ఆ రోజుల్లో విశేష ప్రచారం పొందిన నాటకం ‘రక్త కన్నీరు’. ఆ నాటకంలో ప్రముఖ పాత్ర ‘సుందరి’ ఆ పాత్రను తలచుకుంటేనే మన కళ్లముందు నటీమణి సీత సాక్షాత్కరిస్తుంది. ఒకటికాదు, రెండుకాదు ఆరు దశాబ్దాల ఆమె జీవితం కళామతల్లితో పెనవేసుకు పోయింది. రంగస్థలంపైనే కాదు వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలిగింది. తాను జీవితాంతం నటించి పేరు ప్రఖ్యాతలు పొందిన ‘రక్త కన్నీరు’ నాటకాన్నే, ఇంటిపేరుగా స్థిరపరుచుకున్న విలక్షణ నటి సీత. 70ఏళ్ల వయసులో నలుపు తెలుపు చిత్రాల జ్ఞాపకాలతో హైదారాబాదులోని హిమాయత్ నగర్‌లో కాలం గడుపుతోది. పాత్ర చిన్నదైనా ఏదైనా అతి సమర్థవంతంగా నటించి పేరు తెచ్చుకున్న సీత జ్ఞాపకాలు ఈ వారం .....
నేను 1935 సంవత్సరంలో విజయదశమిరోజు జన్మించాను. మా స్వస్థలం కాకినాడ. అయినా నేను పెరిగింది మాత్రం u£ంబాయి, మద్రాసు నగరాల్లోనే. మా తల్లిదండ్రులు నన్ను రాజాశాంతో గారికి దత్తత యిచ్చారు. అలా రాజాశాంతో, ఆయన సతీమణి లీలాబాయి గార్లు నాకు పెంపుడు తల్లిదండ్రులు. మా నాన్నగారైనా రాజాశాంతో ఆరోజుల్లో బాగా పేరున్న నిర్మాత. ఆయన పేరుతో తమిళనాడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక పెద్ద అవార్డు కూడా యిస్తోంది.
మా అమ్మ లీలాబాయి కూడా కళాకారిణే. ఆమె మÖకీ చిత్రాల్లో నటించేవారు. అలా మా అమ్మనాన్నలిద్దరూ సినిమా పరిశ్రమలోనే వుండటం వల్ల నాకు ఆవాసన అబ్బింది. మÖడు సంవత్సరాలు u£ంబాయిలో పెరిగి, నాకు నాలుగో ఏట మద్రాసు వచ్చేశాను. మా అమ్మ నన్ను సినిమా నటిగా చూడాలని చాలా కలలు కనేవారు. ఆ రోజుల్లో సినిమా నటి అంటే ఈ రోజుల్లాగాకాదు, అదో పెద్ద తతంగం. నాట్యం, గానం రెండూ ఖచ్చితంగా వచ్చి వుండాలి. అందువల్ల శేషాద్రి అయ్యార్ గారి వద్ద శాస్త్రీయ సంగీతం, వెంపటి చిన సత్యం గారి వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. నేను బాలనటిగాననే సినీరంగప్రవేశం చేశాను. సుబ్రమణ్యం (బేబీ సరోజ తండ్రి) గారు నిర్మించిన “త్యాగభూమి” (తమిళం) చిత్రంలో తొలిసారిగా నటించాను. తర్వాత నా పదేళ్ల వయసు వరకూ చదువుకుంటూ వుండిపోయాను. ఆ సమయంలోనే మరో మహత్తర అవకాశం నన్ను వెదుక్కుంటూ వచ్చింది. అదేమంటే నాకు వాహినీ సంస్థలో నటిగా అవకాశం లభించడం. “యోగివేమన” (1947) చిత్రంలో మోహనాంగి (ఎం.వి.రాజమ్మ) చెల్లెలు కనకాంగిగా నటించాను. అంతేకాదు ‘ఏమేమొ చేసేవురా’ అనే జావళీ పాడుకున్నాను. కె.వి.రెడ్డిగారి దర్శకత్వం, చిత్తూరు వి.నాగయ్య, లింగమÖర్తి, ఎం.వి.రాజమ్మ వంటి మహానుభావుల నటసాహచర్యం నాకు మంచి అనుభవం, సినీ పరిజ్ఞానాన్ని తెచ్చి పెట్టింది. అయితే “యోగివేమన” కంటే ముందే “సీతారామజననం” (1944)లో నటించాను. పాత్ర పేరు మాత్రం జ్ఞాపకం లేదు.
“యోగివేమన” తర్వాత భరణీవారి “రత్నమాల” (1948)లో సురభి బాలసరస్వతితో కలసి ‘వగలాడి నిను చేరురా’ అనే నాట్యగీతంలో నర్తించాను. ఆ గీతం కూడా మేము పాడుకున్నదే. అది గ్రాంఫోను రికార్డుగా కూడా విడుదలైంది. వెంటనే “లైలామజ్ను” (1949)లో భానుమతిగారి జనానా లో ఒకరుగా ప్రధాన పాత్ర పోషించాను. “అనగనగా ఒక ఖాన” అనే పాట నాపై చిత్రీకరించిందే. వీటన్నిటి తర్వాత వాహినీ వారి “గుణసుందరికథ” (1949)లో సింగారి పాత్ర పోషించారు. రేలంగి, గోబేరు సుబ్బారావులను కవ్విస్తూ మహేంద్రమణి వుండే దారిని కాపలా కాసే యక్షిణి పాత్ర అది. రేలంగి, గోబేరు సుబ్బారావులను కవ్విస్తూ, ‘నేను సింగారినే’ అనే పాట పాడాను. “గుణసుందరి” తర్వాత చాలా బిజీ అయిపోయాను. వ్పుియావారి ప్రథమచిత్రం “షావుకారు” (1950)లో డాన్సర్ మాణిక్యం పాత్ర పోషించాను. ‘సరసులకిది మేరా’, ‘విరహవ్యధ మరచుకథ’ అనే రెండు పాటలు జోగారావుపైన, నాపైన చిత్రీకరించినవే. కథలో చాలా కీలకమైనన పాత్ర అది. కథా నాయకుడు (ఎన్.టి.రామారావు)ను జైలుకు పంపించే వాంప్‌టచ్ పాత్ర నాకు చాలా మంచిపేరు, తర్వాత్తర్వాత మరిన్ని పాత్రలు తెచ్చిపెట్టింది. కొంతకాలం నన్ను “షావుకారు సీత” అనే పిలిచేవారు. ఆ పరంపరలోనే “స్వప్నసుందరి” (1950 కస్తూరి శివరావు సరసన), “లక్క్ష్మమ్మ” (1950 శోభనాచల), “నవ్వితే నవరత్నాలు” (1950), “మాయాలమారి” (1950), “చిన్నకోడలు”, “సావాసం” (1951), “దేవదాసు” (1953), “పెద్దమనుషులు”, “మేనరికం”, “పరివర్తన” (1954), “జయసింహ” (1956), “నలదమయంతి”, “మాయాబజార” (1957), “భట్టీవిక్రమార్క” (1960) మొదలైన చిత్రాలన్నిటిలోనూ నటించాను. వేసినవి హాస్యపాత్రలే అయినా పెద్దనటీనటులందరూ మమ్మల్ని గౌరవించేవారు. అంటే ఒకటి, హాస్యమన్న పేరుతో అప్పటికింకా ‘సెక్స’కి విప్పిచూపడం, బూతు పాడడం అన్న నిర్వచనం రాలేదు. కన్ను గీటుతో, కొనగోటితో పులకరింతలెత్తించేవారు దర్శకులూ, నృత్యదర్శకులూ. హాస్యపాత్రలకు కూడా కథలో ఇంటర్‌లింక్ వుండేది. ఉదాహరణకు “భట్టీవిక్రమార్క”లో రేలంగితో వేసినా కేవలం హాస్యమే కాదు, కథానాయిక ప్రభావతి (అంజలీదేవి)ని మాంత్రికుడి (ఎస్వీరంగారావు) బారినుండి కాపాడే కీలక బాధ్యత నాది, “నలదమయంతి”లో చాకలిదాని పాత్ర అయిన, దమయంతి (పి.భానుమతి)ని ఆదుకుని ఆశ్రయం కల్పించే పాత్ర. ఇలా కామెడీ కతలో అంతర్భాగంగా కథలల్లే వారు ఆనాటి రచయితలు. పింగళి నాగేంద్రరావు, సదాశివబ్రహ్మం, జంపన. ఇలా ఎంతటి మహానుభావులు వాళ్లు. సదాశివబ్రహ్మం గారైతే “ఏం సీతమ్మా... నీ కోసమే రాశానమ్మా, చాకుల్లాంటి డైలాగులు” అనేవారు. పేకేటిశివరాం, అడ్డాల నారాయణరావు, రేలంగి, కస్తూరి శివరావు, జోగారావు, కనకం, లక్క్ష్మీకాంతం, గిరిజ, సూర్యకాంతం... ఇలా హాస్యం కోసమనే ఓ ప్రత్యేక నటవర్గముండేది. మేమంతా తీరికసమయాల్లో మా పాత్రల గురించి చర్చించుకునే వాళ్లం. అవసరమైతే రచయితను ఒప్పించి కథను కూడా మార్పించే వాళ్లం. ఒకరోజు, రెండ్రోజులు, అవసరమైతే నెలలు నెలలు కూడా రిహార్సల్సు చేసేవాళ్లం. ఈవ్వాళ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. అదొక విలాసాల మాయామహల్.. మేము అలా కాదు. సీనియర్లు అంటే గౌరవించే వాళ్లం. ఇప్పుడలా కాదుT, జూనియర్స్‌కు సీనియర్స్ అంటే u£త్తిగా గౌరవం లేదు. ఒక జూనియర్ నటితో, “ఈమె మీ కంటే సీనియర్ అమ్మా..” అని పరిచయం చేస్తే, కనీసం ఒక మర్యాద పూర్వక నమస్కారం కూడా చేయకుండా, అలా చూసి వెళ్లిపోతుంటారు. అది నాకు బాధేస్తూ వుంటుంది. పి.శాంతకుమారి, ఎం.వి.రాజమ్మ, ఎస్.వరలక్క్ష్మి, కన్నాంబ, టి.జి.కమలాదేవి... ఇలా సీనియర్ నటీమణులంటే మాకెంతో గౌరవముండేది. వాళ్లు సెట్లోకి వస్తున్నారంటేనే మాకోవిధమైనన భయమొచ్చేసేది. అలా వుండేది. నిర్మాత అంటే ఇంక స్కూలు హెడ్మాస్టర్ కిందే లెక్క. నిర్మాతల్ని గౌరవించే రోజులు పోయాయి. అసలు నిర్మాత పచ్చగా వుంటేనే కదండీ, మా ఆర్టిస్టులు బాగుంటాం అది లేదా!
ఏదో ఉద్వేగం ఆపుకోలేక ఎక్కడో వెళ్ళిపోయాను, సారీ.... అసలు విషయానికి వచ్చేస్తాను-
తెలుగులో సుమారు వంద చిత్రాలకు పైనే చేసినా నాకు సంతృప్తినిచ్చినది రెండే “షావుకారు”, “దేవదాసు”. నాకు నటిగా స్థిరత్వాన్ని తెచ్చింది మొదటిదైతే, “దేవదాసు”లో మనోరమ పాత్ర చాలా గొప్పది. పార్వతి (సావిత్రి) స్నేహితురాలు పాత్ర అది. దేవదాసు తాగి చెడిపోతున్నాడని, వచ్చి కాపాడమని పార్వతికి ఉత్తరం రాశేపాత్ర. కథలో కీలకపాత్ర. ఈ రెండు నాకు ఇష్టమైనవి. నేను ఒక్క తెలుగులోనే గాక తమిళంలో కూడా “కృష్ణభక్తి”, “లవంగి” మొదలైన చిత్రాలు చేశాను. హిందీలో “జయసింహ” (డబ్బింగ్)లో నటించాను.. ఇక నాపై చిత్రీకరించిన పాటలు- ‘బంగరు u£మ్మా భలే జోరుగా’ (భలేరాముడు), ‘మురిపెము మీరు మీ కోరిక తీర’ (జయసింహ), ‘లల్లిలలా’ (మాయాబజార్) వంటివన్నీన నన్న sTÖ నాటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశాయి.
నాకు సినిమారంగం కంటే నాటక రంగమే సంతృప్తి నిచ్చింది. నాటకాల్లో ఓ వెలుగు వెలిగాను. అసలు నాటకాల కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకున్నాను. నా మొదటి నాటకం ఏడేళ్ల వయసులో వేశాను. చెన్నపురి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన ‘మోహినీ రుక్మాంగద’లో ధర్మాంగద పాత్ర పోషించాను. అప్పటినుంచి ‘రంగూన్‌రాధ’, ‘శ్రీకృష్ణతులాభారం’ (నళిని), ‘చింతామణి’ (చిత్ర) మొదలైన నాటకాలన్నీన కొన్నిన వందలసార్లు ఆడాను. ఆ రోజుల్లో శివాజీగణేషన్ నటించిన “మనోహర” చాలా విజయవంతమైన చిత్రం. ఆ చిత్రాన్ని నాటకంగా రూపొందిస్తే, నేను, పద్మనాభం, కొంగర జగ్గయ్యగార్లు చాలాసార్లు ప్రదర్శించాం. పోతే నా జీవితంలో అత్యం ప్రధానఘట్టం ప్రముఖ నటుడు సి.నాగభూషం గారితో నా వివాహం జరగడం. 11.03.1956లో మా వివాహమయ్యింది. మేమిద్దరం సినిమాల్లో బిజీగా వున్నా కూడా డ్రామా ట్రూపు నిర్వహించేవాళ్లం. అప్పటికే ఆయన ప్రజానాట్యమండలిలో చాలా క్రియాశీలక పాత్ర వహించేవారు. అలా ఆయనలోని ÅకమÖ్యనిస్టుభావజాలం నాకు ఒంటబట్టింది. అందువల్ల ప్రజాభ్యుదయ నాటకాలే వేయాలనుకున్నాం. సరిగ్గా ఆ సమయంలోనే తమిళంలో ఎం.ఆర్.రాధగారు ప్రదర్శించి, విజయం సాధించిన “రక్తకన్నీరు” నాటకం మా వారిని విపరీతంగా ఆకర్షించింది. దాని స్క్రిప్టు సంపాదించి, పాలగుమ్మి పద్మరాజు గారితో అనేక మార్పులూ, చేర్పులు చేయించి స్వతంత్ర నాటకంగా రూపొందించారు. అందులో సుందరి పాత్ర నాది. వాంప్ తరహా పాత్ర. హీరో తన భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరుతాడు. సుందరి వంచనకు గురై, పశ్చాత్తాపడే హీరో పాత్రను మావారే పోషించేవారు. ఇందిర పాత్రలో వాణిశ్రీ, శారద, డబ్బింగ్ జానకి... చాలాకాలం పాటు మా ట్రూపులో నటించేవాళ్లు. 1958లో రవిఆర్ట్‌థియేటర్స్ ప్రారంభించాం. మా నాటకం అశేష ప్రజానీకం ఆదరాభిమానాలు పొంది మా ఇద్దరి యింటిపేరుగా ‘రక్తకన్నీరు’ స్థిరపడిపోయింది. మొత్తం ఐదువేలకు పైబడి ‘రక్తకన్నీరు’ ప్రదర్శించి వుంటాం.
వాణిశ్రీ, శారద, మీనాకుమారి (హాస్యనటి).. ఈ మువ్వురికీ రక్తకన్నీరు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. వాణిశ్రీ అప్పటికి సినీ పరిశ్రమకి చాలా కొత్త. ఏవో చిన్నచిన్న పాత్రలు వేస్తూ వుండేది. సంభాషణలు ఉచ్ఛరించడంలోను, ఆహార్యవిషయాల్లోనూ నేను ఎన్నోసార్లు తర్ఫీదŠT ఇచ్చేదాన్ని. అలాగే శారద కూడా మా నాటకాల సమయంలో నా నుంచి ఎన్నో నటనలో మెళుకువలు అడిగి తెలుసుకునేది.
మావారుగానీ, నేను గానీ ఎవర్నీ యాచించలేదు. ఎవరి ముందూ చేయి చాచలేదు, వేషాలు వచ్చినపుడు నటించాం, రానప్పుడు మానుకున్నాం. సినిమాల్లో విరామం లేకుండా పనిచేస్తున్న రోజుల్లో కూడా, నిర్మాతల్ని ఒప్పించి ప్రతినెలా మొదటివారం ‘రక్తకన్నీరు’ ప్రదర్శించుకునేవాళ్లం. మా అమ్మాయి భువనేశ్వరి పుట్టినప్పుడు ఓ ఆరునెలలు తప్ప, రక్తకన్నీరు ప్రదర్శితమైన (1958-1974) పదహారు సంవత్సరాలు విరామనేది లేకుండా నేను సుందరి పాత్రలో నటించాను, ఆ తర్వాత నటించడం మానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూసుకునే దాన్ని. 1986లో ఈ నాటకాన్ని చివరిసారిగా ప్రదర్శించారు మా వారు. ఆ రోజుల్లో రిహార్సల్స్ కఠోర పరిశ్రమలా వుండేది. కొన్ని కొన్ని సార్లయితే అదో హౌస్ అరెస్టులా అనిపించేది. అయితే ప్రదర్శన మాత్రం పెళ్లి వేడుకలాగా సాగిపోయేది. మా నాటక బృందమంతా ఒక కుటుంబం లాగా కలసిమెలసి వుండేవాళ్లం. లేకుంటే ‘రక్తకన్నీరు’ అంత సుదీర్ఘకాలం ప్రదర్శించడం సాధ్యమయ్యేది కాదు. ‘రక్తకన్నీరు’ నాటకం తొలిప్రదర్శన నెల్లూరులో యిచ్చాం. తర్వాత అమలాపురంలో ప్రదర్శించినపుడు వజీర్ అనే కాంట్రాక్టర్ మాకు ఇచ్చింది కేవలం 450 రూపాయలే. కానీ నాటకం పేరు తెచ్చుకుంటున్న కొద్దీ పారితోషికం కూడా పెరుగుతూ వచ్చింది. 450 రూపాయల నుండి 11,000 రూపాయల వరకూ తీసుకునేవాళ్లం. మా ట్రూపు ఒక ప్రత్యేక వ్యానుతో సర్కస్ కంపెనీలాగా వుండేది. సంవత్సరానికి ఎనిమిదినెలలు క్రమం తప్పకుండా నాటకమాడేవాళ్లం. మద్రాసు నుంచి మధ్యప్రదేశ్ వరకూ మా రవిఆర్ట్‌థియేటర్స్ తిరగని చోటంటూలేదు. విజయవాడ సి.పి.ఐ. మహాసభల సందర్భంగా తెల్లవారు ఝామున 5 గంటలవరకూ ‘రక్తకన్నీరు’ ప్రదర్శించాం. అంటే ఎప్పటి కప్పుడు సంభాషణల్ని నాగభూషణంగారు మార్చేశేవాళ్లు. దాంతో జనాలు ఎగబడేవారు. ఆయన నాటకంలో విసిరేవిసుర్లు వినడానికి జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఒకసారి గుడివాడలో ప్రదర్శన జరుగుతుండగా తెలిసినన అంశాన్నే అడుగుతావెందుకు అనడానికి ‘బ్రహ్మానందరెడ్డి కులమేది అని అడగాలా’ అన్న నాగభూషణం గారి డైలాగ్ గందరగోళం సృష్టించింది. కత్తులు, కర్రలతో కొంతమంది రంగస్థలం పైకి దూసుకొచ్చి నానాహంగామా చేసేశారు. ఆయన నాటకంలో విసిరే వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శనకే ముఖ్య అలంకారాలుగా వుండేవి. ఎమర్జెన్సీ రోజుల్లో ‘రక్తకన్నీరు’లోని సంభాషణలపై ప్రభుత్వం కన్నేసివుండేది. అంటే ప్రజల్ని రెచ్చగొట్టి, చైతన్యం తెస్తామేమోనని భయం. ఇంటెలిజెన్సీ అధికారులు పై అధికారులకు రిపోర్టులు పంపేవారు. వాళ్లు వచ్చి స్క్రిప్టు అడిగితే, ఆడిగేదే ఆలస్యం స్క్రిప్టు ఇచ్చేసేవారాయన. ఎందుకంటే అందులో వుండేది ఏ రోజు తెరపై చెప్పేవారు కాదు గదా! అంతా స్పాంటేనియస్ డైలాగులే. అలా స్క్రిప్టు యిచ్చేసినా, ప్రదర్శనలో మళ్లీ మామÖలే ఆయన మార్కు చురకలు. ఒక్కోసారి అధికారులు కూడా ప్రదర్శనలో నిమగ్నమైపోయి వచ్చిన సంగతి మరచిపోయిన సందర్భాలు కోకొల్లలు. ఉదాహరణకు “ఈ ఊళ్లో దోమలు ఏనుగుల్లా ఉన్నాయి. మునిసిపాలిటీవాళ్లు బాగా ప్రేమతో పెంచుతున్నారులా వుంది” అన్న డైలాగ్ మునిసిపాలిటీ వాళ్లకు కంపరం పుట్టించినా, ప్రేక్షకుల చప్పట్లతో హోరెత్తేది.
నాటక ప్రదర్శనలో మావారు చాలాఖచ్చితంగా వుండేవారు. టిక్కెట్లు లేకుండా ఉచితంగా ఎవరినీ అనుమతించేవారు కాదు. ఒకసారి శ్రీకాళహస్తిలో ఈ టిక్కెట్ల విషయం పోలీసుకాల్పుల వరకూ వెళ్లింది. ప్రదర్శన సమయానికి చాలామందే ఆడిటోరియం ముందర జనం ఒకజాతరలా పోగైపోయారు. దాంతో ప్రదర్శన విజయవంతమైనట్లేనని మేమనుకున్నాం. కానీ వాళ్లంతా ఉచితంగా తమను థియేటర్లోకి అనుమతించాలని గగ్గోలు మొదలు పెట్టారు. ససేమిరా వీల్లేదని మేం పట్టుబట్టాం. దాంతో వాళ్లు రాళ్లు విసిరారు. ఆ కొట్లాటలో పోలీసులు జోక్యం చేసుకుని గాలిలోకి కాల్పులు జరిపే దాకా వ్యవహారం సద్దుమణగలేదు. ఈ హడావుడిలో మేముంటే, లోపల ఒక సంఘటన జరిగింది. ఆ జనాల్లో ఎటుపోవాలో అర్థం గాక వాణిశ్రీ స్టేజిమీదే నిలబడిపోయింది. ఆమెకు ధైర్యం చెప్పే మిషతో ఒక పెద్దమనిషి అసభ్యంగా ప్రవర్తించడానికి ఉపక్రమిస్తున్నాడు. అది గమనించిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. అతనిపై పోలీసు కేసు, మా సంజాయిషీలు వగైరాలన్నీ జరిగాయి. ఇలా ఎన్నో సంఘటనలు వున్నాయి చెప్పుకుంటే.
ఒక “రక్తకన్నీరు” మాత్రమే కాదు, “పాపం పండింది”, “బికారి రాముడు’, ‘కోతలరాయుడు’, ‘కలికాలం’ వంటి నాటకాలనీÊ్న ఆడాము. వాటిల్లో కూడా నేను ప్రధాన పాత్రే వహించాను. మావారు కొన్ని సినిమాలుT సొంతంగా నిర్మించారు కూడా. “బికారి రాముడు” (1961), “నాటకాలరాయుడు” (1969), “ఒకేకుటుంబం” (1970), “ప్రజానాయకుడు” (1972), “భాగస్తులు” (1975), “ప్రేమచేసిన పెళ్లి” (1978) చిత్రాలు ఆయన నిర్మించినవే. అయితే “బికారిరాముడు”, “నాటకాలరాయుడు” రెండూ బి.ఆర్.నాయుడుగారి భాగస్వామ్యంలో నిర్మించినవి.
తెలుగులో నేను మా చిత్రాల్లో కాకుండా నటించిన చివరిచిత్రం “సంతోషి మాత వ్రత మహాత్మ్యం” (1984). మళ్లీ చాలా సంవత్సరాలకు “నేనేరా పోలీస”, “రియల్‌స్టోరీ” (2000) చిత్రాల్లో నటించాను. నేను డబ్బింగ్ ఆర్టిస్టును కూడా. చాలా మందికి తెలీదు. మోడరన్ థియేటర్స్ వాళ్లు నిర్మించిన “ఆలీబాబా నలభైదొంగలు” (1954)చిత్రంలో ఎం.ఎన్.రాజంకు తెలుగులో డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ ఆర్టిస్టుగా నా చివరి చిత్రం “ఏకలవ్య” (1982). అందులో ఆదోని లక్క్ష్మికి డబ్బింగ్ చెప్పాను. ఆ మధ్య టీవీ సీరియల్స్‌లో కూడా నటించాను. “రుతురాగాలు”, “శివలీలలు”, “విధి”, “భార్యాభర్తలు” మొదలైన సీరియల్స్‌లో నటించాను. మాకు ఇద్దరు పిల్లలు - అమ్మాయి భువనేశ్వరిని ప్రముఖ దర్శకుడు ఎస్.డి.లాల్ కుమారుడైన మీర్‌కు యిచ్చి వివాహం చేశాం. మా అల్లుడు మీర్ కూడా టెలివిజన్ రంగంలో కెమురామాన్, ఎడిటర్, దర్శకుడుగా వున్నాడు. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు. నా కొడుకు సురేంద్ర కూడా సినిమాల్లకు కెమెరామాన్‌గా వున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు. నా మనవడు హోటల్ మేనెజ్‌మెంట్ పూర్తి చేశాడు. మనవరాలు డిగ్రీ చదువుతోంది.
ప్రస్తుతం నా కొడుకు దగ్గరే వుంటున్నాను. మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంతంగానే గడుపుతున్నాను. దాదాపు పరిశ్రమకు దూరంగానే వున్నాను. అయినా నాటక, సినీ, టీవీ, డబ్బింగ్ రంగాల్లో ఉన్నపేరు నిలుపుకుంటే చాలు. ఈ మధ్యే హైదరాబాదలో “దేవదాసు”కు యాభై ఏళ్లు పూర్తయ్యాయని, అందులో నటించిన నాకు సన్మానం చేశారు. ఇంకా ఏదో నటించాలి, చేయాలి అనుకుంటాంగానీ, పరిశ్రమ మునుపటిలా లేదు. పాత ఆర్టిస్టుల్ని కూడా చూడాలని వుంటుంది. ఏదో ఒక స్వర్ణయుగం కళ్లముందరే మాయమై పోయినట్లు వుంటుంది. ఏం చేద్దాం! కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి