మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

విశ్వకర్మ

విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ. 

నభూమి నజలం చైననతేజో నచ వాయుచ నచబ్రహ్మా నచావిష్ణు 

నచనక్షత్ర తారకః సర్వశూన్య నిరాలంబ స్వయంభూ విశ్వకర్మణః 

భూమి- జలము - అగ్ని, వాయువు, ఆకాశము, బ్రహ్మ విష్ణు మహేశ్వర - ఇంద్ర - సూర్య - నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభూ రూపమై యుండెను. భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత అవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుడు, సహస్ర శీర్హుడు సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు - అనంతరూపములు కలవు.

‘ప్రజాపతి విశ్వకర్మ మనః’ అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. పంచముఖములను కలిగి నవాడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములే ఐదు ముఖములు. 

శ్లో. పూర్వావనాత్ సానగః, దక్షణాత్ సనాతనః

అపరార్ ఆహభూవః ఉదీచ్యాం ఉర్ధవాత్ సుపర్ణః 

విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మనుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన బ్రహ్మర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘోరయునందు అహభూవ బ్రహ్మర్షి యను త్వష్ట బ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్నస బ్రహ్మర్షి యను శిల్చి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ బ్రహ్మర్షియను విశ్వజ్ఞ బ్రహ్మయు ప్రభవించి నట్లు చెప్పబడినది. ఋగ్వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని వివరిస్తాయి.

‘అద్భ్యస్పంభూత: పృద్ధివ్యై రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాది అంటూ అందరికి సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు. 

విశ్వకర్మ సమారంభాం 

శంకరాచార్య మధ్యమాం 

వీరబ్రహ్మేంద్ర పర్యంతాం 

వందే గురుపరంపరాం 

కైలాస గిరిపై పరమేశ్వరుడు ఏకాగ్రచిత్తుడై ధ్యాననిష్టుడెయున్న సమయమున షణ్ముఖుడు తండ్రిని సమీపించి ‘ఓ తండ్రి మేమెల్లరము పరమాత్మ స్వరూపులైన మిమ్ములను, విష్ణువును, బ్రహ్మనూ ఇంకనూ ఎవరెవరి ఇష్టానుసారముగా సర్వదేవతలను ఆరాధించుచుండగా సర్వజులైన తమరు లో ఎవరిని గూర్చి ధ్యానించుచున్నారు?’ అని ప్రశ్నింపగా, స్థిర చిత్తుడైన శంకరుడు ‘కుమారా ! నీవు భావించినట్లు నేను, బ్రహ్మ విష్ణు, ఇంద్ర, సూర్యులు పరిపూర్ణులము కాము, సర్వశక్తి సమన్వితులమÖ కాము.  ఏలననగా బ్రహ్మ సృష్ఠి, విష్ణువు పోషణ, ఇంద్రుడు లోకపాలన సూర్యుడు ప్రకాశము. నేను లయకార్యములను మాత్రమే చేయ శక్తి కలవారమేకాని, ఒకరి కార్యమును మరొకరము చేయలేని ఆశక్తులము కావున మాకు ఈ జన్మమును ప్రసాదించిన విరాట్ విశ్వకర్మను ధ్యానం చేస్తున్నా’ నని చెప్పెను. అప్పుడు కార్తికేయుడు విశ్వకర్మ గురించి మరింత వివరించమని శంకరుడిని ప్రార్ధించగా శంకరుడు ఈ విధంగా తెలిపెను.

శ్లో. ఓం నభూమి, నజలం నతేజో, నచవాయువః, 

నచబ్రహ్మ, నచవిష్ణు నచరుద్రశ్చ. తారకః! 

సర్వశూన్య, నిరాలంభో! స్వయంభూ, విశ్వకర్మణ: 

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు (అనగా నేను) సూర్యుడు, చంద్రులు, నక్షత్రములు, ఇవేమియు లేక సర్వము శూన్యమై నిరాధారముగా నున్న సమయమున ప్రణవనాదంతో ప్రణవ స్వరూపంతో, నిరాకార సాకార స్వరూపంతో శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు ముందుగా తననుతాను స్వయంభువుగా సృష్టించు కొని తదుపరి ఈ సమస్త సృష్టిని సృష్టించెను.

ఈ విధముగా విరాట్ స్వరూపముగ సహస్రశీర్షుడై, స్వయంభువుగా అవతరించిన వారే శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు... అతనినే నేను నిరంతరం ధ్యానిస్తున్నాను అని శంకరుడు పలికెను.... 

శృతి: 

అనంత వీర్యస్య శ్రీమన్మహా విశ్వకర్మణ: అచింత్యా అపరిమిత శక్త్యాబియమాణస్య మహదాకాశస్య మధ్యే పరిభ్రమణానాం 

అనేక కోటి బ్రహ్మండానాం ఏకతమేవ్యక్తావ్యక్త మహదహంకార పృధి వ్యాపస్తేజో వాయురాకాశాది ఆవరణైరావృతే, 

తద ధిష్టానభూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబిత దేవతె మను, మయ, త్వష్ట, శిల్చి, విశ్వభ, పంచబ్రహ్మటికి, పరికల్పితే బ్రహ్మ, 

విష్ణు, రుద్రేంద్రాదిత్య పంచమÖర్తిభిః పరిపాలితే ఆస్మిన్ మహాబ్రహ్మాండ 

ఖండయోర్మద్యే ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అబిదాన పంచమహాశక్తిభి రామృతే 

(మనుసూత్ర ప్రయోగం) 

అనంతము అపరిమితము అయిన ఊహకందని బ్రహ్మాండమున తేజోమయుడై విశ్వకర్మ అనేక బ్రహ్మాండములకు తానొక్కడే ఆధారమై యుండి, నిరాకార, సాకార భేదంబులతో, భూ, జల, తేజో వాయు, ఆకాశాది ఆవరణములను కల్పించి తది అధిష్టాన దేవతలుగా మను, మయ, త్వష్ట, శిల్పి విశ్వజ్ఞ పంచ బ్రహ్మలను, వారికి ప్రతినిధులుగా, రుద్ర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, ఆదిత్యులను సృష్టించి, ఈ మహదాకాశ మధ్యమున పరిపూర్ణుడై భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహార్లోక, తపోలోక, జనలోక, సత్యలోకాది ఊర్యలోకములు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళది అధోలోకములకు ఆవల అతీతమైన అజాన లోకంబున దివ్య శక్తి సమన్వితమైన బంగారు శిఖరములతో తేజరిల్లు-మేరు శిఖరంబున దివ్యరత్న మణిమయ సింహాసనాసీనుడై యున్న శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు. 

పంచతత్వాత్మకుడై సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పరుష, ఈశానములను పంచముఖములతో ప్రాక్, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఈశానములనెడి పంచదిక్కులతో, బుక్, యజ, సామ, అధర్వణ, ప్రణవాది పంచ వేదములతో స్పటిక, నీల, తామ, ధూమ, సువర్ణాది పంచవర్ణములతో, పృధ్వీ, ఆపః, తేజో, వాయు, రాకాశాది పంచభూత తత్వముతో, త్వక్కు చక్షు, శ్రవణ, జిహ్వ, ఘణాది పంచజ్ఞానేంద్రియములతో, వాక్కు, పాణి, పాద, పాయు, గుహ్యాది, పంచ కర్మేంద్రియములతో, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది పంచతన్మాత్రలతో, దశభుజములు దశహస్తములు గల్గి, శూలము, డక్కా అభయ, వరదా, గదా, శంఖ, చక్ర, అబ్ద, కోశ, లేఖిని, మొదలగు ఆయుధములు ధరించి, దేవ, దానవ, యక్ష, కిన్నర, కింపురుష, మానవాది, సమస్త జీవ జాలంబుల సృష్టించి, సంరక్షింపుచు, ‘విశ్వాని కర్మాణియస్యనః’ విశ్వకర్మలను అనగా సమస్త కర్మములను నిర్వహించుచున్నాడు. ఆ సమస్తములైన కర్మములేవి? అనగా సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది కర్మములు అని అర్ధము. అంతియే గాక, 

శ్లో.ఆయం దేవానా మప మపస్తయో యోజనానాం రోదసీ 

విశ్వశంభునా వియోమమేరజస సుక్రితూయ యాజరేబి సంభవేది 

(ఋగ్వేద 2,160) సకల జీవులకు సుఖమును ఆధారమును కలిగించు భూమిని, ఆకాశమును ఏ దేవుడు పుట్టించెనో, ఏ దేవుడు సర్వ ప్రాణుల సౌఖ్యమునకై దృఢమ క్రమముదప్పనియట్లు నియమించెనో అతడే దేవతలలో గొప్పవాడు, పనివారలలో గొప్పవాడు. 

స్కంభనేభి:

అనగా గొప్పపనివాడు అని అర్ధము. అట్టి విశ్వకర్మ లోక పాలన కొరకు తన సంకల్పముచేత తన శక్తిని ప్రకృతి పురుష విభేదమున స్త్రీ పురుష భేదములతో సాకార విశ్వబ్రహ్మ విరాట్పురుషుని (విశ్వకర్మ) గా అవతరించి 

1. ప్రకృతిగా స్త్రీ స్వరూపము ` గాయత్రి గా 

2. పురుషునిగా పురుష స్వరూపమున విశ్వకర్మ భగవానునిగా 

3. నిరాకార స్వభావమున ఆ, ఉ, మ అను బీజాక్షరముల కలయిక కూడిన నిరాకార ఓం అను ప్రణవాక్షర రూపముతో ప్రణవశబ్దంగాను పరబ్రహ్మగా సర్వశక్తికి మÖలాధిదేవతగా ప్రకాశించుచున్నాడు. కావుననే సర్వదేవతలకు సర్వశక్తులకు మÖలమైనవాడు పరబ్రహ్మ.... అతనే ఏ నామమున కైననూ పరబ్రహ్మ సంకేతమైన ఓం అను ప్రణవము చేర్చనిచో ఫలించదు. కావుననే ఓం నారాయణ ఓం నమః శివాయ అని ఎవరిని ధ్యానించిననూ 

మొదట ఓం అను పరబ్రహ్మ విశ్వకర్మ నామమును చేర్చనిదే ముక్తిని పొందలేరు. సాధన పక్వదశలో చేరిన తర్వాత నిరాకార పర బ్రహ్మను ఓం అను ప్రణవము నభ్యసించి, జపించిన మోక్షము తప్పక పొందగలరు. 

ఓంకారమనే ప్రణవమభ్యసించి పరమును పొందవలెను కావుననే మహాత్ములు, మహర్షులు, కొన్ని సందర్భములలో విశ్వకర్మను గాయత్రిగా, గాయత్రిని విశ్వకర్మగా సంభోదించి యున్నారు. కావుననే వారిరువురు ప్రకృతి పురుష భిన్న రూపులేగాని ఏకంగా ప్రణవ స్వరూపులే ! ఓం అను ప్రణవాక్షరమును ఏ భాషయందు దర్శించిననూ ప్రకృతి, పురుష స్వరూపములుగా, యజ్ఞ సృష్టి కార్య సంకేతములుగా గోచరించును. 

ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ !... గీత 

ఓం మిత్యేకాక్షరం బ్రహ్మా ధ్యేయం సర్వముముక్షుభి:”

-ధ్యాన బిందోపనిషత్. 

ప్రణవ మొక్కటే పరమాత్మను చేరుటకు మార్గము. ప్రణవస్వరూపుడైన శ్రీ విశ్వకర్మ భగవానుని యొక్క వారి వంశమును గూర్చి తెలిపెదను. 

సాకార పరబ్రహ్మగా అవతరించిన విశ్వకర్మ సర్వలోక పాలన కొరకు తన అంశచే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ పంచ బ్రహ్మలను, వారికి భార్యలుగా ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను సృష్టించి వారి అంశలుగా రుద్ర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యాది మÖర్తులు, వారికి భార్యలుగా ఉమ, లక్ష్మి, వాణి, శచి, సంభా, ఈ దేవతా మÖర్తులను, వారికి గోత్రములుగా సానగ, సనాతన, అహభూవనస, ప్రత్నన, సుపర్ణాధి పంచబ్రహ్మలను సృష్టించి లోకపాలన భాధ్యతలను అప్పగించెను. కావుననే మనం ప్రతినిత్యం సంధ్యావందనాది పూజా క్రతువులలో వారిని ప్రథమ దేవతలుగా ధ్యానించుచున్నాము. 

1. ఓం  మదాదిశక్తి మనుబ్రహ్మ స్వరూపాభ్యాం ఉమా మహేశ్వరాభ్యం నమః 

2. ఓం పరాశక్తి మయబ్రహ్మ స్వరూపాభ్యాం లక్ష్మీ నారాయణాభ్యాం నమః 

3. ఓం ఇచ్ఛాశక్తి త్వష్టబ్రహ్మ స్వరూపాభ్యాం వాణీ హిరణ్యాభ్యాం నమః 

4. ఓం క్రియాశక్తి శిల్పి బ్రహ్మ స్వరూపాభ్యాం 

శచీపురందరాభ్యాం నమః

5. ఓం జ్ఞానశక్తి విశ్వబ్రహ్మ స్వరూపాభ్యాం సంజ్ఞా భాస్కరాభ్యాం నమః 

అదే విధంగా విశ్వకర్మచే సృష్టించబడిన సానగ, సనాతన, అహభూవ, ప్రత్నస, సుపర్ణస, పంచబ్రహ్మలు సర్వమానవ జీవనార్దము. తమ వంశీయులకు (విశ్వబ్రాహ్మణులకు గోత్ర ఋషులై 

1 మనుబ్రహ్మవంశీయుల సానగ గోత్రధారులై ఆయో (ఇనుప) వృత్తిని 

2 మయ బ్రహ్మవంశీయుల సనాతన గోత్రధారులె దారు (కొయ్య) వృత్తిని 

3 త్వష్టబ్రహ్మవంశీయుల” అహభూనస” గోత్రధారులై తామ్ర 

(రాగి, కంచు) వృత్తిని 

4. శ్రీశిల్పి బ్రహ్మవంశీయులు ప్రత్నస గోత్రధారులై శైల

(రాతిశిల్పి) వృత్తిని

5 విశ్వజ్ఞ బ్రహ్మవంశీయులు సుపర్ణన గోత్రధారులైÉ సువర్ణ 

(ఆభరణ) వృత్తిని

స్వీకరించిరి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి