జొనాథన్ స్విప్ట్ జీవితం విషాదంతోనే ప్రారంభం అయింది. తండ్రి చనిపోయిన తరవాత ఐరిష్‌లో ‘డబ్లిన’ నగరంలో జన్మించాడు. వాళ్ళ మామయ్య సహకారంతో విద్యాభ్యాసం చేశాడు. మొదట ‘కెల్‌కెన్నీ’ పాఠశాలలో, ఆ తరవాత ‘ట్రైనిట’ కళాశాలలో ఇతడు చదువు సాగించాడు. రెండవ జేమ్స్ రాజీనామ తరవాత ఐరిష్‌లో ఏర్పడిన సంక్షోభంచేత ఎందరో ఐరిష్ - ఆంగ్లేయన్లు ఇంగ్లాండుకు వలసపోయారు. 1679 మరియు 1689 మధ్యన దాదాపు పదిసంవత్సరాలు మంచి నాగరికత తెలిసిన పట్టణప్రాంతవాసి అయిన ‘సర్ విలియమ’ తో ఉన్నాడు. ఈ సమయంలోనే స్విఫ్ట్ ఎన్నో పుస్తకాలను చదివాడు. ముఖ్యంగా చర్చికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాడు. ఆ తరవాతకాలంలో గొప్ప రచయితగా ఎదిగిపోయాడు.
1696-97 మధ్య ప్రాంతంలో మతాలలోగల లొసగులను బయటపెడుతూ అద్భుతమైన వ్యంగ్య రచనలు చేశాడు. 1704 లో ‘ఏ టేల్ ఆఫ్ టబ’ (A TALజు Oఖీ TUదీ) మరియు ‘ది బ్యాటిల్ ఆఫ్ ది బుక్స’ (Tష్ట్రవ దీattశ్రీవ శీf tష్ట్రవ దీశీశీks) అను గొప్ప వ్యంగ్య రచనలు చేశారు. తన ముఫ్ఫై రెండవ యేట తిరిగి ఐరిష్‌కు ఒక మతగురువుగా వెళ్ళాడు.
అటు పిమ్మట తన తెలివి తేటలను మతాలచేత మిలితమైన రాజకీయాలకే కేటాయించాడు. అప్పట్లో రాజకీయానికి మతానికి స్పష్టమైన భేదాలు
ఉండేవికావు. ఇతని రచనలు ఎక్కువగా గద్యంలోనే ఉండేవి. అవన్నీ ఏదోఒక ప్రత్యేక హేతువుతో రాసినవే. ఆ కాలంలో ఇతను అత్యున్నత పొలిటికల్ జర్నలిస్టుగా అవతరించాడు. ‘ది ఎక్జామినర’ (Tష్ట్రవ జుఞaఎఱఅవతీ) పత్రికకు ఎడిటర్‌గా ఉంటూ ‘ఆక్స్‌ఫర్డ’ మరియు ‘బోలింగ్ బ్రోక’ లాంటి విషయంలో ప్రభుత్వాలకు సేవలందించాడు. అనేక సంకలనాలతో, వ్యాసాలతో, సుధీర్ఘ వ్యాసాలతో అతి ముఖ్యమైన విధానాలను, అనుసరించవలసిన పద్ధతులను అందులో క్లుప్తంగా వివరించాడు. ఇతని సేవలకుగాను ప్రభుత్వం ఇతనిని ప్రభుత్వ వ్యవహారాల సభ్యునిగా నియమించింది.
ఐరిష్ లో ఉన్నన్నాళ్ళు అసంతృప్తిగానే ఉండినా పరిపాలనదక్షుడిగా తన కర్తవ్యాన్ని నిర్విరామంగా కొనసాగించాడు. 1724లో ఇంగ్లాండుకు వలస వెళ్ళటానికి ఐరిష్ అభ్యంతరాన్ని నిర్భయంగా వ్యతిరేకించాడు. అట్లాంటి వారికెందరికో నాయకత్వాన్ని వహించాడు. స్వేచ్ఛ హక్కు అందరికి వుండవలసిన హక్కుగా గుర్తించాడు.
స్విప్ట్ చివరి సంవత్సరాలు అంత ఆనందంగా ఉండలేదు. అతడికి అనేక వ్యాధులు సోకినాయి. తరవాత అతడికి చెవిటితనం కూడ వచ్చింది. 1739 తరవాత అంటే అతని డెబ్భైరెండవ సంవత్సరం నుండి తన విధులకు స్వస్తి పలికాడు. ఒక సామాజికుడిగా సామాన్యమైన జీవితం గడపడం మొదలెట్టాడు.
స్విఫ్ట్‌కు మంచి స్నేహం తోడుగా నిలిచింది. ఇతను ఎందరో ఉద్దండుల ప్రశంసలు పొందాడు. మరెందరో ఆదరణకు నోచుకున్నాడు. ‘జోసెఫ్ అడిసన’ అలెగ్జాండర్ పోప్, మ్యాథ్యుప్రేయర్, లార్డు ఆక్స్ఫర్డ్, జాన్‌గే మరియు లార్డు బ్రోలింగ్ బ్రోక్ ఇతని స్నేహితులు. స్త్రీల కోసం ఎన్నో వైవిధ్యమైన రచనలు రాశాడు.
‘స్టెల్లా’, ‘టెంపుల్ స్టీవర్డు’ యొక్క కూతురు. ఈమె స్విఫ్ట్‌కు చిన్ననాటినుండి తెలుసు. టెంపుల్ స్టీవర్డ్ చనిపోయిన తరవాత ఇతని స్నేహితుడైన ‘జొనాధన్ స్విఫ్ట’ స్టెల్లాను చేరదీస్తాడు. ఆమెకు విద్యాబుద్ధులు ఇతనే చెప్పిస్తాడు. ఆ తరవాత ఆమెను ప్రేమించాడు.
1766లో ఆమెకొరకు రాసిన ఉత్తరాలను ఒక పుస్తకంగా ముద్రించాడు. అదే ‘ది జర్నల్ టు స్టెల్లా’ (Tష్ట్రవ జీశీuతీఅaశ్రీ tశీ Stవశ్రీశ్రీa) గా ప్రసిద్ధి పొందింది. ఆమెకోసం ఎన్నో పద్యాలను కూడా చాలా అందంగా చమత్కారంగా రాదాడు. రహస్యంగా ఆమెను వివాహం చేసుకున్నాడని కొందరి అభియోగం. లేదని మరి కొందరు అభిప్రాయపడ్డారు. అతని భార్య ‘హెసŸ్టర’ (Hవstవతీ) చిన్నవయస్సులోనే మరణించటంచేత స్విఫ్ట్‌కు స్టెల్లాపై అచంచలమైన ప్రేమ పెరిగి ఉండవచ్చు. తన రచనలలో, ఉత్తరాలలో అతనికి స్టెల్లాపై ఆప్యాయత ప్రేమాభిమా నమే ఉందని తెలుస్తుంది.
స్విఫ్ట్ మనకు లభించిన అతికొద్దిమంది గద్యభాగాలు రాసిన కవులలో ఒకడు. స్విఫ్ట్ మంచి శైలిని ఇలా వర్ణించాడు ‘Pతీశీజూవతీ ఔశీతీds ఱఅ జూతీశీజూవతీ జూశ్రీacవs్ణ అంటే సరియైన పదాలు సరియైన చోట ఉండడమే మంచిశైౖలి అని స్విప్ట్ అభిప్రాయం. మన అలంకారశాస్త్రంలో క్షేమేంద్రుడు సిద్ధాంతీకరించిన ఔచిత్య మతమే స్విఫ్ట్ ఉద్ధేశించిన శైలి లేక రీతి. ఇతని రచనలన్నింటిలోను స్పష్టమైన, సరళమైన, సూటిదనంతో, అస్పష్టమైన పదబంధాలు లేకుండా, తక్కువ పదాలతో భావ వ్యక్తీకరణ మనకు కనిపిస్తుంది. ఇతని శైలియే ఇతని రచనలకు అలంకారమయంగా భాసిస్తుంది. భావ వ్యక్తీకరణకు భాషపై అదుపు, పట్టు
ఉండాలన్నది ఇతని మతము.
గద్యభాగాల్లో ఇతను ప్రదర్శించే శక్తివంతమైన గుణాలు ఇతని రచనలలో కనిపిస్తాయి. జీవిత సత్యాలే ఇతని రచనా వస్తువులు. కొందరు వ్యక్తులు స్విఫ్ట్‌ను మానవ వ్యతిరేక భావాలుగల వ్యక్తిగా గుర్తించారు. ఇతని ‘గలివరు ట్రావెల్స’ అదే విషయాన్ని తెలుపుతున్నట్లు మనకు తెలుస్తుంది. వాస్తవంగానే తను ప్రజలకు రాసిన ఉత్తరాల ద్వారా ఇతను మానవ ద్వేషిగా తెలుస్తుంది.
ఆనాడు రచయితలు కూడా డబ్బు వ్యామోహంలో పడి విచక్షణరహితంగా సత్యాసత్యాలను విస్మరించి ప్రతిభను వేలం వేసేవారు. ఇట్లాంటి పరిస్థితిలోనే స్విఫ్ట్ సంఘసంస్కరణ తన ధ్యేయంగా భావించి ప్రజాశ్రేయస్సు ప్రజాభిమానమే గల స్విఫ్ట్ రచనా రంగంలోకి అడుగుపెట్టాడు. అంతేకాక జొనాథన్ స్విఫ్ట్ కొంతకాలం చర్చిలో, కొంత కాలం రాజకీయంలో ఉండటంచేతకూడ అటు చర్చీ పనితీరు ఇటు ప్రభుత్వం పనితీరు తెలపటం ఈ రచనకు మరో కారణం.
రచనా దృక్ఫథము :
‘గలివరు ట్రావెల్స’ లోని నాలుగు కథలను పరిశీలిస్తే నాటి ఇంగ్లాండులో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో తెలుస్తుంది. జొనాధన్ స్విఫ్ట్ నాటి పరిస్థితులకు విరక్తి చెంది ‘గలివరు ట్రావెల్స’ ను రచించాడు. ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంకేతిక రంగాల్లోని స్థితిగతులను పరిశీలించి ఎట్లాగైనా తిరిగి పునరుద్దరించాలని సంకల్పించే ఈయన ఈ రచనకు సంసిద్ధుడైనాడు. దేశరాజకీయాలలో జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు రాజకీయనాయకుల నియంతృత్వ ధోరణలను రూపుమాపుటం కోసం ఈ రచన చేసాడు. వాస్తవ జీవితానికి విరుద్ధమైన వాటిని ఖండించాడు. రాజకీయాలలో, వృత్తుల్లో, చర్చిస్థాయిలో, ఆర్థికరంగంలో ఇలా అన్ని రంగాల్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేయలని స్విఫ్ట్ ప్రయత్నించాడు. డబ్బు కోసం కొందరు రచయితలు న్యాయాన్యాయాలు మరిచిపోరాదని తెలియజేశాడు. దేశంలో అన్నిస్థాయిలో జరుగుతున్న అవినీతిని ఖండించాలని పూనుకున్నాడు.
ఎక్కడెక్కడైతే మనిషి వాస్తవిక జీవితానికి దూరంగా ఉంటున్నాడో అక్కడక్కడ తన కలంతో పోటు పొడవటానికి పూనుకున్నాడు. పదవులకోసం నాయకులు చేస్తున్న కుతంత్రాలను ప్రజలకు తెలియజేయాలని అనుకున్నాడు. పదవులను కాపాడుకోవటం కోసం చిన్న నాయకుడి నుండి ప్రధానమంత్రివరకు రాజకీయ చదరంగంలో ఎలా పావులు కదిలిస్తున్నారో తెలుపటం కోసం రచించాడు. ‘క్వీన్ అన్నాస’ (Quవవఅ Aఅఅas) నాడు పదవుల నియామకంలో నిర్వహించిన పాత్రను ఆమె వేసిన పాచికలను బయటపెట్టాలని ప్రయత్నించాడు.
నాడు ఇంగ్లాండు విగ్గు (wష్ట్రఱస్త్రs) లకు టోరి (Tశీతీఱవs) లకు రాజకీయ సమరం జరుగుతుండేది. ఇవి ఇంగ్లాండాలో రెండు ప్రధాన పార్టీలు. ప్రజాసంక్షేమం మరచి కేవలం స్వలాభ పేక్షకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టాలని అనుకున్నాడు. పైస్థాయినుండి క్రిందిస్థాయివరకు భయంకరంగా పేరుకుపోయిన లంచగొండితనాన్ని ప్రభుత్వ బలహీనతను తద్వారా క్షీణిస్తున్న ఆర్థిక సమానతను తెలియజేయటానికి ‘గలివర్ ట్రావెల్స’ ను రచించాడు. చర్చిస్థాయిలో జరుగుతున్న మోసాలు కూడా బయటపెట్టాడు. చర్చి మత భోదకులను నియమించటంలో రాజకీయం ఎట్లా తన పాత్రను నిర్వహించేదో తెలియజేశాడు. ప్రతిభను, అనుభవంను ప్రక్కకుపెట్టి రాజకీయ పలుకుబడి ఉన్నవారికే చర్చి నిర్వాహకులుగా నియామకం జరిగేది. ఒక వర్గం గురించి అధికారులు ప్రచారంచేయటం ఎంత గోప్యంగా జరిగేదో స్విప్ట్ తెలియపరిచాడు. చర్చిస్థాయిలో జరిగే అవినీతిని అన్యాయాలను తెలియ పరచడమే ధ్యేయంగా తను ‘గలివర్ ట్రావెల్స’ ను రచించాడు. ‘గలివర్ ట్రావెల్స’ లోని ప్రథమభాగంలో చెప్పిన ‘A Vశీyaస్త్రవ tశీ Lఱశ్రీశ్రీఱజూut్ణ ప్రధానంగా ఇంగ్లాండు దేశంలోని నాటి చర్చి రాజకీయల తీరుతెన్నులను ప్రజలకు తెలియపరచటమే ధ్యేయంగా ఈ రచన చేశాడు. ప్రజలను జాగృతం చేయటమే లక్ష్యంగా ఈ ఊహా యాత్ర చరిత్ర సాగించాడు.
ఇంగ్లాండు దేశంలోని చట్టాలు కొందరికి చుట్టాలుగా ఉండేవి. అందరికి ఒకేన్యాయం జరిగేదికాదు. దోపిడిదారులు బయటప్రపంచంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతుంటారు. అమాయకులు, నిర్దోషులు దోషులుగా శిక్షను అనుభవిస్తుంటారు. పలుకుబడికి, ధనానానికి న్యాయం అమ్ముడుపోతుంది. వీటన్నింటిని తుదముట్టించాలని అందరికి ఒకే విధంగా చట్టాలు, న్యాయాలు ఉండాలని, అన్యాయంగా చెరసాలలో బంధింప పడ్డవారిని రక్షించాలని జొనాథన్ స్విఫ్ట్ పూనుకున్నాడు. దేశప్రజలు అధికారబలానికి, ధనబలానికి ఎంతగా మోసపోతున్నారో తెలియపరచాలన్న ధ్యేయంతో తెరవెనుక పెద్దమనుషులు చేస్తున్న పాపాలను బయటపెట్టాలని, తద్వారా వారికి గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతోనే జొనాథన్ స్విప్ట్ ‘గలివర్ ట్రావెల్స’ను రచించాడు.
ఏ దేశమైనా ప్రజాసంక్షేమమే ప్రథమంగా పనులు నిర్వహించాలని తెలియజేశాడు. ప్రజలకు ఉపయోగకరమైన విజ్ఞానం అందించాలని కోరాడు. మానవకళ్యాణానికి, మస్తిష్క వికాసానికి కావలసిన రంగంలోనే విద్యావేత్తల కృషి జరగాలని ఆశించాడు. యుద్ధాల్లో జయింటానికి సైన్యం పోషించబడరాదని, ప్రజల అభివృద్ధి వికాసానికి అవసరమైన రీతుల్లోనే సైన్యం పోషింపబడాలని కోరాడు. నాటి ప్రభుత్వాల పనితీరుకు విస్మయం చెంది ‘గలివర్ ట్రావెల్స’ లోని రెండవభాగంలో చెప్పిన కథ నాటి ప్రభుత్వ పరిపాలనకు నిలువుటద్దం. ఈ కథ ద్వారా నాటి వ్యవస్థలోని చెడును సమÖలంగా కడిగెయ్యాలని ‘జొనాథన్ స్విఫ్ట’ సంకల్పించాడు.
నాడు ఇంగ్లాండులో విజ్ఞానశాస్త్రం మానవ మనుగడకు, మానవుని దైనందిన జీవితానికి అంత ప్రయోజకారిగా ఉండేది కాదు. వినూత్న ప్రయోగాల పేరుతో మనిషి తన ఉనికిని మరిచి చేసే ప్రయోగాలను జొనాథన్ స్విఫ్ట్ ఖండించాడు. ప్రయోగాలతో నిరంతరం యాంత్రిక జీవితం గడుపుతూ ప్రేమాభిమానాలకు, సుఖసంతోషాలకు దూరంగా ఉంటూ కాలాన్ని విజ్ఞానాన్ని మరిచిపోయి చేసే ప్రయత్నాలను ఖండించటమే ధ్యేయంగా ఈ రచనను చేశాడు. మనిషితో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం యంత్రాలచేతే మనిషి పనులు చేయించటం, ఇక మానవ జన్మ వృథా అని తెలియజేశాడు. ప్రాణమున్న మనిషి యంత్రమైతే భగవంతుడి మానవ సృష్టికి అర్థంలేకుండా పోతుందని ఇలాంటి స్థితి నుండి మనిషి మేల్కొనాలన్న ధ్యేయంతో జొనాధన్ స్విఫ్t్ట ‘గలివర్ ట్రావెల్స’ ను రచించాడు.
‘గలివరు ట్రావెల్స’ లోని మÖడవభాగంలో చెప్పిన ‘A Yశీyaస్త్రవ tశీ Laజూuta్ణ కథలో భవిష్యత్తులో మానవుల ఆలోచనలు ఎంత వికృతరూపం దాల్చుతాయో తెలియజెప్పాడు. ఈ కథ ద్వారా శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న అభివృద్ధివల్ల మనిషి ఆలోచనలు దినదినానికి ఎంత వినాశనానికి దగ్గరౌతున్నాయో తద్వారా సంభవించే విఘాతం ఏంటో హెచ్చరిస్తూ చెప్పాడు. పిల్లలకు విద్యాలయాల్లో బోధించే విద్య వ్యక్తి వికాసానికి మానసిక పరిపక్వతకు సంబంధించిందై ఉండాలని కోరాడు.
జొనాథన్ స్విప్ట్ ‘గలివర్ ట్రావెల్స’ లోని చివరిభాగంలో చెప్పిన ‘A Vశీyaస్త్రవ tశీ Hశీuyష్ట్రఅష్ట్రఎఎ Laఅd్ణ కథ ద్వారా నాటి మÖర్ఖులను, దుర్మార్గులను వారి కార్యాక్రమాలను తెలియజేశాడు. దుష్టులు నిరంతరం ఎదుటివారి వినాశనానికే ఎట్లా ప్రయత్నిస్తారో తెలియజేశాడు.
సన్మార్గుల ఉద్దేశాలు సదా మానవ సంక్షేమం గురించే ఉంటాయని అట్లాంటి మంచి ఆలోచనలు కలిగుండాలని తెలియజేస్తాడు. దుర్మార్గులను సన్మార్గులుగా మార్చటానికి లేదా దుర్మార్గం అనేది ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో తెలపటమే తన లక్ష్యంగా జొనాధన్ స్విప్ట్ ‘గలివరు ట్రావెల్స’ ను రచించాడు.
‘గలివరు ట్రావెల్స’ ద్వారా నాడు ఇంగ్లాండు దేశంలోని ప్రజలందరినీ కర్తవ్యోన్ముఖులను చేయాలని అనుకున్నాడు. మనిషిని మనిషిగా గుర్తించి సాటిమనిషిని గౌరవించాలని కోరుకున్నాడు. సమాజాన్ని అన్ని కోణాల్లోంచి పరిశీలించి మేలైన మనుగడకు అందరు ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఈ రచన సాగింది. ప్రకృతికి విరుద్ధంగా వాస్తవానికి దూరంగా జీవించటానికి అలవాటుపడితే మానవజాతికే ముప్పువాటిల్లుతుందని తెలియజేశాడు. విజ్ఞానం పేరు మీద వివేకం మరచిపోతే భవిష్యత్తు భయంకరంగా మారుతుందని వచ్చేతరమంతా అంధకారంలో జీవించవలసి వస్తుందని, అట్లాంటి పరిస్థితి రాకూడదనే ‘గలివరు ట్రావెల్స’ అనే ఆయుధం ఒకటి సంధించాడు.
భూమ్మీద మనిషి బ్రతకటానికి జీవితం సుఖమయం చేసుకొనుటకు కావలసింది చాలా అల్పమని, అందునిమిత్తం మనిషి చేయవలసినదేదో చేయటం లేదని నిరాశను ప్రకటించాడు. సరియైన పద్ధతిలో జరగవలసిందేది ఎక్కడా జరగటం లేదని, రాబోయే విపత్తును ఎవరూ గుర్తించటం లేదని, మొత్తం మానవజాతినే అసహ్యించుకొంటూ జొనాథన్ స్విప్ట’ ‘గలివరు ట్రావెల్స’ ను రచించాడు.
కుట్రలు, కుతంత్రాలు, స్వార్థచింతన, సంకుచిత మనస్తత్వం, మÖర్ఖత్వం, దుర్మార్గం, లంచగొండితనము, అన్యాయం, అధర్మం, అక్రమం, రాగద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, వికృత ఆలోచనలు, పశుత్వం, దోపిడీలు, దౌర్జన్యాలు, పరపీడనం, హింసించటం, మభ్యపెట్టడం, వంచించటం, మోసగించటం లాంటి చెడ్డగుణాలపై మనిషి విజయం సాధించాలని, మనిషిలోని ఇట్లాంటి గుణాలపై ప్రయోగాలు జరగాలని కోరుకున్నాడు. లోక కళ్యాణం జరగాలన్నా, మనిషి మనీషిగా బ్రతకాలన్నా ఇట్లాంటి చెడు గుణాలన్నీ, ఆలోచనల్ని దహనం చేయాలనే లక్ష్యంతో జొనాథన్ స్విఫ్ట్ ‘గలివరు ట్రావెల్స’ ను రచించాడు. రచయిత ఊహాసృష్టి అయిన ఈ ‘యాత్రచరిత్ర’ మనిషిని అన్ని కోణాల్లోనుంచి ఆలోచించమని తెలియజేస్తుంది. ఒక అద్భుత సుందర సామ్రాజ్యం కోసం జొనాథన్ స్విఫ్ట్ ఆరాటపడ్డాడు. అది సర్వమానవాళికి కావాలని ఆశించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి