్చు, నెరవేర్చుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి