కళ మనం చూడడానికి, ఆస్వాదించడానికి కాదు. మనకి జీవితాన్ని చూడడం, ఆస్వాదించడం నేర్పడానికి. ఈ మౌలిక సిద్ధాంతం మీదనే సినిమా ఎదిగింది, సినిమా ప్రస్థానం నడిచింది. మన దేశంలో కళకి పునాది మన సంస్కృతి. నృత్యం, నాటకం, జానకద కళారూపాలు, ఉత్సవాలు అన్నీ మన ఇతిహాసాలు, పురాణాల నుండి ప్రేరణ పొందుతూ ఎదిగాయి, వెలిగాయి. అలాగే మన తొలి నాటి సినిమా కూడా.
కదిలే బొమ్మలు రఘుపతి వెంకయ్యను విశేషంగా ఆకర్షించాయి. వెంకయ్యకు మద్రాస్ మౌంట్ రోడ్‌లో ఫొటో స్టూడియో ఉండేది. ఫోటోగ్రఫీ అంటే వెంకయ్యకు పిచ్చి. అదే లోకం. మిస్ క్రావెన్ అనే ఇంగ్లీషు యువతి దగ్గర ‘క్రోనో మెగా ఫోన’ అనే యంత్రం కొన్నాను. దానితో పాటు కొన్ని ఫిల్ములు, గ్రామఫోను రికార్డులూ. రికార్డుల్లో పాట వస్తుంటే, గోడకు కట్టిన తెల్లటి తెరమీద క్రోÁనో మెగా ఫో·న్ బొమ్మలు కదులుతున్నట్టుగా చూపించేది.
మద్రాస్ హైకోర్ట్ బయట వున్న ఖాళీ స్థలంలో ఓ చిన్న గుడారం వేసి, వెంకయ్య ‘అండర్ ది పనామా’, ‘అమెరికన్ ఫైర్‌మాన్స్ సాంగ’, ‘స్వింగ్ సాంగ’, ‘సీ సర్పెంట’ ‘మికాడో’ లాంటి చిన్న చిన్న నిడివి తక్కువ ఫిల్ములు ప్రదర్శించేవాడు. మద్రాసులో లభించిన విశేషమైన స్పందన ఇచ్చిన పోత్సాహంతో దేశం మొత్తం ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. బర్మా, మలయా యాత్రలు కూడా పూర్తి చేసుకుని మద్రాస్ వచ్చాక గెయిటీ థియేటర్ ప్రారంభించాడు. అది ప్రముఖ జర్మన్‌షిప్ ఎండెన్ బంగాళాఖాతపు జలాల్లో ప్రవేశించిన సంవత్సరం అది. ఇంగ్లాండ్‌కు చెందిన బార్కర్స్ మోషన్ పిక్చర్ స్టూడియో వాళ్ల డిస్ట్రిబ్యూటర్ గోమాంట్ & కో వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుని, క్రౌన్, గ్లోబ్ (తరువాత రాక్సీగా పేరు మారింది) ధియేటర్లు తెరిచాడు.
వెంకయ్య తెరిచిన ధియేటర్ల ప్రేరణతో తిరుచిరాపల్లిలో సామ్యుల్ విన్సెంట్ కూడా జర్మనీ పరికరాలతో టెంట్ సినిమాలు ప్రదర్శిస్తూ, కోయంబత్తూరులో కరో·నేషన్ పిక్చర్ ప్యాలస్ నిర్మించాడు.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. కొంత ప్రశాంతత నెలకొన్న తర్వాత వెంకయ్య తన కొడుకు ఆర్ ప్రకాష్‌ను సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకోవడానికి ఇంగ్లాండ్ పంపించాడు. బార్కర్స్ మోషన్ పిక్చర్ స్టూడియోలో దర్శకత్వంలో కూడా తర్ఫీదు పొందిన ప్రకాష్ ఇటలీలో మిలాన్ ఫిల్మ్ సంస్థలో, ఫ్రాన్స్‌లో పటే స్టూడియోస్‌లో పనిచేసి, ప్రపంచస్థాయి టెక్నాలజీ మీద అవగాహన పెంచుకున్నాడు. హాలీవుడ్‌లో సెసిల్ డి మిలీ తీసిన “ది టెన్ కమాండ్‌మెంట్స” కు పనిచేసాడు.
ప్రకాష్ ఇండియా వచ్చాక వెంకయ్య విలియంసన్ కెమెరా, ఇతర పరికరాలు కొనుగోలు చేసి “స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిల్మ్స్ స్టూడియో” ప్రారంభించాడు. పిఠాపురం మహారాజా, సర్ ఆర్.కె. షణ్ముఖం చెట్టియార్, దివాన్ బహదూర్ గోవిందదాస్ చతుర్భుఖ్ దాస్, వెంకయ్య, ప్రకాష్ ‘స్టార్ ఆఫ్ ఈస్ట’ కు డైరక్టర్లుగా వ్యవహరించేవారు.
మొదటి సినిమా భీష్మప్రతిజ్ఞ, దర్శకుడు ప్రకాష్. ఇంగ్లీష్ అమ్మాయి, పెగ్గీ కాస్టెలో, బెన్నీ కాస్టెన్ అనే యÖరోపియన్, ఎనారాయ ణనన్, ఇంకా భీష్ముడిగా ప్రకాష్ నటించారు. గెయిటి థియేటర్‌లో ప్రివ్యూ సందర్భంగా జరిగిన సమావేశానికి డాక్టర్ సి.పి. రామస్వామి అయ్యర్ అధ్యక్షత వహించారు. తరువాత ఈ సినిమా బొంబాయిలో మెజిస్టిక్ సినిమా థియేటర్‌లో కూడా ప్రదర్శింపబడింది. ఈ సినిమా విజయం నేపథ్యంలో “గజేంద్ర మోక్షం” “ఉషాస్వప్నం”, “కోవలన”, “నందనార” సినిమాలు వచ్చాయి.
సమాజం ముఖచిత్రం మారుతున్న కాలంలో ప్రేక్షకుల అభిరుచులను స్పష్టంగా పట్టుకున్న ప్రకాష్ తెలిసిన అందరికీ నచ్చిన పురాణ కథలను ఇతివృత్తాలుగా తీసుకుని, వాటిని పూర్తి భారతీయ సంప్రదాయాలు, ముచ్చట్ల నేపథŠ్యంలో ఆకట్టుకునేలా అందించడం మీద పట్టు సాధించాడు.
నైతిక విలువలకు పట్టం కడుతూ కథ అల్లుకురావడంతో ప్రేక్షకుల మనసుకు ప్రతి సినిమా హత్తుకునేది. ఒక షాట్లో వందలమందిని చూపించి, వెంటనే మరో షాట్‌లో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా చూపిస్తే ఆ వందలకుంది ఏమయ్యారని నోరు వెళ్లబెట్టే స్థాయి నుంచీ, ప్రేక్షకులు దర్శక రచయితలు చెప్పదలుచుకున్న దాన్ని, అర్ధం చేసుకుని, అన్వయించుకునే స్థాయికి ఎదుగుతూ వచ్చారు. కథలలో, కావ్యాలలో చదివినవి కళ్ళ ముందు కనబడుతుంటే కథనాన్ని అనుసరించి ఆస్వాదించడం నేర్చుకున్నారు.
ఒక సీన్‌లో మదురై మీనాక్షి ఆలయగోపురం చూపించే క్రమంలో కెమెరాను ఆలయ ముఖద్వారం దగ్గర పెట్టి, గోపురం ఎలివేషన్ చూపించారు. సినిమా చూస్తున్న ఓ ప్రేక్షకుడు ఆ షాట్ చూసి లేచి గగ్గోలు పెడుతూ గోపురం నేలలోకి కూరుకుపోతోంది, కాపాడు దేవుడా అంటూ ఆర్తనాదాలు చేసాడట. చిన్న చిన్న ఉపాయాలతో ట్రిక్ ఫొటోగ్రఫీని ప్రవేశపెట్టి, ప్రకాష్ ప్రేక్షకుల ఆలోచన పరిధిని పెంచాడు.
ప్రేక్షకులకు సినిమా చూడడం నేర్పాడు. మద్రాసు ప్రభుత్వం కోసం ‘ఆరోగ్యం-పరిరక్షణ’ గురించి కూడా లఘుచిత్రాలు నిర్మించి ఇవ్వడం జరిగింది.
అదే ఏడాది పుదుకొట్టాయికి చెందిన నాగలింగం అనే ఓ పహిల్వాన్ ఉమ్మర్ సుభానీ అనే రాజవంశానికి చెందిన వ్యాపారి ఇంటికి అతిధిగా బొంబాయి వెళ్లడం జరిగింది. సుభానీ నాగలింగం పేరును రాజా శాండోగా కూర్చి, సినిమాకు పరిచయం చేసాడు. స్టార్ ఫిల్మ్స్ తో పాటు కృష్ణా ఫిల్మ్ కంపెనీ, ఇంపీరియల్, జగదీష్ ఫిల్మ్స్, రంజిత్ ఫిల్మ్స్ లో సులోచన, జుబేదా, గౌహర్ వంటి నటీమణుల సరసన నాయకుడిగా నటించాడు.
ఇక్కడ ఏ నారాయణన్ గురించి కూడా చెప్పుకోవాలి. 1922లో ఎగ్జిబిటర్స్ ఫిల్మ్ సర్వీస్ నడుపుతూ, ఎడ్డీపోలో, ఎల్మో లింకన్ సీరియల్స్ ప్రదర్శిస్తూ పాపులర్ సినిమా (తర్వాత స్టార్ థియేటర్ అయింది) నిర్వంహించేవాడు. 1924 లో మద్రాస్ నుండి ఇంగ్లాండ్ జర్మనీ వెళ్ళి సినిమా నిర్మాణ మెళకువలు నేర్చుకుని 1926 లో ఇండియా తిరిగివచ్చాడు. 1927లో మద్రాసులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలను చిత్రించి జనరల్ పిక్చర్స్ కార్పొరేషన్ స్టూడియో (జిపిసి) ద్వారా విడుదల చేసాడు.
జిపిసి నిర్మించిన మొదటి సినిమా ‘ధర్మపత్ని’. సాంఘిక ఇతివృత్తంతో నిర్మించిన ధర్మపత్నికి ప్రముఖ రచయిత, నటుడు టి.పి. కైలాసం దర్శకత్వం వహించారు. కైలాసం బ్రిటిష్ రంగస్థలంపై సర్ జాన్ ఫోర్బ్స్ రాబర్ట్ సన్, సర్ హెన్రీ ఇర్వింగ్, సర్ సెడ్రిక్ హాడ్విక్ వంటి ప్రముఖులతో నటించిన అనుభవం కలవాడు. తరువాత కైలాసం జిపిసి ని విడిచి పెట్టి, మోహన్ భావ్నానీ నిర్మించిన మÖకీ చిత్రం ‘వసంత సేన’ లో శకారుడిగా నటించాడు. ఇదే సినిమాలో మీనాక్షి రామారావు, జయ్ కిషన్ నందా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. వసంతసేన నిర్మాణం మొత్తం మదురై, మైసూర్ లలో జరిగింది.
నారాయణన్ నిర్మించిన రెండు డజన్లకు పైగా సినిమాలలో చాలావరకు రఘుపతి ప్రకాష్ దర్శకత్వంలో నిర్మించబడగా, కొన్నిటికి జతేన్ బెనర్జీ దర్శకత్వం వహించాడు. వాటిలో చాలా వరకూ ‘మత్స్యావతార’ వంటి పౌరాణికాలు కాగా, కొన్ని అరేబియన్ కథల ఆధారంగా తీసిన ‘లైలా, స్టార్ ఆఫ్ మింగ్రేలియా’ వంటి జానపద చిత్రాలు. తెరమీద మహిమలు, మహత్యాలు, పోరాటాలు, సాహసాలు, గుర్రపుస్వారీలు చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. మళ్లీ మళ్లీ చూసారు. టికెట్టు కొనుక్కుని సినిమా చూడడం అనేది ప్రజల జీవనశైలిలో ఓ భాగమైంది. ఓ అలవాటుగా మారింది. ఈ అలవాటు ప్రతి కొత్త సినిమాతో పెరుగుతూ వచ్చింది.
రాజా శాండోకి అప్పటికే హీరోగా మంచి పేరొచ్చింది. 1929 లో శాండో మద్రాసుకు వచ్చి బి పద్మనాభన్ భాగస్వామ్యంతో ‘అసోసియేటెడ్ ఫిల్మ్స’ స్థాపించాడు. స్టోరీ రైటర్, మేనేజర్‌గా కె. సుబ్రహ్మణ్యం వాళ్లతో కలిసాడు. టిపి రాజ్యలక్ష్మి కథానాయికగా తను నటిస్తూ, ‘ఉషాపరిణయం, డెవిల్ & ది డాంసెల్, ఆర్ఫాన్ గర్ల్, రాజేశ్వరి’ మొదలైన సినిమాలకు దర్శకత్వం మహించి నిర్మించాడు రాజశాండో.
జిపిసిలో నటించిన వైవి రావు బెంగళూరులో సూర్య ఫిల్మ్ కంపెనీ మొదలెట్టి మÖడేళ్లలో నలభైకి పైగా స్టంట్ సినిమాలు నిర్మించాడు.
పెద్ద పెద్ద బంగళాల ఆవరణలో సరుగుడు బాదులతో వేదిక నిర్మించి, పైన, నాలుగు గోడలు తెల్లటి గుడ్డతో కవర్ చేసేవారు. అదే స్టూడియో ఫ్లోర్ ఆ రోజుల్లో. వేరే లైటింగ్ లేదు. సహజమైన వెలుగులోనే తీసేవారు. మంచి కళాకారులు, నటులు, టెక్నీషియన్లు, ఆఖరికి సరైన టైలర్లు కూడా దొరకని రోజులు. ముందుకు వచ్చిన వారికి అనుభవం ఉండేది కాదు. ఆ రోజుల్లో మౌల్డ్‌తో సెట్ తయారుచేయడమంటే తెలీదు. బ్యాగ్రౌండ్ మొత్తం పెయింటింగే. ఎల్ మోడల్ డెబ్రీ, అస్కానియా డెల్రీ, ఆర్టెల్ కెమెరాలు వాడేవారు. కోడక్ ఫిల్మ్ ఎక్కువగా అందుబాటులో ఉండేది. ఆగ్ఫా కూడా ఎక్కువగా 35ఎంbం లెన్స్ వాడేవారు.
టింటెడ్ పాజిటివ్ ఇల్ఫోర్డ్ కంపెనీ నుంచి వచ్చేది. నటీనటులు ఎక్కువగా పేరొందిన డాన్సర్లు, ఆంగ్లో ఇండియన్లు, క్రిస్టియన్ కళాకారులనుంచి వచ్చేవారు. జీతం నెలకు నలభై నుంచి రెండు వందల వరకూ ఉండేది. ఒక సినిమా తియ్యడానికి ఆరు వేల నుంచి ఇరవై వేల వరకూ ఖర్చయ్యేది. మÖడు ప్రింట్లు విడుదలైతే, అవి 150 ప్రదర్శనల వరకూ పనికొచ్చేది.
కథనం, చిత్రీకరణలో చూపించిన నైపుణ్యం నాటి సినిమాలకు బలం. వనరులు, సాంకేతికత పరిమితం. అయితే అద్భుతమైన సృజన కల నిర్మాతలు, దర్శకులు అందుబాటులో వున్న వనరులతోనే తెరమీద అద్భుతాలు సృష్టించారు. ఒకసారి అవుట్‌డోర్‌లో గుర్రాల రేస్ తియ్యాల్సి వచ్చింది. వాతావరణం మబ్బుపట్టి వుండడంతో షూటింగ్ ఆగిపోయింది. యÖనిట్‌లో అనేకమంది ఎక్సాట్రాలున్నారు. అందరినీ మళ్ళీ సమకూర్చుకోవడం తలకు మించిన భారం. అలా అని వెలుగు షూటింగ్ కి సరిపోయేలా లేదు.
ఎదురు చూసి చూసి విసుగెత్తిన నారాయణన్ షూటింగ్ అలాగే చేసేయమని ప్రకాష్‌ను ఆదేశించాడు. ప్రింట్‌ను నీలం రంగులో వేయించి, ‘ది నైట’ పేరుతో విడుదల చేస్తే, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఇంకో ముచ్చట. థియేటర్‌లో ఉద్వేగంతో కథాగమనాన్ని వివరించడానికి యజమానులు కథకులను నియోగించేవారు. ఒక్కోసారి వీళ్లు సన్నివేశానికి తకు స్వంత పాండిత్యం జోడించి మరీ వినిపించేవారు. అప్పట్లో ఒకే ప్రొజెక్టర్‌తో థియేటర్ నడిచేది. దానికి రెండు వేల అడుగుల మాగజైన్ సిత్తు పెట్టగానికే ఏర్పాటు ఉండేది. దాంతో రీలు మార్చాల్సి వచ్చేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి