మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, అక్టోబర్ 2026, శనివారం

కటిక పేదరికం, నిరక్షరాస్యత మరియు భయం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్భంధ కార్మికుల గమ్య స్థానంగ మారిపోయింది. నిర్భంధ కార్మికవ్యవస్థ ఎంతగా వేళ్ళూనుకుంటున్నదో అంతగా అమలవుతున్నది. ఈ రోజుల్లో కూడ నిర్బంధ కార్మిక వ్యవస్థ గురించిన విషయాలు వెలుగులోకి రావట్లేదు. వచ్చేటివైన చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో వున్న కార్మికులతో పాటు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన అట్టడుగు వర్గాలవారు ఈ నిర్బంధ కార్మిక వ్యవస్థ చేత వేటాడబడుతున్నారు అని వెట్టి విమోచన సంస్థ కన్వీనర్ అయిన రావి సునిల్ కుమార్ అన్నారు. ఆ సంస్థ సేకరించిన సమాచారం మేరకు 2023 జనవరి నుండి నేటి వరకు (ఈ వార్త ది హిందూ పత్రికలో 31 మే 2025 న ప్రచురిత మయ్యే) వరకు 402 మంది నిర్బంధ కార్మిక వ్యవస్థ నుండి రక్షించబడ్డారు. వీరిలో చాలా మంది అంకమ్మ కులానికి చెందిన యానాది వారే ఎక్కువగా వున్నారు. 

డినోటిఫైడ్, నొమడిక్ మరియు సెమినొమడిక్ గిరిజనుల మీద అధ్యయనం చేసే జాతీయ కమీషన్ 2008లో ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వున్న యానాదీలు 59వ డినోటిఫైడ్ గిరిజనులు మరియు 60వ నొమడిక్ (సంచార) గిరిజనులుగా వున్నారు. 2011 జనాభ గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో యానాదీల జనాభా 5 లక్షలకు పైగానే వుంది. 

యానాదీలు కటిక పేద వాళ్ళు. రెక్కలమ్ముకుని (శ్రమను అమ్ముకుని) బ్రతికే వారు. వీరిలో 35.35% అక్షరాస్యత మాత్రమే వుందని విశాఖపట్నం విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రాల అధ్యయన కేంద్రం పరిశోధకుడు నూర్‌భాషా బాబావలి అన్నారు. వారికి చట్టపరమైన విషయాలు తెలవక పోవడం వల్ల దోపిడికి గురువుతున్నారు. అక్షరజ్ఞానం లేకపోవడం వల్ల వారిలో గూడుకట్టుకున్న భయం వారిని మొత్తం సమాజం నుండి దూరంగ ఉ డడానికి కారణమవుతున్నది. యానాదీలకు నయాపైసా ఆస్తిపాస్తులు లేవు. వారికి స్వంత భూమి అనేది లేకపోవడం వల్ల కాలువల గట్ల మీద, కొండప్రాంతాలలో గుడిసెలు వేసుకుని నివసిస్తారు. తాము (తాను) చేసేది వెట్టి చాకిరి అని అది చట్ట విరుద్ధమనే విషయం తనకు తెలియదని యానాది అంకమ్మ చెప్పింది. 

నాగరికుల పట్ల వుండే భయం వల్ల యానాదీలు సహాయం చేస్తామన్న తమ విషయాలు కొత్తవారికిì చెప్పుకోరని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి దగ్గరలో వున్న అల్లూరులో వుండే యానాది నాయకుడు సిహెచ్ వెంకటేశ్వర్లు చెప్పాడు. కష్టాలు బయటికి చెబితే తమ యజమానులు కొడతారని అంకమ్మ లాంటి వారు చెప్పడానికి భయపడతారు. సిహెచ్ వెంకటేశ్వర్లు మరొక సంఘటన గురించి వివరించారు. కొన్ని నెలలనుండి పల్నాడు జిల్లాలో పొలంలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు కార్మికులు విద్యుధ్ఘాతంతో చనిపోయారు. ఇది జరిగినప్పటికి మిగతావారు గత్యంతరం లేక ఇంకా అక్కడే నిర్బంధ (వెట్టి చాకిరీ) కార్మికులుగా పనిచేస్తున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి