మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

ఓం నమః శివాయ:

‘ఓం నమ: శివాయ’ ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన ఈ మహా ఈశ్వరుడు లయకారుడు అత్యంత శక్తి సమన్వితుడు. 

ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది మనము ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. 

ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. 

అంతేకాదు వీలైనప్పుడల్లా ఓం నమః శివాయ అని మనం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. 

‘ఓం నమః శివాయ’ అనే మంత్రంలో న, మ, శి,వా, య అనే ఐదు అక్షరాలున్నాయి. ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి. 

యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావించారు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మబద్ధంగా చేస్తుంది. 

పాజిటివ్ వైబ్రేషన్స్ : (సానుకూల ప్రకంపనలు)

ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుందని శాస్త్ర వచనం. 

డిప్రెషన్ అంటే నైరాశ్యం 

ఈ మంత్రాన్ని క్రమంతప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నైరాశ్యం, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించి, ప్రశాంతత కలిగిస్తుంది. 

108 

ప్రతి రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. జీవితంలో ప్రశాంతత పొందుతారు. 

ఎప్పుడు స్మరించాలి? 

ఓం నమః శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వేకువజామున స్నానం చేసి, పద్మాసనం వేసుకుని నిటారుగా కూర్చోవాలి. కళ్లు మÖసుకుని జపమాల తీసుకుని ఓం నమః శివాయ మంత్ర జపం మొదలు పెట్టాలి. ఒకవేళ జపమాల లేకపోతే. వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. జపసంఖ్య 108 గా ఉండాలి. 

ధ్యానం 

108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్లు మÖసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ (సానుకూలశక్తి) మీ శరీరం గ్రహిస్తుంది. 

ఓం నమ:శివాయ

శివాయనమః

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి